కాళేశ్వరం బ్యారేజీలకు పునర్జీవం: యుద్ధప్రతిపాదికన మరమ్మతులు.. సీఎం రేవంత్ రెడ్డి డెడ్‌లైన్ ఖరారు!

కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతులపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్. మేడిగడ్డ వద్ద 500 బోరుబావుల డ్రిల్లింగ్‌కు ఆదేశం. డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని డెడ్‌లైన్. నిధుల సమస్య లేదని వెల్లడి.. త్వరలో క్షేత్రస్థాయిలో సీఎం పర్యటన.

Chief Minister Revanth Reddy reviewing the restoration plan for Kaleshwaram project barrages with Minister Uttam Kumar Reddy and officials
Chief Minister Revanth Reddy reviewing the restoration plan for Kaleshwaram project barrages with Minister Uttam Kumar Reddy and officials

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను తిరిగి వినియోగంలోకి తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కీలక ఆదేశాలు జారీ చేశారు.

నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిబంధనల ప్రకారం పనులు:

నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) చేసిన సిఫార్సులకు అనుగుణంగా మరమ్మతు పనులను చేపట్టాలని, ఇందులో ఎలాంటి జాప్యం జరగకూడదని సీఎం స్పష్టం చేశారు.

మరమ్మతుల కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.

ఇరిగేషన్ శాఖ, CWPRS, నిర్మాణ సంస్థలు, డిజైన్ కన్సల్టెంట్లతో కూడిన ఒక ఉమ్మడి బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి దశలో సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) ప్రతినిధులు పాల్గొనేలా చూడాలన్నారు.

Also Read :సన్నబియ్యం పంపిణీ ఏడాది: బ్లాక్ మార్కెట్ మాఫియాపై కట్టడి – సీఎం రేవంత్ రెడ్డి

మేడిగడ్డ వద్ద 500 బోరుబావుల డ్రిల్లింగ్:

మేడిగడ్డ బ్యారేజీలో కేవలం కుంగిన పిల్లర్లే కాకుండా, మొత్తం 1.6 కిలోమీటర్ల పొడవునా క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఇంజనీర్లు సీఎంకు వివరించారు.

మేడిగడ్డ సమీపంలో 500 బోరుబావులను తవ్వి భూసార పరీక్షలు నిర్వహించాలని, దీనికోసం అవసరమైన యంత్రాలను వెంటనే సమకూర్చుకోవాలని ఆదేశించారు.

మాన్సూన్ ప్రారంభమయ్యేలోపే శాంపిల్స్ సేకరణ, పరీక్షల ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
Also Read : ఏళ్ల తర్వాత ఎల్బీ స్టేడియంలో క్రీడల పునర్జన్మ… తెలంగాణలో స్పోర్ట్స్ రివల్యూషన్‌కు రేవంత్ శ్రీకారం

డిసెంబర్ నాటికి పూర్తి కావాలి:

బ్యారేజీల మరమ్మతులకు సంబంధించి డిజైన్లను ఖరారు చేసి, డిసెంబర్ నాటికి పనులన్నీ పూర్తయ్యేలా సమగ్ర షెడ్యూల్‌ను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.

ఈ ప్రాజెక్టు పనులకు నిధుల సమస్య ఉండదని, ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని సీఎం హామీ ఇచ్చారు.

మేడిగడ్డ వద్ద అధికారుల పర్యవేక్షణ కోసం బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని, పనులు ప్రారంభమైన తర్వాత తానే స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇరిగేషన్ సెక్రటరీ శ్రీధర్, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read : భద్రాద్రి శ్రీరామనవమి వేడుకలు ఘనంగా… ₹351 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »