అందోల్–జోగిపేట మున్సిపాలిటీలో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం.. పోలియో చుక్కలు వేయించిన వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ!

సంగారెడ్డి జిల్లా అందోల్–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని 15, 16, 17వ వార్డులలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు) ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

అందోల్–జోగిపేట మున్సిపాలిటీలో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం.. పోలియో చుక్కలు వేయించిన వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ!

సంగారెడ్డి జిల్లా అందోల్–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని 15, 16, 17వ వార్డులలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు) ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదు సంవత్సరాల లోపు చిన్నారులందరికీ పోలియో వ్యాధి నుండి రక్షణ కల్పించేందుకు రెండు చుక్కల పోలియో మందులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు) పాల్గొని మాట్లాడుతూ, తల్లిదండ్రులు తమ ఐదు సంవత్సరాల లోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా రెండు చుక్కల పోలియో మందులు వేయించాలని కోరారు. రెండు చుక్కలే చిన్నారులకు రక్షణ కవచమని పేర్కొంటూ, ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించి ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శంకర్, హెడ్ నర్స్ సుజాత, ఆశా , ఏఎన్ఎం వర్కర్లు, శాంతా సిస్టర్, అంగన్‌వాడీ టీచర్, ఆత్మ కమిటీ డైరెక్టర్ కాలేదు, స్థానిక నాయకులు వీరేశం, అశోక్, చెన్నయ్య, విజయ్, భరత్, వినయ్, చంటి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

About Author:

Vidya Burujukadi

కంటెంట్ రైటర్‌గా మన వార్త వెబ్ సైట్‌కి విద్య.బి పనిచేస్తున్నారు. ప్రధానంగా బిజినెస్ వార్తలతో పాటు పర్సనల్ ఫైనాన్స్, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన తాజా సమాచారం, జనరల్ అంశాలకు సంబంధించిన కథనాలను ఆమె అందిస్తారు. విద్యకు తెలుగు మీడియా…

More About Author »