మే 9 రాశిఫలాలు 2026 – 12 రాశుల దిన ఫలాలు

మే 9, 2026 దిన రాశిఫలాలు - మేషం నుంచి మీనం వరకు అన్ని రాశుల వివరాలు, ఏ రాశికి శుభం, ఏ రాశికి జాగ్రత్త అవసరమో తెలుసుకోండి.

నేటి రాశిఫలాలు
నేటి రాశిఫలాలు

మే 9, 2026 రాశిఫలాలు – మీ రోజు ఎలా ఉంటుందో ముందే తెలుసుకోండి
రోజు మొదలు పెట్టే ముందు మీ రాశిఫలం చూసుకోవాలనుకుంటున్నారా? ఇవాళ ఏ రాశికి అనుకూలం, ఏ రాశికి జాగ్రత్త అవసరమో చూద్దాం. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ ఉన్నాయి

మేషం (Aries horoscope)

విదేశయాన విషయంలో మీ ప్రయత్నాలు ఫలప్రదంగా మారే రోజు ఇది. కుటుంబం నుంచి ఊహించని ఆర్థిక లాభం వచ్చే సూచన కనిపిస్తోంది. అయితే శారీరక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టకపోతే ఇబ్బంది పడవచ్చు. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు కలిసే అవకాశం ఉంది. ఆకస్మిక ధన నష్టం వచ్చినా తట్టుకోగలరు.

వృషభం (Taurus horoscope)

వ్యవసాయం, భూమి సంబంధిత వ్యవహారాల్లో లాభం కనిపిస్తోంది. కానీ తొందరపడితే చేపట్టిన పనులు చెడిపోయే ప్రమాదం ఉంది. ఆందోళన, అనవసర భయం మనసును వేధించవచ్చు. చెడు సలహాలు ఇచ్చే వారి నుంచి దూరంగా ఉండటం మేలు. శారీరకంగా తక్కువ శక్తి అనిపించవచ్చు – విశ్రాంతి అవసరం.

మిథునం (Gemini horoscope)

మనసు సరిగ్గా settle అవ్వడం లేదని అనిపించే రోజు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో కొంత ముందడుగు పడే అవకాశం ఉంది – అయితే ఆలస్యంగా జరుగుతుంది. స్థిరాస్తి లావాదేవీలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొత్త పనులు మొదలుపెట్టే వేళ ఇది కాదు.

కర్కాటకం (Cancer horoscope)

ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఆకస్మికంగా డబ్బు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇతరులకు సహాయం చేసే కార్యాల్లో మనసు లగ్నమవుతుంది. పేరు, గుర్తింపు దిశగా అడుగు పడే రోజు. అప్పుల సమస్య ఉంటే కొంత ఉపశమనం కలుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

సింహం (Leo horoscope)

పని వత్తిడి ఎక్కువగా అనిపించవచ్చు. మనసులో అశాంతి కలుగుతుంది. ఆకస్మిక ఆర్థిక నష్టం పట్ల అప్రమత్తంగా ఉండటం మంచిది. దగ్గరలో ఉండే గుట్టుచప్పుడు కాకుండా నష్టం చేసే వ్యక్తుల విషయంలో జాగ్రత్త అవసరం. ఏ పరిస్థితిలోనూ ధైర్యం వదలకుండా ముందుకు సాగడం మేలు.

కన్య (Virgo horoscope)

ఇంట్లో వాతావరణం ఓకే గా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు మాత్రం కొంత వేధిస్తాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తగ్గించకూడదు. సన్నిహితుల సహాయం అవసరమయ్యే పరిస్థితి వస్తుంది. కొత్త పనులు మొదలుపెట్టే వేళ ఇది కాదు – ముందే ఉన్న పనులు పూర్తి చేయడానికి సమయం వెచ్చించడం మంచిది.

Also Read : నేటి రాశి ఫలాలు మే 7 2026 – 12 రాశులకు పూర్తి దిన ఫలాలు తెలుగులో

తుల (Libra horoscope)

ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంది. రాజకీయ, సామాజిక వ్యవహారాల్లో విజయం దక్కుతుంది. శుభ కార్యాలు సుళువుగా జరుగుతాయి. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. మీ వల్ల ఇతరులకు ఉపకారం జరిగే అవకాశాలు వస్తాయి. గౌరవం, మర్యాద పెరుగుతాయి. శుభవార్తలు వినే రోజు ఇది.

వృశ్చికం (Scorpio horoscope)

ప్రయాణాలు చేస్తే ఖర్చు, శ్రమ ఎక్కువ అవుతాయి. ఆర్థిక నష్టం రాకుండా జాగ్రత్తగా ఉండటం అవసరం. అనారోగ్యం వల్ల ఖర్చులు పెరిగే సూచన ఉంది. తీర్థయాత్ర లేదా దైవదర్శనం చేసుకునే అవకాశం వస్తుంది. స్త్రీలకు మనసులో ఉత్సాహం కలుగుతుంది.

ధనుస్సు (Sagittarius horoscope)

ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరమైన రోజు ఇది. అనవసర గొడవలకు దూరంగా ఉండాలి. అనవసర భయాలు మనసును వేధించవచ్చు. వ్యాపారం చేసే వారు నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత నిలపడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది.

మకరం (Capricorn horoscope)

మనసులో అసహనం ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో మార్పులు చేసుకోవాలని అనిపిస్తుంది. స్వల్ప అనారోగ్యం మూలంగా ఉత్సాహం తక్కువగా ఉంటుంది. స్త్రీలతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. అయితే చేపట్టిన పనులు ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని నిర్ణయాలు వాయిదా వేయడం తెలివైన పని.

కుంభం (Aquarius horoscope)

తినే సమయాలు దాటిపోతే అనారోగ్యానికి దారి తీస్తుంది – భోజన నియమాలు పాటించాలి. పిల్లల విషయంలో అతిగా ఆందోళన పడకుండా ఉండటం మేలు. మనో ఆందోళన కలిగే పరిస్థితులు వస్తాయి. కోపాన్ని అదుపులో పెట్టుకుంటే అన్ని విషయాలూ సులభంగా గడుస్తాయి. కొత్త పనులు ఈ రోజు మొదలుపెట్టకుండా ఉండటం మంచిది.

మీనం (Pisces horoscope)

పేరుప్రతిష్టలు దెబ్బతినే పరిస్థితులు వస్తే తెలివిగా వ్యవహరించాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ప్రయాణాల్లో ఖర్చు, అలసట ఎక్కువగా ఉంటాయి. గొడవలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది.

Also Read : ఇంటిపై పెట్టుబడులతో ఊహించని ధన లాభం.. ఇవాళ ఈ రాశుల వారికి తిరుగులేని రాజయోగం!

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »