దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ మహిళా పారిశ్రామికవేత్తల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో తన ప్రతిష్టాత్మక ఎంఎస్ఎంఈ వేదిక ఎవాల్వ్ ప్రత్యేక సదస్సును నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 110 మందికి పైగా మహిళల నేతృత్వంలోని వ్యాపార సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. మహిళా వ్యాపారవేత్తల అవసరాలు, మూలధన లభ్యత , సరైన బ్యాంకింగ్ పరిష్కారాల ద్వారా వారి వ్యాపారాలను ఆత్మవిశ్వాసంతో ఎలా విస్తరించవచ్చనే అంశాలపై ఇందులో ప్రధానంగా చర్చించారు. యాక్సిస్ బ్యాంక్ ఎస్ఎంఈ ఖాతాదారులలో సుమారు 28 శాతం మందికి కనీసం ఒక మహిళా ప్రమోటర్ ఉండగా, 15 శాతం సంస్థలు పూర్తిగా మహిళల యాజమాన్యంలో నడుస్తున్నాయి.
పారిశ్రామికవేత్తల కీలక పాత్ర..
భారతదేశపు ఎంఎస్ఎంఈ వృద్ధి కథలో మహిళా పారిశ్రామికవేత్తలు శక్తివంతమైన శక్తిగా ఎదుగుతూ ఆవిష్కరణలు, ఉపాధి , స్థానిక ఆర్థిక వ్యవస్థలకు తమ వంతు సహకారం అందిస్తున్నారు. 2025–26 ఆర్థిక సర్వే ప్రకారం దేశ జీడీపీలో ఎంఎస్ఎంఈల వాటా 31.1 శాతంగా ఉంది. నీతి ఆయోగ్, ట్రాన్స్‌యూనియన్ సిబిల్ , మైక్రోసేవ్ కన్సల్టింగ్ సంయుక్త నివేదిక ప్రకారం, 2017 నుండి 2025 మధ్య వ్యాపార అవసరాల కోసం మహిళలకు ఇచ్చిన రుణాలు 7.5 రెట్లు పెరిగాయి. పూచీకత్తు లేకపోవడం, వ్యాపార అనుభవం తక్కువగా ఉండటం వంటి అడ్డంకులను అధిగమించడానికి యాక్సిస్ బ్యాంక్ సీజీటీఎంఎస్ఈ ఆధారిత పూచీకత్తు లేని రుణాలు, సులభతరమైన డాక్యుమెంటేషన్, డిజిటల్ ఆన్‌బోర్డింగ్ , జీఎస్టీ ఆధారిత రుణ పథకాలను అందిస్తోంది.
ప్రత్యేక ప్రయోజనాలు..
మహిళా పారిశ్రామికవేత్తల రోజువారీ కార్యకలాపాలు , విస్తరణ అవసరాల కోసం బ్యాంక్ 35కు పైగా ఎంఎస్ఎంఈ ఉత్పత్తులను, 15కు పైగా డిజిటల్ సేవలను అందిస్తోంది. రూ. 20 లక్షల వరకు మర్చంట్ క్యాష్ అడ్వాన్స్, జీఎస్టీ ఆధారిత ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయాలు ఇందులో ఉన్నాయి. అర్హులైన మహిళా పారిశ్రామికవేత్తలకు సీజీటీఎంఎస్ఈ ఆధారిత ఓవర్‌డ్రాఫ్ట్ , టర్మ్ లోన్లపై 1 శాతం, సెక్యూర్డ్ ఉత్పత్తులపై 0.5 శాతం వడ్డీ రాయితీని అందిస్తోంది. అలాగే, మహిళల వ్యక్తిగత ఆర్థిక అవసరాల కోసం అరిస్ పేరుతో ప్రత్యేక పొదుపు ఖాతాను నిర్వహిస్తూ, ఆరోగ్య సంరక్షణ, లాకర్లు, డీమ్యాట్, క్రెడిట్ కార్డులు , బంగారు రుణాలపై రూ. 38,000 వరకు ప్రయోజనాలను కల్పిస్తోంది.
ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్ ఎంఎస్ఎంఈ పోర్ట్‌ఫోలియో సుమారు రూ. 3.3 లక్షల కోట్లకు చేరుకుని 24 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. గుర్తింపు పొందిన స్టార్టప్‌లలో దాదాపు 47 శాతం సంస్థలకు కనీసం ఒక మహిళా డైరెక్టర్ ఉండటం దేశ ఆర్థిక పరివర్తనలో మహిళల పెరుగుతున్న పాత్రకు నిదర్శనమని బ్యాంక్ గ్రూప్ హెడ్ ప్రశాంత్ టీఎస్ పేర్కొన్నారు. వ్యాపారాలు విస్తరిస్తున్న కొద్దీ నగదు ప్రవాహ నిర్వహణ, కొత్త మార్కెట్లకు చేరుకోవడంలో మహిళా సంస్థలకు సరైన బ్యాంకింగ్ పరిష్కారాలు అందించడమే తమ లక్ష్యమని కమర్షియల్ బ్యాంకింగ్ కవరేజ్ గ్రూప్ హెడ్ విజయ్ శెట్టి తెలిపారు.