గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తరఫున తిలక్ వర్మ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ అద్భుత ప్రదర్శన వెనుక కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇచ్చిన మోటివేషన్ కీలక పాత్ర పోషించిందని అభిమానులు భావిస్తున్నారు.
మ్యాచ్ మధ్యలో ఒక దశలో తిలక్ వర్మ కొంచెం నెమ్మదిగా ఆడుతున్న సమయంలో హార్దిక్ పాండ్యా అతని వద్దకు వచ్చి సీరియస్‌గా మాట్లాడటం కెమెరాల్లో రికార్డ్ అయింది. ఆ సంభాషణ తర్వాత తిలక్ ఒక్కసారిగా గేర్ మార్చి బౌండరీలు, సిక్సర్లతో స్టేడియంను కుదిపేశాడు. ఈ మార్పు చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు.
రీ క్రియేట్ వీడియో…
ఈ సీన్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు యువకులు దీనిని సరదాగా రీక్రియేట్ చేశారు. హార్దిక్ స్టైల్‌లో చేతులు ఊపుతూ మాట్లాడటం, తిలక్ లాగా శ్రద్ధగా వినడం, ఆ తర్వాత బ్యాటింగ్‌లో ఊచకోత కోయడం వంటి సన్నివేశాలను అచ్చం మ్యాచ్‌లో జరిగినట్లే చిత్రీకరించారు. ముఖ్యంగా వారి ఎక్స్‌ప్రెషన్లు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
Also Read : IPL 2026 కోహ్లీ ఇన్నింగ్స్‌తో ఆర్సీబీ విజయం… ‘విరుష్క’ ఫ్లయింగ్ కిస్ వైరల్
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో సందడి చేస్తున్నారు. “హార్దిక్ మోటివేషన్ ఇంత పవర్‌ఫుల్‌గా ఉందా?”, “తిలక్ సెంచరీ వెనుక ఇదే సీక్రెట్ ప్లాన్ అనుకుంటా!” అంటూ సరదాగా స్పందిస్తున్నారు. ముంబై ఇండియన్స్ అభిమానులు ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు.
Tag that MI fans 🤗MI comeback kuduthutanda 😍 just for fun 😂😂 #lungiboys #rajpriyan #lungiboyscomedy pic.twitter.com/OJ4UmcaE25
ఇవి కూడా చదవండి— Lungi boys (@rajpriyan007) April 20, 2026
సోషల్ మీడియాలో ట్రెండింగ్..
కేవలం సరదా కోసం చేసిన ఈ రీక్రియేషన్ వీడియో, మైదానంలోని ఒత్తిడిని, ఆటగాళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని కూడా చక్కగా చూపించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే హార్దిక్ పాండ్యా నాయకత్వంపై కూడా మరోసారి చర్చ మొదలైంది.
ఇటీవల విమర్శలు ఎదుర్కొంటున్న హార్దిక్, తిలక్ వర్మను ప్రోత్సహించిన తీరు జట్టు ఐక్యతను స్పష్టంగా చూపించిందని అభిమానులు అంటున్నారు. మొత్తం మీద ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచి, క్రికెట్ అభిమానులను ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తోంది.
Also Read : కామెంటరీ బాక్స్‌లో అశ్విన్–సెహ్వాగ్ ఘర్షణ… చర్యలపై చర్చ


