తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రివిలేజ్ పాలిసీ ని బార్ అండ్ రెస్టారెంట్స్ ఔనెర్స్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. అందులో భాగంగా ఇవాల్టి నుంచి రాష్ట్రంలో బార్ అండ్ రెస్టారెంట్స్ చేయాలని పిలుపునిచ్చింది అసోసియేషన్ ప్రివిలేజ్ తో తాము తీవ్రంగా నష్టపోతున్నట్టుగా ఆరోపిస్తున్నారు.
ఇక ఇవాళ అబ్కారి శాఖ ఆఫీస్ ను ముట్టడించబోతున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ ఔనెర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చే శాఖల్లో ఒకటి ఎక్సైజ్ శాఖ దీంతో ప్రభుత్వం ఆదాయాన్ని మరింత పంచుకునేందుకు పెంచుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఆదాయం సమకూర్చుకునేందుకు కొత్తగా ప్రివిలేజ్ పేరిట బార్ల నుంచి కొత్త పన్ను వసూలు చేయాలంటూ నిర్ణయించింది. రాష్ట్రంలోని ఎక్సైజ్ శాఖ అనుమతితో ఇప్పటికే పదకొండు వందల ఎనబై ఐదు బార్ అండ్ రెస్టారెంట్లు నడుస్తున్నాయి. ఇవి కాకుండా మరో కొత్తగా నలబై ఒక్క బార్ లకు అనుమతి ఇవ్వడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో వీటి సంఖ్య పన్నెండు వందల ఇరవై ఆరు కు చేరుకుంది. ఇక వీటి ద్వారా ప్రభుత్వానికి ప్రతి ఏటా భారీగానే ఆదాయం వస్తుంది.
రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఎక్సైజ్ శాఖ ఆదాయం నలబై వేల రెండు వందల తొమ్మిది కోట్ల రూపాయలు కొత్తగా ఏర్పాటు చేయబోయే బార్ల ద్వారా ఏటా మరో పద్నాలుగు పాయింట్ ఆరు రెండు కోట్ల రూపాయల ఆదాయం సమకూరే అవకాశం ఉంది. దీంతో పాటు ప్రివిలేజ్ ద్వారా ఎనిమిది నుంచి ఇరవై శాతం వరకు పన్ను వసూలు చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా ఏటా సుమారుగా నూట డెబ్బై నుంచి రెండు వందల కోట్ల వరకు ఆదాయం వస్తుందని లెక్కలు వేసింది తెలంగాణ ప్రభుత్వం.
అయితే తెలంగాణ ప్రభుత్వం కొత్తగా నలబై ఒక్క బార్ లకు అనుమతి ఇవ్వడంతో పాటు ప్రతి బార్ పై ప్రివిలేజ్ ని పెంచింది. ఈ విధానాలను బార్ అండ్ రెస్టారెంట్ ఔనెర్స్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. అందులో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బార్ అండ్ రెస్టారెంట్లు బంద్ కు పిలుపు ఇచ్చింది అసోసియేషన్ ఇక ప్రివిలేజ్ తో తాము తీవ్రంగా నష్టపోతున్నట్టుగా చెబుతున్నటువంటి బార్ ఔనెర్స్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా అబ్కారి శాఖ ఆఫీస్ ను ముట్టడించబోతున్నట్లుగా తెలిపారు.
నిర్ణయంతో ప్రతి ఏటా ముప్పై లక్షల రూపాయల వరకు అదనంగా బార్లపై భారం పడుతుందని బార్ అండ్ రెస్టారెంట్ ఔనెర్స్ అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటికే వైన్స్‌లో పర్మిట్ రూమ్స్ ను అనుమతి ఇవ్వడం అలాగే దీనికి తోడు బెల్ట్ షాప్‌లో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని కష్టాలు వెంటాడుతున్న లైసెన్స్ ఫీజు రూపేణా ప్రతి ఏటా ప్రభుత్వానికి ముప్పై మూడు లక్షల నుంచి యాభై ఆరు లక్షల రూపాయలు చెల్లిస్తున్నామని ఇప్పుడు ఇది చాలదని ప్రివిలేజ్ పేరుతో అదనంగా ముప్పై లక్షల రూపాయల వరకు భారం పడుతుందని బార్ అండ్ రెస్టారెంట్ ఔనెర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ గౌడ్ అంటున్నారు. ఇక ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రివిలేజ్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. అటు తెలంగాణాలోని బార్ అండ్ రెస్టారెంట్ ఔనెర్స్ అసోసియేషన్ నిర్ణయంతో రేపు రాష్ట్రవ్యాప్తంగా పన్నెండు వేలకు పైగా బార్ అండ్ రెస్టారెంట్లు మూతపడుతున్నాయి.