Horoscope 01 May 2026 : ఆఫీసులో అదిరిపోయే సర్ప్రైజ్.. ఆ ఒక్క శుభవార్తతో మీ లైఫ్ టర్న్ అవ్వడం ఖాయం!

నేటి రాశిఫలాల ప్రకారం మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారి జాతక విశ్లేషణ. ఎవరికి ధనలాభం కలుగుతుంది? ఎవరు జాగ్రత్తగా ఉండాలి? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Today Horoscope 01 May 2026
Today Horoscope 01 May 2026

హైదరాబాద్: ఇవాళ గ్రహాల స్థితిగతులు మీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఏ పనులు కలిసి వస్తాయి? ఏయే విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి? జ్యోతిష్య నిపుణుల విశ్లేషణ ప్రకారం పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఇవాళ కొందరు ఆర్థికంగా అభివృద్ధి చెందుతుండగా, మరికొందరు ఆరోగ్య , వ్యయాల విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.

మేష రాశి: ఇవాళ ధనలాభం కలిగే సూచనలు బలంగా ఉన్నాయి. గత కొంతకాలంగా ప్లాన్ చేస్తున్న పొదుపు పథకాలను ప్రారంభించే అవకాశం ఉంది. ఆఫీసులో మీ సలహాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఖాళీ సమయాన్ని పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ఉపయోగిస్తారు. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది.

వృషభ రాశి: స్నేహితులకు పెద్ద మొత్తంలో అప్పు ఇచ్చే విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోండి, లేదంటే మీ ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ప్రేమలో ఉన్నవారి బంధం పెళ్లి వరకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు లేదా కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టడానికి అనుకూల సమయం.

మిథున రాశి: తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యల వలన కొంత డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. సన్నిహితులు, మిత్రుల నుండి మీకు పూర్తి సహకారం అందుతుంది. ఏవైనా సమస్యలు ఎదురైనా మీ ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించి విజయం సాధిస్తారు. ఇవాళ అనుభవం ఉన్న వారు ఇచ్చే సలహాలు మీకు బాగా ఉపయోగపడతాయి.

కర్కాటక రాశి: ప్రస్తుతానికి కొన్ని ఆర్థిక సమస్యలు ఎదురైనప్పటికీ, మీ తెలివితేటలతో ఆ కష్టాల నుండి బయటపడటమే కాకుండా లాభాలను కూడా ఆర్జిస్తారు. కుటుంబంలోకి కొత్త వ్యక్తి రాక (వివాహం లేదా సంతానం) వల్ల ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. కార్యాలయంలో మీ పట్టుదలకు, పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. మీ ఆలోచనలను ఎదుటివారికి స్పష్టంగా, సూటిగా వివరించండి.

సింహ రాశి: అనవసరమైన గొడవలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు రావచ్చు. ఇవాళ ఊహించని విధంగా ధన లాభం పొందుతారు. మీ వ్యక్తిగత విషయాల్లో స్నేహితులు అతిగా జోక్యం చేసుకోవచ్చు, కాస్త జాగ్రత్త. ఆఫీసులో సహోద్యోగులు మిమ్మల్ని అర్థం చేసుకుని, మీ పనుల్లో పూర్తి సహకారం అందిస్తారు.

కన్యా రాశి: త్వరగా డబ్బు సంపాదించాలనే ఆలోచన మీలో కలుగుతుంది, కానీ తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. ఉద్యోగస్తులకు ఇవాళ చాలా బాగుంటుంది. మీరు సేకరించిన సమాచారం , మీ జ్ఞానం మీకు గొప్ప ఆయుధాలుగా మారుతాయి. గత కొద్ది రోజులుగా ఇబ్బందులు పడుతున్న వారికి ఇవాళ ఉపశమనం లభిస్తుంది. రోజంతా సంతోషంగా గడుపుతారు.

తులా రాశి: ఇవాళ మీరు పూర్తి ఉత్సాహంతో, సంతోషంగా ఉంటారు. మీ పొదుపు ప్రణాళికలు ఫలించి, కొంత డబ్బును ఆదా చేయగలుగుతారు. కార్యాలయంలో మీకు అనుకోని సర్ప్రైజ్ లేదా శుభవార్త అందే అవకాశం ఉంది, ఇది మీలో రెట్టింపు ఉత్సాహాన్ని నింపుతుంది. అయితే, చిన్న చిన్న విషయాలకే జీవిత భాగస్వామితో వాదనలు జరిగే అవకాశం ఉంది, ఓపికగా ఉండండి.

Also Read : నేటి రాశిఫలాలు ఏప్రిల్ 21 – 12 రాశుల పూర్తి ఫలితాలు

వృశ్చిక రాశి: శారీరక ధృడత్వంతో పాటు మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం వంటివి చేయడం ఉత్తమం. మీ ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి, కానీ అదే స్థాయిలో ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆఫీసులో నేర్చుకునే కొత్త అంశాలు మీ కెరీర్ ఎదుగుదలకు తోడ్పడతాయి. సహోద్యోగులతో కలిసి పనిచేసేటప్పుడు మీ నైపుణ్యం అందరినీ ఆకట్టుకుంటుంది.

ధనుస్సు రాశి: భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మీరు చేసే పెట్టుబడులు దీర్ఘకాలంలో భారీ లాభాలను తెచ్చిపెడతాయి. చాలా కాలంగా వాయిదా పడుతున్న ఒక ముఖ్యమైన పనిని ప్రారంభించడానికి లేదా పూర్తి చేయడానికి ఇవాళ మీకు అద్భుతమైన అవకాశం లభిస్తుంది. సమయాన్ని వృథా చేయకుండా ముందుకు సాగండి.

మకర రాశి: మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది , ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఏదైనా ఆపద లేదా అవసరం కలిగితే మీ సోదరుడు అండగా నిలుస్తారు. ఆయన నుండి మీరు ఆశించిన దానికంటే ఎక్కువ మద్దతు లభిస్తుంది. ఇవాళ మీరు పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. ఫలితాలు వెంటనే రాకపోయినా నిరాశ చెందకుండా మీ ప్రయత్నం కొనసాగించండి.

కుంభ రాశి: అనవసర ఖర్చులు నియంత్రించుకుంటేనే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఉండవని ఇవాళ మీరు గ్రహిస్తారు. దూరపు బంధువుల నుండి వచ్చే శుభవార్త కుటుంబంలో సంతోషాన్ని నింపుతుంది. వివాహ ప్రయత్నాలు చేసే వారికి ఇవాళ అనుకూలంగా ఉంటుంది. మీకు ఏ పనినైనా సాధించగల సామర్థ్యం ఉంది, కాబట్టి వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోండి.

మీన రాశి: ఇవాళ మీలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది, దీనివల్ల వృత్తిపరంగా పురోగతి సాధిస్తారు. ధన సమస్యల కారణంగా కుటుంబంలో చిన్నపాటి విభేదాలు రావచ్చు. ప్రేమ వ్యవహారాల్లో సానుకూలత తక్కువగా ఉండవచ్చు. ఆఫీసులో మీ పని తీరు , వినూత్న ఆలోచనలు అందరినీ మెప్పిస్తాయి. మీ కష్టానికి తగిన గుర్తింపు, గౌరవం లభిస్తాయి.

Also Read : ఇంటిపై పెట్టుబడులతో ఊహించని ధన లాభం.. ఇవాళ ఈ రాశుల వారికి తిరుగులేని రాజయోగం!

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »