ఏప్రిల్ 28, 2026 మంగళవారం గ్రహ గతులను పరిశీలిస్తే చాలా మందికి వృత్తిపరంగా మెరుగైన అవకాశాలు లభిస్తాయి. కొందరు ఆర్థికంగా, కెరీర్ పరంగా ఊహించని విజయాలు అందుకుంటారు.
అయితే మరికొందరు మాత్రం ఖర్చులు, ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రేడింగ్ రంగంలో ఉన్న మిథున రాశి వారికి ఈరోజు ప్రత్యేకంగా లాభసాటిగా ఉంటుంది.
మేష రాశి
ఆర్థికంగా ఇవాళ సాధారణంగా ఉంటుంది. ఆశించిన లాభాలు రాకపోవచ్చు కాబట్టి ఖర్చుల విషయంలో పక్కా ప్లానింగ్‌తో ఉండండి. పనిపై పూర్తి ఏకాగ్రత వహించండి. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. తెలివితేటలతో కుటుంబ సమస్యలను సులువుగా పరిష్కరిస్తారు
వృషభ రాశి
ఒక ముఖ్యమైన వ్యక్తి పరిచయం అవుతారు. వారి సలహాలు మీ ఆర్థిక ఎదుగుదలకు తోడ్పడతాయి. విదేశాల నుండి శుభవార్త ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు.
మిథున రాశి
బంధువుల నుండి శుభవార్త కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ట్రేడింగ్ రంగంలో ఉన్నవారికి ఇవాళ ప్రత్యేకంగా లాభసాటిగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆఫీసులో అనవసర విషయాల్లో తలదూర్చకుండా మీ పని మీరు చేసుకుపోవడం ఉత్తమం.
కర్కాటక రాశి
పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది మంచి సమయం. నిపుణుల సలహా తీసుకోవడం మర్చిపోవద్దు. ప్రేమ విషయాల్లో ఓర్పు అవసరం. పని చేసే చోట ఆసక్తికరమైన వ్యక్తిని కలుస్తారు. వ్యక్తిగత విషయాలు అందరితో పంచుకోకుండా జాగ్రత్త వహించండి.
సింహ రాశి
ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వద్దు. చిన్నపాటి వైద్య ఖర్చులు వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే గృహప్రవేశం వంటి శుభకార్యాలకు ఇవాళ చాలా అనుకూలమైన రోజు. కార్యాలయంలో సహోద్యోగులు, పైఅధికారుల సహకారం వల్ల పనులు వేగంగా పూర్తవుతాయి.
కన్యా రాశి
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ధన లాభం కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. స్నేహపూర్వక ప్రవర్తనతో కొత్త మిత్రులను సంపాదిస్తారు. వృత్తి పరంగా ఇవాళ అద్భుతంగా ఉంటుంది. చేసే ప్రయాణాలు భవిష్యత్తులో మంచి లాభాలు తెచ్చిపెడతాయి.
తులా రాశి
ఆరోగ్యం సహకరిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. డబ్బు విషయంలో కుటుంబంలో చిన్నపాటి విభేదాలు రావచ్చు. సర్దుకుపోవడం మంచిది. ఆఫీసులో పడే కష్టం భవిష్యత్తులో గొప్ప గుర్తింపు తెస్తుంది.
వృశ్చిక రాశి
పూర్తి శక్తిసామర్థ్యాలతో ఉంటారు. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. పెద్దల నుండి సహాయం అందుతుంది. భాగస్వామి ఇచ్చే సర్‌ప్రైజ్ ఆనందంలో ముంచెత్తుతుంది. ఓర్పు, కష్టం విజయాన్ని అందిస్తాయి.
ధనుస్సు రాశి
షార్ట్‌కట్ పద్ధతుల్లో డబ్బు సంపాదించాలని చూస్తే జూదం, బెట్టింగ్ నష్టపోయే ప్రమాదం ఉంది. అనుభవజ్ఞుల మాట వినడం వల్ల మేలు జరుగుతుంది. వృత్తిలో తగిన గౌరవం లభిస్తుంది. మనశ్శాంతి కోసం చిన్న విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది.
మకర రాశి
చాలా కాలంగా వేధిస్తున్న భయాలు, ఆందోళనలు ఇవాళ తొలగిపోతాయి. ఆర్థిక విషయాల్లో భాగస్వామితో చిన్నపాటి వాదనలు రావచ్చు. స్నేహితులతో విభేదాలు రాకుండా చూసుకోండి. ఉద్యోగ, వ్యాపారాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.
కుంభ రాశి
ఆర్థిక వివాదాలు లేదా కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా మారుతాయి. దీనివల్ల ధన లాభం చేకూరుతుంది. ముఖ్యమైన ప్రాజెక్టుల్లో కీలక పాత్ర పోషిస్తారు. రివార్డులు అందుకుంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
మీన రాశి
చురుకైన మేధస్సుతో క్లిష్టమైన సమస్యలు కూడా పరిష్కరిస్తారు. ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. కుటుంబ సభ్యులతో పారదర్శకంగా ఉండండి. ఆఫీసులో పని నాణ్యతకు సీనియర్ల నుండి ప్రశంసలు దక్కుతాయి.
గమనిక: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. శాస్త్రీయ ఆధారాలు లేవు. నిర్ణయాలు తీసుకోవడానికి నిపుణులను సంప్రదించండి.


