పొంగులేటి ‘సింహం’లా గర్జన: “బిఆర్ఎస్ నేతలది గజ్జికుక్కల తత్వం.. నా తప్పు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా!”

బీఆర్ఎస్ నేతల ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రౌద్రరూపం. నాదర్గుల్, వట్టినాగులపల్లి భూముల వ్యవహారంలో గూగుల్ మ్యాప్స్ ఆధారాలతో కేటీఆర్, హరీష్ రావులను కడిగిపారేసిన మంత్రి. తన కుటుంబంపై ఆరోపణలు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని సవాల్.

Minister Ponguleti Srinivas Reddy showing Google Maps evidence of land encroachment during a press conference in Secretariat
Minister Ponguleti Srinivas Reddy showing Google Maps evidence of land encroachment during a press conference in Secretariat

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ‘భూ’ ప్రకంపనలు మొదలయ్యాయి. గత పదేళ్లలో రాష్ట్రాన్ని కొల్లగొట్టిన శకుని మామ (KCR), అబద్ధాల రావు (Harish Rao), డ్రామా రావు (KTR)లు ఇప్పుడు తమ ఒంటికి అంటిన అవినీతి బురదను ప్రజా ప్రభుత్వానికి అంటించాలని చూస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం సచివాలయంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్‌లతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన నిప్పులు చెరిగారు.

1. నాదర్గుల్ భూముల వివాదం: మీ పాపం.. మా ఖాతాలోనా?

నాదర్గుల్ (సర్వే నం. 613) లోని 373 ఎకరాల భూమిపై హరీష్ రావు చేస్తున్న ఆరోపణలపై పొంగులేటి క్లారిటీ ఇచ్చారు.

  • మీ టైంలోనే రిజిస్ట్రేషన్: “2014లో మూడు ప్రైవేట్ కంపెనీలకు రిజిస్ట్రేషన్ చేసింది మీ ప్రభుత్వం కాదా? 2016లో మ్యుటేషన్ చేసింది మీ దొరల ప్రభుత్వం కాదా?” అని ప్రశ్నించారు.
  • గూగుల్ మ్యాప్స్ సాక్ష్యం: 2021 నుండి 2022 వరకు ఆ భూమి చుట్టూ రేకులు పెట్టి, రోడ్లు వేయించింది బీఆర్ఎస్ హయాంలోనే అని గూగుల్ మ్యాప్స్ ఆధారాలను ప్రదర్శించారు.
  • కోర్టులో పోరాటం మాది: 2022లో సుప్రీం కోర్టులో ఎస్ఎల్పీ వేసినా బీఆర్ఎస్ ప్రభుత్వం కౌంటర్ వేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ఆ భూమి ప్రభుత్వానిదే అని గట్టిగా పోరాడుతున్నామని వెల్లడించారు.

2. వట్టినాగులపల్లి: అది ‘షా’ కుటుంబ పంచాయితీ!

వట్టినాగులపల్లి భూములపై వస్తున్న ఆరోపణలను పొంగులేటి కొట్టిపారేశారు.

  • అది పూర్తిగా ఒక కుటుంబానికి సంబంధించిన సివిల్ వివాదమని, ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు.
  • మైహోమ్ (My Home) సంస్థకు మేలు చేసేలా ఎన్నికలకు 15 రోజుల ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ నాలా (Nala) కన్వర్షన్ చేసిందని ఆధారాలు చూపారు.
  • తన కుమారుడు హర్షా రెడ్డి కేవలం డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ ఉన్న కంపెనీలో భాగస్వామి మాత్రమేనని, కబ్జాలకు తమకు సంబంధం లేదని ఛాలెంజ్ చేశారు.

3. కొత్వాల్‌గూడ క్రషర్: అసెంబ్లీలో అబద్ధాలా?

కొత్వాల్‌గూడ క్రషర్ విషయంలో హరీష్ రావు అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు ఆడారని మంత్రి మండిపడ్డారు.

  • 2007 నుంచే అక్కడ క్రషర్ నడుస్తోందని, దానికి కరెంటు బిల్లులు, జీఎస్టీ సాక్ష్యాలు ఉన్నాయని తెలిపారు.
  • రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు, ఆ క్రషర్‌కు ఎటువంటి సంబంధం లేదని, హరీష్ రావు కావాలనే బురద చల్లుతున్నారని విమర్శించారు.

పొంగులేటి పంచ్ డైలాగులు – హైలైట్స్:

“బురద పూసుకున్న అడవి పంది.. సింహానికి బురద అంటించాలని చూస్తోంది. కానీ ఆ సింహం తిరగబడితే ఆ అడవి పంది బురదలో లేకుండా తొక్కి చూపిస్తుంది.”

“రాఘవ కన్‌స్ట్రక్షన్ మోచేతి నీళ్లు తాగింది మీరు.. మీ పార్టీకి అధికారికంగా కోటి రూపాయలు ఇచ్చింది ఇదే సంస్థ అని మర్చిపోయారా అబద్ధాల రావు గారు?”

“గజ్జికుక్కల్లాగా బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారు. అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి తాటాకు చప్పుళ్లు చేస్తే ప్రభుత్వం భయపడదు.”

Also Read : కొండాపూర్‌లో రూ.1400 కోట్ల భూమిని హైడ్రా ఎలా కాపాడింది? 7 ఎకరాల పార్కులు ప్రజావసరాల స్థలాలకు ఫెన్సింగ్

ఇబ్రహీంపట్నం చైర్మన్ ఎన్నికపై కోర్టు ట్విస్ట్.. చివరికి పీఠం ఎవరికీ?

ఇందిరమ్మ ఇళ్ల రెండో జాబితాపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన .. అర్హులందరికీ సొంతింటి హామీ

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »