మంచిర్యాలలో కానిస్టేబుల్ దారుణం .. నడిరోడ్డుపై చెడ్డీతో భార్య‌పై అమానుషం ..

Mancherial Constable Assault Case: మంచిర్యాలలో పోలీస్ కానిస్టేబుల్ తన భార్యపై నడిరోడ్డుపై అమానుషంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. మరోవైపు ఆసిఫాబాద్ జిల్లాలో ఇద్దరు చిన్నారులపై అఘాయిత్యం చోటుచేసుకోవడం కలకలం సృష్టించింది. ఈ ఘటనలు మహిళలు, చిన్నారుల భద్రతపై మళ్లీ చర్చకు దారి తీస్తున్నాయి.

Mancherial constable assault case sparks outrage in Telangana
Mancherial constable assault case sparks outrage in Telangana

Mancherial Constable Assault Case

తెలంగాణలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక వైపు ప్రజలను కాపాడాల్సిన పోలీస్ కానిస్టేబుల్ తన భార్యపైనే అమానుషంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి రాగా… మరోవైపు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇద్దరు చిన్నారులపై అఘాయిత్యం చోటుచేసుకోవడం కలకలం రేపింది.

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో జరిగిన ఈ ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది. బాధ్యతగల పోలీస్ ఉద్యోగి కుటుంబంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. రవి ప్రసాద్ అనే కానిస్టేబుల్ మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో రైటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.అతడి భార్య శిరీష గుడిపేట బెటాలియన్‌లో సూపరిండెంట్‌గా పనిచేస్తోంది. భార్యపై అనుమానం పెంచుకున్న రవి ప్రసాద్… ఆదివారం సాయంత్రం మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో భార్యపై తీవ్రంగా దాడి చేశాడు.

  • క‌నిక‌రం చూప‌లేదు.
  • నడిరోడ్డుపై అర్ధనగ్నంగా ఉండి భార్యను కొట్టిన కానిస్టేబుల్ 
  •  క‌ల‌వ‌రానికి గురైన‌ స్థానికులు
  • భార్య ఒడిలో పసిబిడ్డ ఉన్నా కనికరం చూపకుండా ప్రవర్తించాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు

వైరల్ వీడియో .. ప్రజల్లో ఆగ్రహం :

  • ఓ వ్యక్తి ఈ దృశ్యాలను రహస్యంగా వీడియో తీశాడు.
  • వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
  • పోలీస్ ఉద్యోగి అయ్యి ఇలాంటి ప్రవర్తన అనుచితమని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
  • బాధితురాలు శిరీష స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
  • పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
  • కానిస్టేబుల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఆసిఫాబాద్ జిల్లాలో చిన్నారులపై అఘాయిత్యం:

ఇదే సమయంలో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇద్దరు చిన్నారులపై అదే గ్రామానికి చెందిన బాలుడు అఘాయిత్యానికి పాల్పడటం గ్రామంలో ఉద్రిక్తతకు దారి తీసింది.

వివ‌రాల‌లోకి వెళితే..

  • బాధితులు 8, 9 ఏళ్ల వయస్సున్న ఇద్దరు చిన్నారులు.
  • ఇద్దరి కుటుంబాలు పక్కపక్క ఇళ్లలో నివసిస్తున్నాయి.
  • ఆదివారం సెలవు రోజు ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా…
  • 15 ఏళ్ల బాలుడు డబ్బులు ఇస్తానని ఆశ చూపించి వారిని పక్కనే నిర్మాణంలో ఉన్న ఇంట్లోకి తీసుకెళ్లాడు.
  • అక్కడ అఘాయిత్యానికి పాల్పడ్డాడని సమాచారం.

గ్రామంలో కలకలం :

  • సాయంత్రానికి విషయం వెలుగులోకి రావడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
  • అయితే బాధిత కుటుంబాలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా కుల పెద్దలను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.
  • కుల పెద్దలు పంచాయితీ నిర్వహించి ఆ బాలుడిని గ్రామ బహిష్కరణ చేసినట్లు సమాచారం.

ఈ రెండు ఘటనలు సమాజంలో భద్రత, చట్ట వ్యవస్థ, కుటుంబ విలువలపై మళ్లీ చర్చకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారుల భద్రత, మహిళలపై హింస వంటి అంశాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Also Read: ఎల్బీనగర్–పెద్ద అంబర్‌పేట ఎక్స్‌ప్రెస్‌వేపై పెరుగుతున్న ప్ర‌మాదాలు… ఆ 12కి.మీ మృత్యుదారి..!

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »