ఐపీఎల్ 2026కి ముందు సీఎస్‌కేకు బిగ్‌ షాక్.. గాయంతో తొలి రెండు వారాలు ఎంఎస్ ధోనీ దూరం

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ దెబ్బ తగిలింది. జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గాయం కారణంగా తొలి రెండు వారాల మ్యాచ్‌లకు దూరం కానున్నారు. దీంతో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఫ

MS Dhoni Injury IPL 2026
MS Dhoni Injury IPL 2026

ఐపీఎల్ 2026 సీజన్ మొదలవ్వకముందే చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు షాకింగ్ న్యూస్ అందింది. జట్టు స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గాయం కారణంగా ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నారు. ఈ విషయాన్ని సీఎస్‌కే మేనేజ్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది.

ధోనీ ప్రస్తుతం కాలి కండరాల నొప్పితో బాధపడుతున్నారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్న ఆయనకు పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం అవసరమని జట్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ప్రారంభమైన తొలి 14 రోజుల పాటు ధోనీ మైదానంలోకి దిగే అవకాశాలు లేవని స్పష్టం చేసింది. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సీఎస్‌కే సోషల్ మీడియాలో సందేశం కూడా పెట్టింది.

ధోని గైర్హాజ‌రు…

ఈ సీజన్‌లో చెన్నై జట్టు తన తొలి మ్యాచ్‌ను రాజస్థాన్ రాయల్స్‌తో గౌహతి వేదికగా ఆడనుంది. అలాంటి కీలక మ్యాచ్‌లో ధోనీ గైర్హాజరు జట్టుకు పెద్ద లోటుగా భావిస్తున్నారు. ఇదే సమయంలో ఇది ధోనీ కెరీర్‌లో చివరి ఐపీఎల్ కావచ్చనే ప్రచారం జరుగుతుండటంతో అభిమానుల్లో ఆందోళన మరింత పెరిగింది.

ఇటీవల చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన ‘ROAR 26’ ఫ్యాన్ ఈవెంట్‌లో ధోనీ తన ఫిట్‌నెస్‌పై స్పందించారు. వయస్సు ప్రభావం వల్ల ఫిట్‌నెస్ కొద్దిగా తగ్గుతోందని ఆయన స్వయంగా అంగీకరించారు. గతంలో మోకాలి నొప్పితో కూడా ఇబ్బంది పడిన ఆయనకు ఇప్పుడు మరో గాయం రావడం జట్టుకు ఆందోళన కలిగిస్తోంది.

ధోని స్థానంలో సంజూ శాంస‌న్..

ధోనీ అందుబాటులో లేని సమయంలో వికెట్ కీపింగ్ బాధ్యతలను నిర్వహించేందుకు సీఎస్‌కే ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసింది. సంజు శాంసన్‌ని ట్రేడింగ్ ద్వారా జట్టులోకి తీసుకోవడం, అలాగే వేలంలో యువ ఆటగాడు కార్తీక్ శర్మను భారీ మొత్తానికి కొనుగోలు చేయడం ద్వారా జట్టు తన బ్యాక్‌అప్‌ను బలోపేతం చేసుకుంది. ప్రస్తుతం జట్టు కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరిస్తున్నారు.

ధోనీ ఐపీఎల్ కెరీర్ గణాంకాలు చూస్తే ఆయన ప్రభావం ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఇప్పటివరకు 278 మ్యాచ్‌లలో 5,439 పరుగులు సాధించిన ఆయన ఖాతాలో 24 అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 84గా ఉంది. మొత్తానికి, సీజన్ ఆరంభంలోనే ధోనీ దూరం కావడం సీఎస్‌కేకు పెద్ద దెబ్బగా మారింది. అయితే ఆయన త్వరగా కోలుకుని తిరిగి మైదానంలోకి రావాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: ఐపీఎల్ 2026 రెండో దశ షెడ్యూల్ విడుదల

About Author:

Ch Roja Rani

గత 5 సంవత్సరాలుగా తెలుగు మీడియా రంగంలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న జర్నలిస్ట్‌. డిజిటల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అయిన Idreampost మరియు Wire Teluguలో పని చేసి విశేష అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం Mana Varta లో క్రీడలు (Sports…

More About Author »