Cabinet నుంచి తొలగింపుపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు.. సీఎం రేవంత్‌పై తీవ్ర ఆరోపణలు

కేబినెట్ నుంచి తొలగింపుపై కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూ, కాంగ్రెస్‌ను వీడేది లేదని స్పష్టం చేశారు.

konda-surekha-cabinet-removal-revanth-reddy-allegations
konda-surekha-cabinet-removal-revanth-reddy-allegations

Cabinet నుంచి తనను తొలగించడంపై మంత్రి కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు.

గుండు సుధారాణిని పెట్టడం, వేరెల్ల శారదను Commission Chairmanగా కొనసాగించడం.. ఇలా ముగ్గురు BC మహిళలకు తన వల్ల పదవులు రావడం తనకు చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు.

“మున్నూరు కాపును balance చేశారు.. మా పద్మశాలిని కూడా balance చేశారు. ఉరి కంబం ఎక్కేటప్పుడు చివరి కోరిక ఏంటి అని అడుగుతారు. కానీ ఈరోజు నన్ను మంత్రివర్గం నుంచి తీసేసేటప్పుడు కనీసం నన్ను ఒక్క మాట కూడా అడగలేదు” అని కొండా సురేఖ వ్యాఖ్యానించారు.

తనను Cabinet నుంచి తొలగించే ఉద్దేశం కాంగ్రెస్ high commandకు లేదని, అది తనకు 100 శాతం తెలుసని ఆమె అన్నారు.

అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుబట్టి.. “మీరు నన్ను తొలగిస్తారా? లేకపోతే నేను వెళ్లిపోవాలా?” అనే విధంగా pressure తీసుకొచ్చి, తనను భర్తరఫ్ చేయించే కార్యక్రమం చేశారని ఆమె ఆరోపించారు.

తనపై, తన OSDపై జరుగుతున్న కుట్రల వెనుక పలువురు ఉన్నారని కొండా సురేఖ ఆరోపించారు.

వేం నరేందర్ రెడ్డి , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి తదితరులు కలిసి తనపై కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు.

తన కూతురు చేసిన వ్యాఖ్యలకు తనపై కక్ష తీర్చుకోవడం చాలా బాధాకరమని అన్నారు.

తన పేరు, తన OSD పేరు ఉపయోగించి డబ్బులు వసూలు చేస్తున్నారనే అంశంపై కూడా ఆమె మాట్లాడారు.

ఈ వ్యవహారంలో సుమంత్ స్వయంగా ఫోన్ చేసి తన పేరుతో, కొండల్ రెడ్డి పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పడంతో.. సంబంధిత వ్యక్తిని పోలీసులకు అప్పగించినట్లు ఆమె తెలిపారు.

అదే సమయంలో కాంగ్రెస్‌లో చాలామంది నాయకులు బయట మాట్లాడుతున్నారని, వారి పేర్లు అందరికీ తెలుసని కొండా సురేఖ అన్నారు.

“వాళ్లు ఎవరిపై ఆరోపణలు చేసినా ఇప్పటివరకు ఎందుకు action తీసుకోలేదు?” అంటూ ఆమె ప్రశ్నించారు.

PCC అధ్యక్ష పదవిని రూ.50 కోట్లు ఇచ్చి కొనుక్కున్నారని ఆరోపణలు చేసిన వారికే Chairman పదవులు ఇచ్చి సన్మానించిన సందర్భాలు ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు.

తన రాజకీయ ప్రయాణంపై కూడా కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు.

“నేను TRS పార్టీ నుంచి గెలిచినప్పుడు TRSలోకి వచ్చి, మళ్లీ అక్కడ MLC తీసుకుని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కాంగ్రెస్‌లోకి వచ్చినవాళ్లు కూడా ఇప్పుడు పెద్ద హీరోల్లా మాట్లాడుతున్నారు” అంటూ పరోక్షంగా విమర్శించారు.

అంతేకాదు.. కాంగ్రెస్‌లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ నిజంగా సంతోషంగా ఉన్నారా? అని ఆమె ప్రశ్నించారు.

“మీరు సంతోషంగా లేరనే విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించండి. ఈరోజు నాకు జరిగింది.. రేపు మీకు కూడా జరిగే అవకాశం ఉంటుంది” అని కొండా సురేఖ అన్నారు.

తనను రాజకీయంగా పైకి తీసుకురావడం రేవంత్ రెడ్డి వల్ల కాలేదని ఆమె వ్యాఖ్యానించారు.

“నిన్న గాక మొన్న వచ్చిన కడియం శ్రీహరి తన బిడ్డను MP చేసుకున్నారు. కానీ మీరు కనీసం నాకు MLA ticket ఇప్పించే పరిస్థితిలో కూడా లేరు. ఒక Chairman పదవి తెచ్చుకునే పరిస్థితిలో కూడా లేరు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Cabinet నుంచి తొలగించినా తాను ఎమ్మెల్యేగా కొనసాగుతానని కొండా సురేఖ స్పష్టం చేశారు.

తన నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తూ MLAగా తన విధులు నిర్వహిస్తానని చెప్పారు.

అయితే.. తాను రాజీనామా చేస్తున్నారా? పార్టీకి రాజీనామా చేస్తారా? అని మీడియా ప్రశ్నించగా..

“లేదు.. లేదు” అంటూ కొండా సురేఖ స్పష్టంగా సమాధానం ఇచ్చారు.

అంటే Cabinet నుంచి తొలగించినా Congress పార్టీని వీడే ప్రసక్తే లేదని కొండా సురేఖ తేల్చి చెప్పినట్లయింది.

ఇప్పుడు ఈ వ్యాఖ్యలతో తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరింత ముదిరే అవకాశం ఉందా?
రేవంత్ రెడ్డి వర్సెస్ కొండా సురేఖ వివాదం ఎలాంటి మలుపు తీసుకోబోతోంది?

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »