IPL 2026 | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా బుధవారం రాత్రి రాయ్‌పూర్ వేదికగా అద్భుతమైన మ్యాచ్ జరిగింది. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఓడిపోయినా సీనియర్ బ్యాటర్ మనీష్ పాండే పట్టిన అద్భుతమైన క్యాచ్ మ్యాచ్‌కే హెలైట్‌గా నిలిచింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో మనీష్ పాండే అందుకున్న క్యాచ్‌ను చూసి విరాట్ కోహ్లీ, కార్తిక్ త్యాగీ మాత్రమే కాదు.. కేకేఆర్ ఫీల్డర్లు సైతం ఈ దృశ్యాన్ని చూసి నమ్మలేకపోయారు. అలాగే చేస్తూ ఉండిపోయారు.
Read Also : ముంబై-కోల్‌కతా మ్యాచ్‌లో పరుగుల వరద.. మరోవైపు స్టాండ్స్‌లో ప్రేమ ప్రపోజల్ వైరల్
ఆ అద్భుత క్షణం ఆర్‌సీబీ ఇన్నింగ్స్ 18వ ఓవర్ చివరి బంతికి చోటుచేసుకుంది. కార్తిక్ త్యాగీ ఆఫ్ స్టంప్ బయట షార్ట్ ఆఫ్ లెంగ్త్ బంతిని వేయగా.. టిమ్ డేవిడ్ బలమైన కట్ షాట్ ఆడాడు. బంతి వేగంగా బ్యాక్‌వర్డ్ పాయింట్ వైపు దూసుకెళ్లి బౌండరీ ఖాయమనిపించింది. అయితే, అదే సమయంలో మనీష్ పాండే మెరుపువేగంతో ఎడమవైపు పరుగెత్తి, గాల్లోకి పూర్తిగా డైవ్ చేసి ఒక చేత్తో బంతిని నేలకు తాకక ముందే అందుకున్నాడు. దాంతో ఒక్కసారిగా స్టేడియం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది.
WHAT. A. CATCH 🤯
Manish Pandey that was top class 🫡
Watch that on loop ➿
Scorecard ▶️ https://t.co/X27WecYjiZ#TATAIPL | #KhelBindaas | #RCBvKKR | @im_manishpandey pic.twitter.com/56lXw7hvdc
— IndianPremierLeague (@IPL) May 13, 2026
షాకైన విరాట్ కోహ్లీ..
టిమ్ డేవిట్ క్యాచ్ అవుట్ అయ్యాక బౌలర్ కార్తిక్ త్యాగి ఆశ్చర్యంతో తలపై చేతులు పెట్టుకున్నాడు. టిమ్ డేవిడ్‌కు సైతం తాను ఔటయ్యానన్న విషయం కొన్ని క్షణాలు అర్థం కాలేదు. నాన్-స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ నోరెళ్లబెట్టి రీప్లే వైపు చూసిన రియాక్షన్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. కేకేఆర్ ఆటగాళ్లు కూడా ముందుగా క్యాచ్ నిజంగానే పట్టాడా లేదా అనే విషయం కొద్దిసేపు అర్థం కాలేదు. అవుట్ అయ్యాడని తెలిసాక సంబరాలు చేసుకున్నారు. అయితే, టీవీ రీప్లేలో ఆ క్యాచ్ ఇంకా అద్భుతంగా కనిపించింది. బంతి బ్యాట్ నుంచి వెళ్లిన వేగం, పాండే డైవ్ చేసిన కోణం చూస్తే అది అసాధ్యమనే అనిపించింది. కానీ, ఒంటిచేత్తో కూడా బంతిపై పూర్తి నియంత్రణ సాధించిన తీరు ఐపీఎల్ 2026లో బెస్ట్ క్యాచ్‌గా నిలిచింది. క్యాచ్ తర్వాత మనీష్ పాండేకు వద్దకు వెళ్లి విరాట్ కోహ్లీ అభినందించడం విశేషం.
Manish Pandey deserves a special appreciation for taking one of the greatest ever catches.
– The reaction of Tyagi, David and Kohli says it all, Kohli personally went and hugged him. ❤️ pic.twitter.com/rnvopYEW1w
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 13, 2026
మ్యాచ్‌లో ఏమైంది?
విరాట్ కోహ్లీ మెరుపు సెంచరీతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆరు వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది. వర్షం కారణంగా గంటకుపైగా ఆలస్యంగా మ్యాచ్ మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అంగ్క్రిష్ రఘువంశీ హాఫ్ సెంచరీతో రాణించాడు. 47 బంతుల్లో మూడు సిక్సర్లు, ఏడు ఫోర్ల సహాయంతో 41 పరులు చేశాడు. అలాగే, రింకు సింగ్ 49, కామెరాన్ గ్రీన్ 32 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.
Read Also : DC vs LSG IPL 2026: లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం.. సమీర్ రిజ్వీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్!
మిగతా బ్యాట్స్‌మెన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ఆర్‌సీబీ 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసి విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఐపీఎల్ కెరీర్‌లో తొమ్మిదో సెంచరీ నమోదు చేశాడు. 60 బంతుల్లో మూడు సిక్సర్లు, 11 ఫోర్ల సహాయంతో 105 పరుగులు చేశాడు. కేకేఆర్ తరఫున కార్తిక్ త్యాగీ మూడు వికెట్లు తీయగా, సునీల్ నరైన్‌కు ఒక వికెట్ దక్కింది. ఈ విజయంతో ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. 12 మ్యాచుల్లో ఎనిమిది విజయాలు, 16 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో ఉంది. కేకేఆర్ తొమ్మిది పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది.
kohli appreciating manish pandey after that splendid catch was so beautiful to watch ❤️ pic.twitter.com/jeMWmk6T0Y
— satyam (@noontonightt) May 13, 2026


