10.09 సెకన్లలో గురిందర్‌వీర్ గోల్డ్ జాతీయ రికార్డు

రాంచీ ఫెడరేషన్ కప్‌లో భారత స్ప్రింటింగ్ చరిత్రను తిరగరాసిన పంజాబ్ యువ అథ్లెట్‌పై ప్రశంసల వెల్లువ.

10.09 Secondsలో గురిందర్‌వీర్ చరిత్ర.. 100mలో కొత్త జాతీయ రికార్డు
Gurindervir Singh Creates National Record in 100m Sprint
  • గురిందర్‌వీర్ సింగ్ 100 మీటర్ల పరుగును 10.09 సెకన్లలో పూర్తి చేశాడు
  • రాంచీలో జరిగిన ఫెడరేషన్ కప్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు
  • 10.10 సెకన్లలోపు 100 మీటర్లు పూర్తి చేసిన తొలి భారత అథ్లెట్‌గా రికార్డు

భారత స్ప్రింటింగ్‌లో కొత్త చరిత్ర.. 10.09 సెకన్లలో గురిందర్‌వీర్ సంచలనం

Gurindervir Singh భారత అథ్లెటిక్స్ చరిత్రలో అరుదైన ఘనత సాధించాడు. Ranchiలో జరిగిన ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ పోటీల్లో 100 మీటర్ల పరుగును కేవలం 10.09 సెకన్లలో పూర్తి చేసి గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. ఈ ప్రదర్శనతో భారత స్ప్రింటింగ్‌లో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పడమే కాకుండా, 10.10 సెకన్లలోపు 100 మీటర్ల రేసును పూర్తి చేసిన తొలి భారతీయ అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు.

పంజాబ్‌లోని జలంధర్ జిల్లా పటియాలా గ్రామానికి చెందిన గురిందర్‌వీర్ ఫైనల్ రేస్ ప్రారంభం నుంచే దూకుడుగా కనిపించాడు. స్టార్ట్ నుంచి చివరి వరకు అదే వేగాన్ని కొనసాగిస్తూ ప్రత్యర్థులను వెనక్కి నెట్టి విజేతగా నిలిచాడు. ట్రాక్‌పై అతని వేగం చూసిన ప్రేక్షకులు ఉత్సాహంతో చప్పట్లు కొట్టగా, కోచ్‌లు దీనిని భారత అథ్లెటిక్స్‌కు కీలక మలుపుగా అభివర్ణించారు.

భారత అథ్లెటిక్స్‌కు కొత్త ఆశ

ఇప్పటి వరకు భారత అథ్లెటిక్స్‌లో 100 మీటర్ల విభాగంలో అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడగల స్ప్రింటర్ల కొరత కనిపించేది. కానీ గురిందర్‌వీర్ తాజా ప్రదర్శనతో భారత స్ప్రింటింగ్‌కు కొత్త ఆశలు చిగురించాయి. కేవలం ఒక పతకం గెలవడం కాదు.. ప్రపంచ స్థాయి టైమింగ్ నమోదు చేయడం ఇప్పుడు భారత అథ్లెటిక్స్ దిశను మార్చే అడుగుగా భావిస్తున్నారు.

క్రీడా నిపుణుల అభిప్రాయం ప్రకారం, 10.09 సెకన్ల టైమింగ్ సాధించడం అంటే ఆసియా, కామన్వెల్త్ స్థాయి పోటీల్లో పతకాల కోసం పోటీ పడగల సామర్థ్యం ఉన్నట్టే. ఈ విజయంతో ఒలింపిక్స్ వంటి పెద్ద వేదికలపై భారత అథ్లెటిక్స్‌పై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

సీఎం భగవంత్ మాన్ ప్రశంసలు

Bhagwant Mann గురిందర్‌వీర్ విజయంపై స్పందిస్తూ సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు. వరుసగా రెండు రోజులలో రెండో జాతీయ రికార్డు నెలకొల్పి పంజాబ్‌తో పాటు దేశానికీ గర్వకారణంగా నిలిచాడని కొనియాడారు. యువ అథ్లెట్ భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

పంజాబ్‌లో సంబరాలు

గురిందర్‌వీర్ చారిత్రాత్మక విజయంతో పంజాబ్‌లో సంబరాలు మొదలయ్యాయి. క్రీడా సంఘాలు, మాజీ అథ్లెట్లు, కోచ్‌లు అతనికి అభినందనలు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో కూడా అతని పేరు ట్రెండ్ అవుతోంది. భారత యువతకు ఈ విజయం ప్రేరణగా నిలుస్తుందని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

About Author:

Ch Roja Rani

గత 5 సంవత్సరాలుగా తెలుగు మీడియా రంగంలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న జర్నలిస్ట్‌. డిజిటల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అయిన Idreampost మరియు Wire Teluguలో పని చేసి విశేష అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం Mana Varta లో క్రీడలు (Sports…

More About Author »