నేటి దినఫలాల్లో మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి.. ఏ దైవాన్ని పూజించాలి.. ఎలాంటి పూజలు, పారాయణాలు చేయాలి అనే వివరాలు చూద్దాం.
మేష రాశి
మేష రాశి వారు నూతన అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. కుటుంబంలో ఏర్పాటు చేసుకోబోయే పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. దానధర్మాదులు చేస్తూ ఉంటారు. అలాగే ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి. దూర ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు మీకు అనుకూలించే దైవం: శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారు.
చేయవలసిన పూజ: స్వామివారికి తులసి అర్చన నిర్వహించడం.
వృషభ రాశి
వృషభ రాశి వారు స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబపరమైన అంశాల్లో మాట విలువను జాగ్రత్తగా కాపాడుకోవాలి. విశ్రాంతి అవసరమవుతుంది. వ్యాపారంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.
ఈరోజు మీకు అనుకూలించే దైవం: గజలక్ష్మి అమ్మవారు.
చేయవలసిన పూజ: మహాలక్ష్మి స్తోత్రాన్ని పారాయణం చేయడం. పేదవారికి పాలు, పెరుగు దానం చేయడం మంచిది.
మిథున రాశి
మిథున రాశి వారు నాయకులతో వివిధ రకాల చర్చలు జరుపుతూ ఉంటారు. వాణిజ్యపరమైన అంశాల్లో విజయాలు సాధ్యమవుతూ ఉంటాయి. సమాచార రంగంలో మంచి అవకాశాలు కలిసి వస్తుంటాయి. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు.
ఈరోజు మీకు అనుకూలించే దైవం: సూర్యనారాయణ స్వామి వారు.
చేయవలసిన పూజ: ఆదిత్య అష్టకాన్ని పారాయణం చేయడం. పేదవారికి గోధుమలను సమర్పించడం మంచిది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈరోజు కుటుంబపరమైన కార్యక్రమాలు ఉంటాయి. ధార్మిక చింతన ఏర్పడుతుంది. స్థిరాస్తుల విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మానసిక ప్రశాంతతను కోరుకుంటారు.
ఈరోజు మీకు అనుకూలించే దైవం: శ్రీ పరమేశ్వరుడు.
చేయవలసిన పూజ: శివాలయంలో అర్చన నిర్వహించడం. పేదవారికి అన్నదానం చేసుకోవడం మంచిది.
సింహ రాశి
సింహ రాశి వారికి ప్రముఖులను కలుసుకోవాల్సిన అవసరాలు ఏర్పడుతుంటాయి. ఉద్యోగపరమైన అంశాల్లో ఉన్నత లక్ష్యాలు, బాధ్యతలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రజలతో మంచి సంబంధ బాంధవ్యాలను కొనసాగిస్తూ ఉంటారు. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు.
ఈరోజు మీకు అనుకూలించే దైవం: శ్రీ సుదర్శన స్వామి వారు.
చేయవలసిన పూజ: సుదర్శనాష్టకాన్ని పారాయణం చేయడం. పేదవారికి పెసరపప్పుతో చేసిన పదార్థాలు సమర్పించడం మంచిది.
కన్య రాశి
కన్య రాశి వారికి వృత్తిపరంగా కీలకమైన బాధ్యతలు చేపడుతుంటారు. ఆరోగ్య నియమాలను పాటించడం మంచిది. కుటుంబపరమైన ప్రణాళికలు మేలు చేస్తూ ఉంటాయి. తీర్థయాత్రలు చేస్తుంటారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారు.
ఈరోజు మీకు అనుకూలించే దైవం: అన్నపూర్ణ అమ్మవారు.
చేయవలసిన పూజ: అన్నపూర్ణ అష్టకాన్ని పారాయణం చేయడం. పేదవారికి బియ్యం దానం చేయడం మంచిది.
తులా రాశి
తులా రాశి వారికి ఈరోజు వ్యాపార భాగస్వామ్య విషయాల్లో అనుకూలతలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగే వ్యాపార ప్రకటన కోసం మంచి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. విందు వినోదాలు ఉంటుంటాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి.
ఈరోజు మీకు అనుకూలించే దైవం: శ్రీ వైద్యనాథ స్వామి వారు.
చేయవలసిన పూజ: వైద్యనాథ అష్టకాన్ని పారాయణం చేయడం.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు రాజకీయపరమైన కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి. తొందర పడకూడదు. ఎవరినీ విమర్శించకూడదు. అనవసరమైన నిర్ణయాలు తీసుకోకూడదు. దుబారా ఖర్చులను తగ్గించుకోవడం మంచిది.
ఈరోజు మీకు అనుకూలించే దైవం: శ్రీ కాలభైరవ స్వామి వారు.
చేయవలసిన పూజ: కాలభైరవాష్టకాన్ని పారాయణం చేయడం. దేవాలయంలో దీపారాధనకు నూనెను సమర్పించడం మంచిది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు అవసరానికి తగిన విధంగా ఏర్పాట్లు పూర్తి చేసుకుంటారు. పరిశోధన రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. దూర యాత్రలు చేసే అవకాశాలు ఉండబోతున్నాయి. పిల్లల ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈరోజు మీకు అనుకూలించే దైవం: పరమేశ్వరుడు.
చేయవలసిన పూజ: శివార్చన నిర్వహించడం. స్వామివారికి పెరుగన్నం నివేదన చేయడం మంచిది.
మకర రాశి
మకర రాశి వారికి అదనపు ఉద్యోగ బాధ్యతలు చేపట్టవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆర్థిక నిర్వహణ విషయంలో లోపాలు లేకుండా జాగ్రత్త పడండి. అలాగే కుటుంబపరమైన ఖర్చులు, భద్రత విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. దీర్ఘకాలిక శ్రమకు తగిన ప్రతిఫలాలు లభిస్తుంటాయి.
ఈరోజు మీకు అనుకూలించే దైవం: మహాగణపతి స్వామి వారు.
చేయవలసిన పూజ: గణపతి స్వామివారికి గరిక పూజలు నిర్వహించడం. అరటి పండ్లను నివేదన చేయడం మంచిది.
కుంభ రాశి
కుంభ రాశి వారు ఆలోచనా విధానాల్లో జాగ్రత్తగా ఉండాలి. సమాజ సేవ చేసుకోవడం వలన ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవాలు ఏర్పడుతుంటాయి. టెక్నాలజీ రంగంలో ముందడుగు వేయగలుగుతుంటారు. అలాగే నూతన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు.
ఈరోజు మీకు అనుకూలించే దైవం: శ్రీమన్నారాయణుడు.
చేయవలసిన పూజ: విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం. పేదవారికి అన్నదానం చేసుకోవడం మంచిది.
మీన రాశి
మీన రాశి వారు ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే కష్టపడే దానికి సరైన ప్రోత్సాహకాలు లభిస్తూ ఉంటాయి. కుటుంబపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరమైన వివిధ రకాల సహకారాలతో కూడిన సమావేశాలను నిర్వహిస్తుంటారు.
ఈరోజు మీకు అనుకూలించే దైవం: శ్రీ వెంకటేశ్వర స్వామి వారు.
చేయవలసిన పూజ: స్వామివారికి తులసి అర్చన నిర్వహించడం. గోసేవ చేసుకోవడం, గోగ్రాసం సమర్పణ చేయడం మంచిది.


