Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ ఛాన్స్ మిస్.. రామకృష్ణ పోలీస్ కలకు టాటూనే అడ్డంకా?

Bigg Boss 10 Telugu: అగ్నిపరీక్ష సీజన్ 2లో ఆకట్టుకున్న శ్రీకాకుళం కుర్రాడు రామకృష్ణకు బిగ్ బాస్ అవకాశం దక్కకపోవడంపై చర్చ జరుగుతోంది. పోలీస్ ఉద్యోగం కల, టాటూ, వైల్డ్ కార్డ్ ఎంట్రీపై ఆసక్తికర విషయాలు.

Bigg Boss 10 Telugu Ramakrishna
Bigg Boss 10 Telugu Ramakrishna

Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10కు ముందు నిర్వహించిన అగ్నిపరీక్ష సీజన్ 2 కార్యక్రమం ద్వారా పలువురు కంటెస్టెంట్లు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ షోకు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు అభిజిత్, బిందు మాధవి, నవదీప్ జడ్జ్‌లుగా వ్యవహరించగా.. స్టార్ యాంకర్ శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరించారు.

ఈ కార్యక్రమానికి వందలాది మంది దరఖాస్తు చేసుకోగా.. వడపోత అనంతరం 15 మందిని ఎంపిక చేశారు. చివరికి వారిలో ఆరుగురిని మాత్రమే బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 (Bigg Boss 10 Telugu)లోకి మెయిన్ కంటెస్టెంట్లుగా పంపించారు. అయితే అగ్నిపరీక్షలో ప్రతిభ చూపిన కొందరికి అవకాశం దక్కలేదనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. వారిలో శ్రీకాకుళానికి చెందిన రామకృష్ణ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది.

చివరి ఎపిసోడ్‌లలో అదరగొట్టిన రామకృష్ణ

అగ్నిపరీక్ష సీజన్ 2 ప్రారంభంలో రామకృష్ణ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఆయనను ఎందుకు ఎంపిక చేశారంటూ సోషల్ మీడియాలో కొందరు నెగెటివ్ కామెంట్లు కూడా చేశారు. అయితే షో చివరి మూడు ఎపిసోడ్‌లలో రామకృష్ణ ఆటతీరు, మాటతీరు పూర్తిగా మారిపోయాయి.

తనదైన శైలిలో ఆకట్టుకోవడంతో రామకృష్ణకు ప్రేక్షకుల్లో మంచి పాజిటివ్ వైబ్ ఏర్పడింది. ఆయన బిగ్ బాస్ హౌస్‌(Bigg Boss 10 Telugu)లోకి వెళ్లాల్సిందేనని పలువురు ప్రేక్షకులు కోరుకున్నారు. దీనికి అనుగుణంగానే రామకృష్ణకు భారీ స్థాయిలో ఓట్లు కూడా వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే చివరి నిమిషంలో రామకృష్ణకు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ దక్కకపోవడంతో ఆయన అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు నచ్చిన కంటెస్టెంట్లను మాత్రమే రికమండేషన్ కోటాలో హౌస్‌లోకి పంపించారంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

పోలీస్ ఉద్యోగం కలకు టాటూ అడ్డంకిగా మారిందా?

ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7, బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్‌గా పాల్గొన్న టేస్టీ తేజ నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలో రామకృష్ణ ఇటీవల పాల్గొన్నారు. ఈ సందర్భంగా అగ్నిపరీక్షలో తన ప్రయాణం గురించి చెబుతూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

రామకృష్ణకు చిన్నప్పటి నుంచి పోలీస్ ఉద్యోగం సాధించాలనే కోరిక ఉందట. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినట్లు ఆయన తెలిపారు. అయితే పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి శరీరంపై టాటూలు ఉండటంపై కొన్ని నిబంధనలు ఉంటాయని తెలిసిందే.

బిగ్ బాస్ హౌస్‌లోకి ఎలాగైనా ఎంట్రీ ఇవ్వాలనే పట్టుదలతో.. అగ్నిపరీక్షలో భాగంగా రామకృష్ణ తన ఒంటిపై “తూ నా బ్రతుకు” అనే టాటూ వేయించుకున్నట్లు చెప్పారు. దీంతో పోలీస్ ఉద్యోగం సాధించాలనే తన కల ఇక నెరవేరకపోవచ్చనే బాధను టేస్టీ తేజ ఇంటర్వ్యూలో వ్యక్తం చేశారు.

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందా?

ప్రస్తుతం రామకృష్ణకు బిగ్ బాస్ హౌస్‌(Bigg Boss 10 Telugu)లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించే అవకాశం ఉందనే చర్చ సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే.. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాలనే రామకృష్ణ కోరిక నెరవేరినట్లే అవుతుంది.

అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో రామకృష్ణకు నిజంగా అవకాశం దక్కుతుందా లేదా అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »