రైల్వే పనుల వల్ల సామాన్య ప్రజలకు కష్టాలు తప్పేలా లేవు.విజయవాడ డివిజన్‌లో జరుగుతున్న రైల్వే పనుల కారణంగా పలు రైలు సర్వీసుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.
రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక:
- విజయవాడ – దువ్వాడ సెక్షన్‌లోని రాయనపాడు యార్డ్ రీమోడలింగ్ పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు మార్పులు చేసింది:
- రైళ్ల రద్దు (Cancellation): ఏప్రిల్ 28 నుండి మే 5 వరకు పలు కీలక రైళ్లు రద్దయ్యాయి. వాటిలో ముఖ్యమైనవి:
- విజయవాడ – భద్రాచలం రోడ్ (67215/6), విజయవాడ – డోర్నకల్ (67768/7).
- విజయవాడ – సికింద్రాబాద్ (12713/4), గుంటూరు – సికింద్రాబాద్ (17201/2).
- విశాఖపట్నం – మహబూబ్‌నగర్ (12861/2), కాకినాడ పోర్ట్ – లింగంపల్లి (12737/8).
రైళ్ల దారి మళ్లింపు (Diversion):
మే 1 నుండి మే 5 వరకు ప్రయాణించాల్సిన విశాఖపట్నం – LTT ముంబై, మచిలీపట్నం – సాయినగర్ షిరిడీ, షాలిమార్ – చర్లపల్లి వంటి రైళ్లు గుంటూరు, కృష్ణా కెనాల్ మీదుగా దారి మళ్లించబడ్డాయి. వీటి వల్ల కాజీపేట, వరంగల్, ఖమ్మం వంటి స్టేషన్లలో స్టాపేజీలు రద్దయ్యాయి.
సమ్మర్ స్పెషల్ రైళ్ల పొడిగింపు:
- వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని కొన్ని స్పెషల్ రైళ్లను పొడిగించారు:
- చర్లపల్లి – రక్సాల్ (07005/6): ఏప్రిల్ 12 నుండి మే 31 వరకు ప్రతి ఆదివారం నడుస్తుంది.
- చర్లపల్లి – తిరుచిరాపల్లి (07615/6): ఏప్రిల్ 14 నుండి జూన్ 3 వరకు అందుబాటులో ఉంటాయి.
Also read: బెజవాడ లులూ మాల్‌కు హైకోర్టులో బ్రేక్: ఆర్టీసీ భూముల కేటాయింపుపై కూటమి సర్కార్ వెనక్కి!


