హైదరాబాద్: మేడిపల్లిలో ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ ‘కళ్యాణ్ జ్యువెలర్స్’ తన నూతన షోరూమ్‌ను అత్యంత వైభవంగా ప్రారంభించింది. ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల ముఖ్య అతిథిగా విచ్చేసి షోరూమ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. సంప్రదాయ నైపుణ్యం ఆధునిక ట్రెండ్స్ కలగలిసిన అద్భుతమైన ఆభరణాల సేకరణను ఈ షోరూమ్‌లో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ విశ్వసనీయత పారదర్శకతకు మారుపేరైన కళ్యాణ్ జ్యువెలర్స్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మేడిపల్లి ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైవిధ్యమైన డిజైన్లు ఇప్పుడు చేరువ కావడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కళ్యాణరామన్ మాట్లాడుతూ తెలంగాణలో తమ వ్యాపార విస్తరణలో భాగంగా ఈ షోరూమ్ ప్రారంభించడం ఒక కీలక మైలురాయి అని పేర్కొన్నారు. కస్టమర్ల నమ్మకాన్ని కాపాడుతూ వారికి అత్యుత్తమ షాపింగ్ అనుభూతిని అందించడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు.
వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లు
నూతన ప్రారంభోత్సవం సందర్భంగా కళ్యాణ్ జ్యువెలర్స్ పలు ఆకర్షణీయమైన రాయితీలను ప్రకటించింది. బంగారం వజ్రాల ఆభరణాల తయారీ కూలీ (Making Charges) పై 50 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే వెండి ఆభరణాలపై 10 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ వెండి వస్తువుల తయారీ కూలీపై 25 శాతం రాయితీ ఇస్తోంది. వీటితో పాటు మార్కెట్ ధర కంటే తక్కువగా ఉండే ‘స్పెషల్ గోల్డ్ బోర్డ్ రేట్’ కూడా పరిమిత కాలం పాటు అందుబాటులో ఉంటుంది.
ఈ షోరూమ్‌లో కళ్యాణ్ జ్యువెలర్స్ సిగ్నేచర్ బ్రాండ్లు అయిన ముహూరత్, ముద్ర, నిమః, గ్లో, జియా, అనోఖి వంటి కలెక్షన్లతో పాటు సరికొత్తగా లాంచ్ చేసిన ‘లీల’ కలెక్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. విక్రయించే ప్రతి ఆభరణం బిఐఎస్ హాల్‌మార్క్ కలిగి ఉండటమే కాకుండా ‘4-లెవల్ అస్యూరెన్స్ సర్టిఫికేట్’తో లభిస్తుంది. ఇది బంగారు స్వచ్ఛత, లైఫ్ టైమ్ మెయింటెనెన్స్ పారదర్శకమైన ఎక్స్ఛేంజ్ పాలసీలకు పూర్తి హామీ ఇస్తుంది.
ఈ వార్తలు చదవండి


