శర్వానంద్ ఏమైంది? పద్ధతి మార్చావా.. డైరెక్టర్లు మార్చారా? ‘థియేటర్-గుడి’ పోలికపై నెటిజన్ల ఫైర్!

హీరో శర్వానంద్ తాజా వ్యాఖ్యలు, ప్రవర్తనపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. గతంలో ఉన్న సింపుల్ ఇమేజ్‌తో పోలిస్తే ఇప్పుడు మార్పు కనిపిస్తోందని అభిమానుల అభిప్రాయం.

"Hero Sharwanand Emotional and Aggressive Speech Controversy
"Hero Sharwanand Emotional and Aggressive Speech Controversy

హైదరాబాద్: టాలీవుడ్‌లో మోస్ట్ ప్రామిసింగ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. ఇప్పటివరకు ఆయన ఒక పద్ధతిగా, వివాదాలకు దూరంగా ఉంటూ ‘క్లాస్’ ఇమేజ్ సంపాదించుకున్నారు. కానీ, గత కొద్ది నెలలుగా శర్వా ప్రవర్తన, ఆయన మాట్లాడుతున్న తీరు అభిమానులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ముఖ్యంగా థియేటర్‌ను గుడితో పోల్చడం, స్టేజ్ మీద ఎగ్రెసివ్ స్పీచ్‌లు ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.

థియేటర్ వేరు.. టెంపుల్ వేరు!

ఇటీవల ఒక కార్యక్రమంలో శర్వానంద్ మాట్లాడుతూ థియేటర్‌ను గుడితో పోల్చడంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

భక్తి ఎక్కడ?: “గుడికి వెళ్లొచ్చిన భక్తుడి ముఖంలో ఒక వెలుగు ఉంటుంది.. థియేటర్ నుండి వచ్చే ప్రతి ప్రేక్షకుడిలో అది ఉంటుందా?” అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

సంస్కృతి: పదేళ్ల పిల్లాడు గుడికి వెళ్తా అంటే తల్లిదండ్రులు సంతోషిస్తారు, అదే థియేటర్ అంటే ఒప్పుకుంటారా? థియేటర్లలో ఉండే వాతావరణాన్ని, పవిత్రమైన గుడితో పోల్చడం శర్వానంద్ చేసిన అతిపెద్ద పొరపాటని విమర్శలు వస్తున్నాయి.

శర్వా మాటల్లో ‘నత్తి’.. ప్రవర్తనలో ‘కసి’?

గడిచిన ఆరు నెలలుగా శర్వానంద్ ఇంటర్వ్యూలను గమనిస్తే ఆయనలో ఒకరకమైన ప్రతీకార వాంఛ కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

గతంపై ఆవేదన: హైదరాబాద్, చెన్నైలలో అగ్ర హీరోల ఆస్తులకు బాధ్యులుగా ఉన్న గొప్ప కుటుంబం నుండి వచ్చి.. “షర్ట్ కొనుక్కోవడానికి డబ్బులు లేక ఏడ్చాను.. నన్ను తొక్కలేరు” అంటూ శర్వా చేస్తున్న వ్యాఖ్యల వెనుక అసలు ఉద్దేశం ఏంటన్నది అర్థం కావడం లేదు.

ఆరోగ్యంపై అనుమానాలు: బరువు తగ్గడంతో పాటు ఆయన గొంతులో స్పష్టత తగ్గిందని, ‘అపద్బాంధవుడు’ సినిమాలో చిరంజీవి గారి నత్తి తరహాలో శర్వా మాట్లాడుతున్నారని కొందరు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పీఆర్ (PR) టీమ్ ఏం చేస్తోంది?

వేరే హీరోలు గట్టిగా మాట్లాడటం వల్ల క్రేజ్ వచ్చిందని, తాను కూడా అలాగే మాట్లాడితే సినిమా హిట్టవుతుందని శర్వా భావిస్తుంటే అది తప్పే అవుతుంది.

హిట్టే మాట్లాడుతుంది: సినిమా బాగుంటే ప్రేక్షకులు గట్టిగా చెప్తారు, హీరో గట్టిగా అరిచి చెప్పాల్సిన అవసరం లేదు.

అభిప్రాయ సేకరణ: శర్వానంద్ పీఆర్ టీమ్ ఇప్పటికైనా మేల్కొని, ఆయన ఇమేజ్‌ను పాడుచేసే ఇలాంటి ‘ఎగ్రెసివ్’ ప్రసంగాలకు స్వస్తి పలకాలని, జనాల్లో ఉన్న ఒపీనియన్ తెలుసుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు.

శర్వానంద్‌లోని పాత ‘శర్వ’ను ప్రేక్షకులు మిస్ అవుతున్నారు. ఒక గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న ఆయన, అనవసరమైన పోలికలతో, ఆవేశపూరిత ప్రసంగాలతో తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసుకోకూడదని అభిమానులు కోరుకుంటున్నారు.

Also read:  బాక్సాఫీస్ వద్ద ‘బైకర్’ స్పీడ్.. భ్రమరాంబ థియేటర్ హౌస్‌ఫుల్! షర్వానంద్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్?

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »