డిసెంబర్‌లో సినిమాల జాతర.. మూడు రోజుల్లోనే ఏడు మూవీస్, బాక్సాఫీస్ బరిలో బిగ్ ఫైట్!

డిసెంబర్‌లో తెలుగు సినిమాల రిలీజ్‌లు భారీగా పెరిగాయి. మూడు రోజుల్లో ఏడు సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండగా, నాగార్జున కింగ్ 100, బాలకృష్ణ దాదా, కిరణ్ అబ్బవరం రియాలిటీతో పాటు షారుఖ్ ఖాన్ కింగ్‌పై ఆసక్తి నెలకొంది.

December 2026 movies
December 2026 movies

సంక్రాంతికి వద్దాం అంటే స్లాట్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. అందరికీ డిసెంబర్ ఒక్కటే మెయిన్ ఆప్షన్ అయిపోయింది. అందుకే డిసెంబర్‌లో మూడు రోజుల్లో ఏడు సినిమాలు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. ఆ సినిమాలు ఏంటో చూసేద్దాం.

డిసెంబర్‌లో క్రేజీ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. డిసెంబర్ 3న రావాల్సిన సినిమా పోస్ట్‌పోన్ కావడంతో అదే వారంలో ఏకంగా మూడు సినిమాలు సందడి చేస్తున్నాయి.

నితిన్ హీరోగా, నాని నిర్మిస్తున్న సినిమా అలియాస్ రుక్మిణి డిసెంబర్ 4న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. దండోరా ఫేమ్ మురళీకాంత్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.

ఫౌజీ వాయిదా పడుతుందని తెలుసుకున్న వృషకర్మ మేకర్స్ సినిమాను డిసెంబర్ 4న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. భారీ బడ్జెట్, భారీ సెట్టింగ్స్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దర్శకుడు. నిధి అన్వేషణలో అడ్వెంచర్ థ్రిల్లర్‌గా సినిమా రూపొందుతోంది.

డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో యంగ్ హీరోస్ పోటీ పడుతున్నారు. విశ్వక్ సేన్, రాథోడ్ జంటగా రూపొందుతున్న లెగసీ నాలుగునే రిలీజ్ అవుతుంది. సాయి కిరణ్ రెడ్డి దర్శకత్వంలో పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో లెగసీ రూపొందుతోంది.

డిసెంబర్ సెంటిమెంట్‌ను నమ్ముకున్న నాగార్జున

డిసెంబర్ సెంటిమెంట్ నాగార్జున కెరీర్‌కు చాలా ప్రత్యేకం. ఈ నెలలో వచ్చినటువంటి చాలా సినిమాలు హిట్ కావడంతో మరోసారి క్రిస్మస్‌ను నమ్ముకున్నారు. మన్మధుడు, మాస్, నేనున్నాను, కింగ్ డిసెంబర్‌లోనే వచ్చాయి.

దీంతో వందవ సినిమా కింగ్ హండ్రెడ్ను డిసెంబర్ 24న రిలీజ్ చేయబోతున్నారు.

బాలకృష్ణ దాదా కూడా డిసెంబర్ 24నే?

కింగ్ హండ్రెడ్ వస్తున్న డిసెంబర్ 24నే బాలకృష్ణ దాదా రిలీజ్ అవుతుంది. అయితే యాక్షన్ సీన్ తీస్తున్నప్పుడు బాలయ్య పడడంతో సర్జరీ కూడా జరిగింది. దీంతో హీరో ఇప్పట్లో సెట్స్‌పైకి రాడని, దాదా 2027లోనే వస్తుందని అన్నారు.

అయితే అనూహ్యంగా బాలకృష్ణ మైసూర్ షెడ్యూల్‌లో పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 24నే దాదా రావాలన్న పట్టుదలతో బాలయ్య ఉన్నారట.

చిరంజీవి, బాలకృష్ణతో కిరణ్ అబ్బవరం పోటీ

చిరంజీవి, బాలకృష్ణ వస్తున్నా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఏ మాత్రం తగ్గడం లేదు. ఫస్ట్ టైమ్ మెగా ఫోన్ పట్టి డైరెక్ట్ చేస్తున్న మూవీ రియాలిటీని డిసెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవల అనౌన్స్ చేశాడు.

మరి ఇద్దరు పెద్ద హీరోస్‌తో కిరణ్ అబ్బవరం పోటీ పడి వస్తాడో, తగ్గుతాడో చూడాలి.

తెలుగు సినిమాలకు షారుఖ్ కింగ్ పోటీ

ఇక షారుఖ్ నటిస్తున్న హిందీ మూవీ కింగ్ డిసెంబర్ 24న రిలీజ్ అవుతుంది. పఠాన్, జవాన్ తెలుగులో మంచి వసూళ్లు సాధించడంతో కింగ్‌ను కూడా తెలుగులోకి తీసుకొస్తున్నారు.

స్ట్రెయిట్ మూవీస్ మధ్యనే గట్టి పోటీ ఉందనుకుంటే.. డబ్బింగ్ మూవీ కింగ్ కూడా తెలుగు సినిమాలకు కాంపిటీషన్‌గా మారుతుంది.

ఇలా డిసెంబర్‌లో వరుసగా సినిమాలు రిలీజ్‌కు సిద్ధమవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద పోటీ ఆసక్తికరంగా మారనుంది. ఏ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది, ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది అనేది చూడాలి.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »