ఆదివారం ఈ రాశులకు ధనలాభం.. ఎవరికి సమస్యలు, ఎవరికి ప్రమోషన్ యోగం?

అక్టోబర్ 11 ఆదివారం 12 రాశుల వారికి దినఫలాలు ఎలా ఉన్నాయి? ఉద్యోగం, వ్యాపారం, ధనం, ప్రయాణాలు, కుటుంబ విషయాల్లో ఏ రాశికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకోండి.

today horoscope telugu
today horoscope telugu

మేషరాశి

మేషరాశి వాళ్లకి ఈరోజు మనోవ్యధ కొద్దిగా ఉంటుంది. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలాగే ధార్మిక చింతన పెరుగుతుంది. సేవా కార్యక్రమాలు ఎక్కువగా చేస్తారు. రుణాల విషయంలో మాత్రం కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. రుణం ఇవ్వటం గాని, తీసుకోవటం గాని చాలా ఆలోచించి జాగ్రత్తగా చేయాలి.

వృషభరాశి

వృషభరాశి వాళ్లకి ఈరోజు ఆదాయ మార్గాలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు శుభకార్యక్రమాలు నిర్వహించటానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. శుభకార్యక్రమం నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభిస్తుంది. అదే విధంగా ఆదాయ మార్గాల పరంగా ఊహించని విధంగా ధన లాభాన్ని పొందే యోగం కూడా వృషభరాశి వాళ్లకి ఉంది.

మిథునరాశి

మిథునరాశి వాళ్లకి ఈరోజు ప్రత్యేకంగా కొన్ని ఆపదలు వెంటాడుతూ ఉంటాయి. సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. అటువంటప్పుడు సమయస్ఫూర్తితో, తెలివితేటలతో వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అలాగే ఈరోజు అప్పుల పరంగా కొన్ని చిక్కులు ఉంటాయి. వాటిని కూడా తెలివిగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి.

కర్కాటకరాశి

కర్కాటకరాశి వాళ్లకి ఈరోజు ధన లాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. శుభకార్యక్రమం నిమిత్తమై చేస్తున్న ప్రయత్నాల్లో కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి. శుభకార్యక్రమాల కోసం ధనపరంగా ప్రయత్నిస్తే ధనం కూడా లభించే యోగం కర్కాటకరాశి వాళ్లకి ఉంది.

సింహరాశి

సింహరాశి వాళ్లకి ఈరోజు విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. విదేశీ ప్రయాణాల పరంగా చేసే ప్రయత్నాల్లో కూడా లాభం చేకూరుతుంది. అలాగే విదేశీ వస్తువులు కొనటం, దాని ద్వారా ఆనందాన్ని పొందటం ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి.

కన్యారాశి

కన్యారాశి వాళ్లకి ఈరోజు అధికారుల వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అధికారుల ఇళ్లకి వెళ్లి ముఖ్యమైన చర్చలు చేస్తే లాభాలు ఉంటాయి. అలాగే చేస్తున్న వృత్తిలో ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. అదే విధంగా శరీరానికి మాత్రం కొద్దిగా కన్యారాశి వాళ్లకి బాధ ఉంటుంది. దేహ బాధ ఉంటుంది కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి.

తులారాశి

తులారాశి వాళ్లకి ఈరోజు సంతాన సంబంధమైన ముఖ్యమైన విషయాల్లో కీలకమైన చర్చలు చేస్తూ ఉంటారు. ఆ చర్చల వల్ల అంతిమంగా లాభాలను పొందే యోగం కూడా చాలా ఎక్కువగా ఉంది. అదే విధంగా ఈరోజు కొన్ని సమస్యలు వెంటాడినప్పటికీ తులారాశి వాళ్లు వాళ్ల తెలివితో ఆ సమస్యల నుంచి చాలా చక్కగా బయటపడగలుగుతారు.

వృశ్చికరాశి

వృశ్చికరాశి వాళ్లకి ఈరోజు వ్యాపార పరంగా ధన లాభం చేకూరే సూచనలు ఉన్నాయి. ఊహించిన దానికంటే వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తాయి. ఉద్యోగ రంగంలో కూడా చేస్తున్న ఉద్యోగం పరంగా మంచి ప్రయోజనాలు వృశ్చికరాశి వాళ్లు పొందగలుగుతారు. ధన లాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించగలుగుతారు.

ధనుస్సురాశి

ధనుస్సురాశి వాళ్లకి ఈరోజు బంధుమిత్రులతో అకారణంగా విభేదాలు అయ్యే సూచనలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే స్థాన చలనము ధనుస్సురాశి వాళ్లకి కనిపిస్తుంది. అంటే వృత్తిరీత్యా దూర ప్రాంతానికి వెళ్లటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మకరరాశి

మకరరాశి వాళ్లకి ఈరోజు ఆకస్మికంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కొన్ని మంచి, కొన్ని చెడు ఉంటాయి. వాటిని తట్టుకుని ధైర్యంగా ముందడుగు వేయాలి. అలాగే సామాన్యమైన విజయాలు కనిపిస్తున్నాయి. అద్భుతమైన విజయాలు లేకపోయినా ఎంతో కొంత చేస్తున్న పనిలో మకరరాశి వాళ్లు విజయాలు పొందగలుగుతారు.

కుంభరాశి

కుంభరాశి వాళ్లకి ఈరోజు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మనసులో ఉన్న అశాంతి తొలగిపోతుంది. అలాగే ఈరోజు వృత్తిపరంగా ధన లాభం కలుగుతుంది. ఉద్యోగం, వ్యాపారమైనా ధనపరంగా మంచి ప్రయోజనాలు కుంభరాశి వాళ్లు పొందగలుగుతారు.

మీనరాశి

మీనరాశి వాళ్లకి ఈరోజు జాయింట్ సమస్యలు ఉంటాయి. అంటే పార్టనర్‌షిప్ వ్యవహారాల్లో కొన్ని సమస్యలు ఉంటాయి. వాటిని సమయస్ఫూర్తితో పరిష్కరించుకునే దిశగా అడుగులు వేయాలి. సామాన్యమైన ధన లాభం ఉంది. అద్భుతమైన ధన లాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనం పొందగలుగుతారు.

దేవీ నవరాత్రుల మొదటి రోజు పాటించాల్సిన మంత్రాలు

పన్నెండు రాశుల వాళ్లు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే, ఈరోజు నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్న తరుణంలో, దేవీ నవరాత్రుల మొదటి రోజు సందర్భంగా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు “బండపుత్ర వధోద్యుక్త బాల విక్రమ నందిత” అనే మంత్రాన్ని పదకొండు సార్లు, “ఓం శం శైలపుత్రే నమః” అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకొని వెళ్ళాలి.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »