పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు పూర్తిగా ఉచితంగా అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను వేగంగా నిర్మిస్తోంది. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అల్వాల్‌లో రూ.1,196 కోట్లతో నిర్మిస్తున్న టిమ్స్ ఆస్పత్రి చివరి దశలోకి చేరుకుంది. వెయ్యికి పైగా పడకలతో అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.
తెలంగాణలో పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో టిమ్స్ ఆస్పత్రులు నిర్మాణ దశలో ఉండగా, హైదరాబాద్ శివారులోని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అల్వాల్‌లో నిర్మిస్తున్న టిమ్స్ ఆస్పత్రి పనులు తుది దశకు చేరుకున్నాయి.
Hyderabad New Elevated Corridor: హైదరాబాద్లో నాలుగు లైన్లతో కొత్త హైవే.. హెచ్ఎండీఏ ప్రతిపాదనలు
VB-G RAM Gపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. అమలు చేస్తూనే సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న ప్రభుత్వం
National Ice Skating: ఐస్ స్కేటింగ్లో హైదరాబాద్ కుర్రాడి అద్భుతం.. జాతీయ పోటీల్లో మూడు గోల్డ్ మెడల్స్ సొంతం!
Also Read: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి లైట్లు మాయం?.. దొంగతనమా, నిర్లక్ష్యమా అన్న చర్చ
అల్వాల్ టిమ్స్ – భారీ ప్రాజెక్ట్
అల్వాల్ టిమ్స్ ఆస్పత్రిని సుమారు రూ.1,196 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. 12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ఈ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వెయ్యికి పైగా పడకలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం భవన నిర్మాణ పనులు పూర్తికి దగ్గరగా ఉండగా, విద్యుత్తు, ప్లంబింగ్ తదితర సాంకేతిక పనులు జరుగుతున్నాయి.
వైద్యారోగ్యశాఖ అధికారులు వచ్చే నెలలోనే ఆస్పత్రిని రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది ప్రారంభమైతే హైదరాబాద్ నగరంతో పాటు పరిసర శివారు ప్రాంతాల ప్రజలకు అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి.
మరో మూడు టిమ్స్ ఆస్పత్రులు
రాష్ట్ర ప్రభుత్వం సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో కొత్త టిమ్స్ ఆస్పత్రులను నిర్మిస్తోంది.
సనత్‌నగర్లో 53 ఎకరాల్లో రూ.968 కోట్ల సవరించిన అంచనా వ్యయంతో 1000 పడకల ఆస్పత్రి నిర్మాణం పూర్తికావచ్చింది.
అల్వాల్లో 28 ఎకరాల్లో సుమారు రూ.1,049 కోట్ల సవరించిన అంచనాతో వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మిస్తున్నారు.
ఎల్బీనగర్లో 21 ఎకరాల్లో రూ.1,011 కోట్లతో ఆస్పత్రి పనులు కొనసాగుతున్నాయి.
ఈ టిమ్స్ ఆస్పత్రుల ద్వారా పేదలకు కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని పూర్తిగా ఉచితంగా అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
సనత్‌నగర్ టిమ్స్ ఉగాదికి ప్రారంభం
ఇదిలా ఉంటే, సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రి ప్రారంభానికి సిద్ధమైంది. ఉగాది పండుగ రోజున ఆస్పత్రిని ప్రారంభించి ప్రజలకు అంకితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1000 పడకల సామర్థ్యంతో నిర్మించిన ఈ ఆస్పత్రిలో అత్యాధునిక సదుపాయాలు ఏర్పాటు చేశారు.
ఇందులో 16 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, ఓపీ విభాగాలు, ఇన్‌పేషెంట్ డిపార్ట్‌మెంట్లు, ప్రత్యేక వార్డులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, ఐసీయూలు, అత్యవసర చికిత్స విభాగాలు ఏర్పాటు చేశారు.
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం
టిమ్స్ ఆస్పత్రుల ప్రారంభంతో ప్రభుత్వ వైద్య రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రుల్లో మాత్రమే లభించే సూపర్ స్పెషాలిటీ సేవలు ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా అందుబాటులోకి రావడం రాష్ట్ర ప్రజలకు గొప్ప ఊరటనిచ్చే అంశంగా మారనుంది.
అల్వాల్ టిమ్స్ ప్రారంభం తర్వాత హైదరాబాద్ ఉత్తర భాగంలో వైద్య సదుపాయాలు మరింత బలపడనున్నాయి. దీంతో పేదలకు నాణ్యమైన వైద్యం మరింత చేరువ కానుంది.