బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రెండో వారానికి చేరుకోవడంతో హౌస్‌లో గొడవలు, మాటల యుద్ధాలు మరింత ముదురుతున్నాయి. మొదటి వారంలో చరణ్, చైత్ర రాయ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా హౌస్ నుంచి బయటకు వెళ్లారు. ఇక రెండో వారం నామినేషన్స్‌లో ఏకంగా 11 మంది కంటెస్టెంట్లు ఉండటంతో ఆడియన్స్ ఓటింగ్‌పై ఆసక్తి పెరిగింది.
రెండో వారం నామినేషన్‌లో 11 మంది
రెండో వారం నామినేషన్‌లో రోహిత్, ముఖేష్ గౌడ్, రాంప్రసాద్, త్రిగుణ, దేవజాని, కృష్ణుడు, వర్షిణి, శాలిని, సృష్టి, ఝాన్సీ, సుధీర్ ఉన్నారు. వీరిలో ఎవరు సేఫ్ అవుతారు? ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
తాజాగా ప్రచారంలో ఉన్న ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం.. బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్ నాయుడు మొదటి స్థానంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
ఓటింగ్‌లో రోహిత్ నాయుడు హవా
ప్రస్తుతం రోహిత్ నాయుడు దాదాపు 30 శాతం ఓట్లతో టాప్‌లో ఉన్నట్లు ఓటింగ్ ట్రెండ్స్ సూచిస్తున్నాయి. హౌస్‌లో వివాదాలకు కేంద్రంగా మారినప్పటికీ, అతడికి ఆడియన్స్ నుంచి మంచి మద్దతు లభిస్తున్నట్లు తెలుస్తోంది.
రోహిత్‌కు గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ ముఖేష్ గౌడ్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. హౌస్‌లో సైలెంట్‌గా, కూల్‌గా ఉంటున్న ముఖేష్‌కు ఫ్యామిలీ ఆడియన్స్, సీరియల్ అభిమానుల నుంచి మద్దతు లభిస్తున్నట్లు సమాచారం. దాదాపు 29 శాతం ఓట్లతో ముఖేష్ రెండో స్థానంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
మూడో స్థానంలో రాంప్రసాద్
జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న రాంప్రసాద్ ప్రస్తుతం 8 శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉన్నట్లు ట్రెండ్స్ చెబుతున్నాయి. అతడు ప్రస్తుతానికి సేఫ్ జోన్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది.
ఇక మొదటి రోజు నుంచే రోహిత్‌ను టార్గెట్ చేస్తూ హౌస్‌లో తరచూ గొడవలకు దిగుతున్న త్రిగుణకు మాత్రం ఓటింగ్‌లో ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదని తెలుస్తోంది.
త్రిగుణకు ఆడియన్స్ షాక్?
హౌస్‌లో రోహిత్‌తో మాటల యుద్ధానికి దిగుతూ త్రిగుణ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. తనతో గొడవ పడితేనే స్క్రీన్ టైమ్ వస్తుందని, తనకే ఎక్కువ ఓట్లు పడతాయని అతడు చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీశాయి.
అయితే ఓటింగ్ ట్రెండ్స్‌లో త్రిగుణ కేవలం 7 శాతం ఓట్లతో నాలుగో స్థానానికి పరిమితమైనట్లు తెలుస్తోంది. అతడి అనవసరపు వ్యాఖ్యలు, సెల్ఫ్ డబ్బా ఆడియన్స్‌కు నచ్చకపోవడం వల్లే ఓట్లు తగ్గాయని సోషల్ మీడియాలో కొందరు అభిప్రాయపడుతున్నారు.
దేవజాని, శాలిని తర్వాతి స్థానాల్లో
త్రిగుణ తర్వాత దేవజాని, శాలిని కొనసాగుతున్నట్లు సమాచారం. మరోవైపు సుధీర్, ఝాన్సీ, వర్షిణి, సృష్టి, కృష్ణుడు సింగిల్ డిజిట్ ఓటింగ్‌కే పరిమితమైనట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా కృష్ణుడు, సృష్టి, వర్షిణికి ఒకటి నుంచి రెండు శాతం మధ్యలో మాత్రమే ఓట్లు నమోదవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో వీరు ఎలిమినేషన్ ప్రమాదంలో ఉన్నట్లు అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
ఎలిమినేషన్ రేసులో కృష్ణుడు, సృష్టి?
సింగిల్ డిజిట్ ఓటింగ్‌లో ఉన్న కంటెస్టెంట్లలో కృష్ణుడు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి వారంలో తన వాయిస్ వినిపించిన కృష్ణుడు.. వీకెండ్ ఎపిసోడ్ తర్వాత గేమ్‌లో సైలెంట్‌గా మారిపోయాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టాస్కుల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో కృష్ణుడి ఓటింగ్ శాతం తగ్గినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ట్రెండ్స్‌ను బట్టి చూస్తే ఈ వారం కృష్ణుడు లేదా సృష్టి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
అయితే బిగ్ బాస్ ఓటింగ్ ట్రెండ్స్ అనేవి మారుతూ ఉంటాయి. చివరి వరకు ఆడియన్స్ ఓటింగ్ ఎలా ఉంటుందనేదే ఎలిమినేషన్‌ను నిర్ణయిస్తుంది. అధికారికంగా ప్రకటించే వరకు ఎలిమినేషన్‌పై స్పష్టత వచ్చే అవకాశం లేదు.
Also Read: ఐదేళ్లలోపు పిల్లలకు బాల ఆధార్.. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు


