iPhone 17 | భారత మార్కెట్‌లో ఆపిల్ ఐఫోన్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొత్త మోడల్ విడుదలైన ప్రతిసారి ప్రీమియం స్మార్ట్‌ఫోన్ యూజర్ల దృష్టి మొదట ఐఫోన్‌పైనే పడుతుంది. అలాంటి ఆపిల్ అభిమానులకు ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైల్ సంస్థ రిలయన్స్ డిజిటల్ ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది. కంపెనీ తాజా ఫ్లాగ్‌షిప్ మోడల్ ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్‌పై భారీ తగ్గింపును ప్రకటించింది. బ్యాంక్ ఆఫర్లు, తక్షణ డిస్కౌంట్లను కలిపి రూ.11,508 వరకు ఆఫర్‌ను ప్రకటించింది. ప్రస్తుతం భారత మార్కెట్లో ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్ 256జీబీ వేరియంట్ ధర రూ.1,49,900గా ఉంది. అయితే, రిలయన్స్ డిజిటల్ తన ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో ఈ ఫోన్‌పై నేరుగా రూ.4,910 తగ్గింపును అందిస్తూ రూ.1,44,990 వరకు విక్రయిస్తోంది. ఎంపిక చేసిన ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ.6,598 వరకు అదనపు క్యాష్‌బ్యాక్ సైతం ఇస్తోంది. దీంతో అన్ని ఆఫర్లను కలిపి చూస్తే ఫోన్ ధర రూ.1,38,392కు తగ్గుతోంది.
ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్ ప్రస్తుతం అత్యంత డిమాండ్ ఉన్న మోడళ్లలో ఒకటి. ఇందులో ఆపిల్ రూపొందించిన అత్యాధునిక ఏ19 ప్రో చిప్‌సెట్‌ను అమర్చారు. హైపెర్ఫార్మెన్స్‌తో పాటు ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను సైతం ఆపిల్ ఇందులో జోడించింది. ఫొటోగ్రఫీ ప్రియులను ఆకట్టుకునేలా 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను ఇచ్చింది. వీడియో రికార్డింగ్, గేమింగ్, మల్టీటాస్కింగ్ వంటి అవసరాలకు ఈ డివైస్ అనువుగా ఉంటుందని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. మరోవైపు ఆపిల్ నుంచి ఐఫోన్ 18 సిరీస్‌ను మరికొద్ది నెలల్లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. కొత్త సిరీస్‌లో మరింత శక్తివంతమైన ఏ20 ప్రో ప్రాసెసర్, అధిక సామర్థ్యంతో కూడిన బ్యాటరీ, కెమెరా వ్యవస్థలో కీలక మార్పులు ఉండొచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దాంతో ప్రస్తుతం ఐఫోన్ కొనుగోలుపై ఆసక్తి ఉన్నవారు తమ అవసరాలను బట్టి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.
సాధారణంగా కొత్త మోడల్ విడుదల తర్వాత పాత సిరీస్ ఫోన్ల ధరల్లో అధికారికంగా మార్పులు జరుగుతుంటాయి. అయితే వెంటనే ప్రీమియం ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రస్తుతం రిలయన్స్ డిజిటల్ అందిస్తున్న ఆఫర్ ఆకర్షణీయంగా ఉందని పేర్కొంటున్నారు. మరో వైపు మరింత ధర తగ్గాలంటే మాత్రం ఐపోన్ 18 సిరీస్ రిలీజ్ వరకు ఎదురుచూడాల్సిందే. అలాగే, దసరా, దీపావళి సీజన్ సేల్స్ సైతం ధర మరింత తగ్గడంతో పాటు బ్యాంకులు సైతం ఆఫర్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది.


