Miyapur : మియాపూర్ హఫీజ్‌పేటలో రైల్వే పోలీసులు దారుణానికి ఒడిగట్టారు. హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో నివాసం ఉంటున్న మహిళపై రైల్వే కానిస్టేబుల్ తీవ్రస్థాయిలో దాడికి పాల్పడ్డాడు. రాత్రివేళ మత్తులో ఉన్న సదరు మహిళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందన్న కారణంతో ఆమె పట్ల అత్యంత అమానుషంగా వ్యవహరించాడు. నడిరోడ్డుపైనే ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్తూ విచక్షణారహితంగా దాడికి దిగాడు.
కాకీ దుస్తుల మదంతో రైల్వే పోలీస్ చేసిన ఈ దౌర్జన్యాన్ని చూసి స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అక్కడే ఉన్న కొందరు ఈ ఘోరాన్ని మొబైల్ కెమెరాలో చిత్రీకరించడంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మహిళ తప్పు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అంతే తప్ప ఇలా రోడ్డుపై జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్తూ రాక్షసంగా దాడి చేయడం ఏంటి? అని స్థానికులు మండిపడుతున్నారు. మహిళపై కాకీ ప్రతాపం చూపించిన ఆ రైల్వే పోలీస్‌పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
View this post on Instagram
అవును.. ఆ మహిళను ఎంత దారుణంగా ఆ కానిస్టేబుల్ లాక్కెళ్తున్నారో మనం విజువల్స్‌లో చూస్తున్నాం. జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వెళ్తున్నారు. అదంతా రోడ్డుపైనే. ఒక వ్యక్తి ఆపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ పోలీస్ అసలు ఆగడం లేదు.
పక్కనే ఒక చిన్న పాప కూడా ఉంది. ఆ పాప ఆ ఈడ్చుకెళ్తున్న మహిళకు సంబంధించిన పాప అయ్యుండొచ్చు.. తన కూతురు ఏమో.. ఆమెను ఇష్టానుసారంగా, ఇష్టం వచ్చినట్టు లాక్కుని వెళ్తున్నారు. ఈడ్చుకుని వెళ్తున్నారు. పక్కన వాళ్లు చోద్యం చూస్తున్నారు. ఒక వ్యక్తి మాత్రం ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినా కూడా అస్సలు ఆగడం లేదు.
రైల్వే పోలీసుల తీరుపై ఇప్పుడు మొత్తం ప్రశ్నిస్తున్నారు. ఒక పోలీస్ అధికారి అయితే మాత్రం అంత దారుణంగా లాక్కుని వెళ్లాలా? అని ప్రశ్నిస్తున్నారు. చట్టపరంగా చర్యలు తీసుకోవాలి.
ఏదైనా తప్పు చేసినా, ఏదైనా దుర్భాషలాడినా మహిళపై లేదా ఇంకెవరు ఎటువంటి తప్పు చేసినా కూడా వాళ్లకు చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు ఏవైతే ఉంటాయో అవి తీసుకోవాలి. పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లాలి, కంప్లెయింట్ చేయాలి లేదంటే వాళ్లపై కేసు పెట్టొచ్చు. కానీ ఈ రకంగా విచక్షణారహితంగా ఓ మహిళను నడిరోడ్డుపై లాక్కుంటూ వెళ్లడం పట్ల మాత్రం స్థానికులు, అలాగే ఈ వీడియో చూసిన చాలా మంది మాత్రం ప్రశ్నిస్తున్నారు.
