హార్వర్డ్‌లో వారం రోజుల కోర్సు .. మళ్లీ విద్యార్థిగా మారనున్న సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హార్వర్డ్ కెనెడీ స్కూల్‌(Revanth Reddy Harvard Course)లో నిర్వహించే వారం రోజుల లీడర్‌షిప్ కోర్సులో పాల్గొననున్నారు. పాలనతో పాటు వ్యక్తిగత నాయకత్వ నైపుణ్యాలను మెరుగుపర్చుకునే దిశగా ఈ శిక్షణ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

CM Revanth Reddy to Attend Harvard Leadership Course
CM Revanth Reddy to Attend Harvard Leadership Course

Revanth Reddy Harvard Course

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరో కీలక అధ్యాయానికి సిద్ధమవుతున్నారు. పాలనతో పాటు వ్యక్తిగత నాయకత్వ నైపుణ్యాలను మరింత మెరుగుపర్చుకునే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలో నిర్వహించనున్న ప్రత్యేక కోర్సులో సీఎం పాల్గొననున్నారు. హార్వర్డ్ కెనెడీ స్కూల్ – ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ విభాగం నిర్వహించే ‘21వ శతాబ్దం కోసం నాయకత్వం’ అనే అంశంపై వారం రోజుల కోర్సులో సీఎం రేవంత్‌రెడ్డి చేరనున్నారు.

ఈ కోర్సు జనవరి 25 నుంచి 30 వరకు మసాచుసెట్స్‌లోని హార్వర్డ్ క్యాంపస్‌లో ప్రత్యక్షంగా జరుగుతుంది. కోర్సు పూర్తైన అనంతరం హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్ అందజేయనున్నారు. ఈ శిక్షణ కార్యక్రమం అనుభవజ్ఞులైన నాయకుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది.

కోర్స (Revanth Reddy Harvard Course)ప్ర‌త్యేక‌ల విష‌యానికి వ‌స్తే:

  • క్లిష్ట పరిస్థితుల్లో నాయకత్వం ఎలా వహించాలి
  • అనిశ్చితి, మార్పులు, విభేదాలను సమర్థంగా ఎలా ఎదుర్కోవాలి
  • అధికారంతో కాకుండా ప్రభావంతో ప్రజలను ఎలా నడిపించాలి
  • వ్యక్తిగత నాయకత్వ శైలిపై లోతైన విశ్లేషణ
  • బోధన విధానం కూడా ప్రత్యేకంగా ఉంటుంది
  • కేస్ స్టడీస్
  • గ్రూప్ డిస్కషన్స్
  • రియల్ లైఫ్ లీడర్‌షిప్ సమస్యలపై చర్చ
  • స్వీయ ఆత్మపరిశీలన పద్ధతులు ఉంటాయి.

ఈ కోర్సు రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, కార్పొరేట్ సంస్థల డైరెక్టర్లు, సీఈవోలు, స్వచ్ఛంద సంస్థల నాయకులకు ఎంతో ఉపయోగకరమని హార్వర్డ్ వర్గాలు పేర్కొంటున్నాయి. భారతదేశం నుంచి ఈ తరహా కోర్సుకు ప్రత్యక్షంగా హాజరయ్యే తొలి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కావడం విశేషం.

దావోస్ నుంచి అమెరికా వరకు సీఎం ప్రయాణం

సీఎం రేవంత్‌రెడ్డి మేడారం పర్యటన అనంతరం హెలికాప్టర్‌లో నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి దావోస్‌కు ప్రయాణం చేస్తారు.ఇప్పటికే పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు దావోస్‌కు చేరుకున్నారు. సీఎం వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సహా ఇతర అధికారులు కూడా దావోస్‌కు వెళ్లనున్నారు.

తదుపరి షెడ్యూల్

  • దావోస్‌లో పెట్టుబడుల సదస్సు ముగిసిన తర్వాత జనవరి 23న అమెరికాకు సీఎం ప్రయాణం
  • హార్వర్డ్ కోర్సు పూర్తి చేసి
  • ఫిబ్రవరి 2న హైదరాబాద్‌కు తిరిగి రాక
  • పెట్టుబడుల ఆకర్షణతో పాటు, నాయకత్వ నైపుణ్యాల అభివృద్ధిపైనా సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి పెట్టడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

తరచుగా అడిగే ప్రశ్నలు

Q1: సీఎం రేవంత్‌రెడ్డి ఏ కోర్సులో పాల్గొననున్నారు?

A: హార్వర్డ్ కెనెడీ స్కూల్ నిర్వహించే “Leadership for the 21st Century” అనే వారం రోజుల ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులో పాల్గొంటారు.

Q2: ఈ కోర్సు ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది?

A: జనవరి 25 నుంచి 30 వరకు అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రం హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ప్రత్యక్షంగా జరుగుతుంది.

Q3: ఈ కోర్సు ఎవరి కోసం రూపొందించబడింది?

A: రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, కార్పొరేట్ సీఈవోలు, డైరెక్టర్లు, ఎన్‌జీఓ నాయకుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »