ఐపీఎల్ ముందు కొత్త అవతార్‌లో విరాట్ కోహ్లీ.. ఫుల్ స్లీవ్ టాటూతో సర్ప్రైజ్!

ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు విరాట్ కోహ్లీ కొత్త ఫుల్ స్లీవ్ టాటూతో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. అతని వ్యక్తిత్వ పరిణామాన్ని ప్రతిబింబించే ఈ టాటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Virat Kohli New Tattoo 2026
Virat Kohli New Tattoo 2026

టీమిండియా స్టార్ బ్యాటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు తన లుక్‌ను పూర్తిగా మార్చేసి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు. ఎడమ చేతి మొత్తం కవర్ అయ్యేలా ఫుల్ స్లీవ్ టాటూ వేయించుకుని కొత్త స్టైల్‌లో కనిపిస్తున్నాడు.

ముంబైకి చెందిన ప్రముఖ టాటూ స్టూడియో ఏలియన్స్ టాటూ ఇండియాలో ఈ టాటూను వేయించుకున్న కోహ్లీ, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బయటకు రావడంతో క్షణాల్లో వైరల్ అయింది. అభిమానులు ఈ కొత్త లుక్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

కొత్త లుక్‌లో కోహ్లీ..

రేపటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 19వ సీజన్‌కు ముందు ఈ మార్పు మరింత చర్చనీయాంశమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు కోహ్లీ కొత్త లుక్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.

ఇక ఈ టాటూ వెనుక ఉన్న అర్థాన్ని టాటూ స్టూడియో ప్రత్యేకంగా వివరించింది. “ఇది కేవలం ఒక డిజైన్ కాదు. కోహ్లీ జీవిత ప్రయాణం, వ్యక్తిత్వ పరిణామానికి ప్రతీక. క్రమశిక్షణ, ఏకాగ్రత, అచంచల నమ్మకం ద్వారా అతను ఎలా మారాడో ఇది చెబుతుంది” అని పేర్కొంది.

కొత్త అర్ధం వ‌చ్చేలా..

కోహ్లీ ఎడమ చేయి ఇప్పటికే పలు టాటూలతో నిండిపోయి ఉండగా, వాటిలో కొన్ని కాలక్రమేణా స్పష్టత కోల్పోయాయి. మరికొన్ని ప్రస్తుత వ్యక్తిత్వానికి సరిపోకపోవడంతో, వాటిని కవర్ చేస్తూ, కొత్త ఎలిమెంట్స్ జోడించి ఒక సమగ్ర కథలా ఈ ఫుల్ స్లీవ్ టాటూను రూపొందించినట్లు ఆర్టిస్టులు తెలిపారు. పాత, కొత్త టాటూల కలయికతో అతని జీవితం, ఆలోచనా విధానం ఎలా మారిందో ప్రతిబింబించేలా దీనిని తీర్చిదిద్దినట్లు వెల్లడించారు.

మొత్తానికి ఐపీఎల్ ప్రారంభానికి ముందు కోహ్లీ కొత్త లుక్‌తో మళ్లీ వార్తల్లో నిలిచాడు. మైదానంలో తన ప్రదర్శనతో పాటు, స్టైల్ విషయంలోనూ ఎప్పుడూ ముందుండే కోహ్లీ, ఈసారి తన టాటూతో మరోసారి ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాడు.

Also Read: ఐపీఎల్ 2026 రెండో దశ షెడ్యూల్ విడుదల

About Author:

Ch Roja Rani

గత 5 సంవత్సరాలుగా తెలుగు మీడియా రంగంలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న జర్నలిస్ట్‌. డిజిటల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అయిన Idreampost మరియు Wire Teluguలో పని చేసి విశేష అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం Mana Varta లో క్రీడలు (Sports…

More About Author »