Gold Rates: తగ్గేదేలే అంటున్న బంగారం.. వరుసగా మూడో రోజుకు పెరుగుదల.. ఇవాళ హైదరాబాద్‌లో రేట్లు ఎలా ఉన్నాయంటే!

హైదరాబాద్ నగరంలో ఇవాళ (ఏప్రిల్ 16, 2026) తాజా ధరల పరిస్థితి ఇలా ఉంది.

Today Gold Rate
Today Gold Rate

హైదరాబాద్: బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగా చేదువార్తే. పెళ్లిళ్ల సీజన్ మొదలైన తరుణంలో పసిడి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న అనిశ్చితి, భౌగోళిక రాజకీయ పరిణామాల కారణంగా గత మూడు రోజులుగా ధరలు ఏకధాటిగా పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో ఇవాళ (ఏప్రిల్ 16, 2026) తాజా ధరల పరిస్థితి ఇలా ఉంది.

బంగారం ధరలు:
24 క్యారెట్ల బంగారం (శుద్ధమైన బంగారం):
భాగ్యనగరంలో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,55,570 కు చేరుకుంది. నిన్నటితో పోలిస్తే ఇది రూ. 220 పెరిగింది.

22 క్యారెట్ల బంగారం (ఆభరణాల బంగారం):
ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,42,600 వద్ద కొనసాగుతోంది. నిన్నటి ధరతో పోలిస్తే ఇది రూ. 200 మేర పెరిగింది.

వెండి ధరల తీరు:
బంగారంతో పాటే వెండి కూడా తన జోరును ప్రదర్శిస్తోంది. కిలో వెండి ఏకంగా రూ.2,75,000 వద్ద కొనసాగుతోంది.

వరుసగా పెరుగుతున్న ఈ ధరలు కొనుగోలుదారులను షాక్‌కు గురి చేస్తున్నాయి. పెళ్లిళ్లు, శుభకార్యాల నేపథ్యంలో డిమాండ్ పెరుగుతుండటం, దానికి తోడు అంతర్జాతీయ పరిణామాలు పసిడి ధరలను ప్రభావితం చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

పైన చెప్పిన ధరలు ఇవాళ ఉదయం 10 గంటల సమయానికి ఉన్నవి . అయితే, షాపును బట్టి మెరుగు కూలీ (మేకింగ్ ఛార్జీలు), జీఎస్‌టీ అదనంగా ఉంటాయని గమనించగలరు.
Also Read:

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »