న్యూఢిల్లీలోని మానేసర్ ప్లాంట్ నుండి మాంట్రా ఎలక్ట్రిక్ సరికొత్త రికార్డు.. 1,000 భారీ ఎలక్ట్రిక్ ట్రక్కులను విడుదల చేసిన తొలి భారతీయ బ్రాండ్..

న్యూఢిల్లీలోని మానేసర్ ప్లాంట్ నుండి మాంట్రా ఎలక్ట్రిక్ సరికొత్త రికార్డు.. 1,000 భారీ ఎలక్ట్రిక్ ట్రక్కులను విడుదల చేసిన తొలి భారతీయ బ్రాండ్..

భారతదేశపు పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాల బ్రాండ్ మాంట్రా ఎలక్ట్రిక్ తన మానేసర్ ప్లాంట్ నుండి 1,000వ రైనో ఎలక్ట్రిక్ ట్రక్కును విడుదల చేసి సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి , అత్యంత వేగవంతమైన భారతీయ బ్రాండ్‌గా మాంట్రా ఎలక్ట్రిక్ నిలిచింది. వినియోగదారుల నమ్మకం, మళ్లీ మళ్లీ కొనుగోలు చేయడంతో ఈ విజయం సాధ్యమైంది.

రూ. 70 కోట్లకు పైగా ఆదా..
ఈ మైలురాయిని పురస్కరించుకుని 1,000 రైనోస్ అండ్ బియాండ్.. ఛార్జ్ ది ఛేంజ్ అనే నినాదంతో వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు రోడ్డెక్కిన రైనో ట్రక్కులన్నీ కలిసి 3.6 కోట్ల కిలోమీటర్లకు పైగా ప్రయాణించాయి. దీనివల్ల 65 లక్షల కిలోలకు పైగా కర్బన ఉద్గారాలు తగ్గాయి, ఇది ఏడాదిలో సుమారు 14 లక్షల చెట్లు పీల్చుకునే కాలుష్యంతో సమానం. అంతేకాకుండా, ఈ ట్రక్కులను నడపడం వల్ల యజమానులకు నిర్వహణ ఖర్చులలో రూ. 70 కోట్లకు పైగా ఆదా అయింది.

సంస్థ ప్రతినిధుల స్పందన..
జనవరి 2026లో రైనో 5538 ఈవీ ట్రక్కుకు పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద సర్టిఫికెట్ లభించింది. భారీ ఎలక్ట్రిక్ ట్రక్కుల విభాగంలో ఈ గుర్తింపు పొందిన తొలి సంస్థ ఇదే. ఈ పథకం కింద కొనుగోలుదారులకు ఒక్కో వాహనంపై రూ. 9.6 లక్షల వరకు రాయితీ లభిస్తుంది. తాము ప్రారంభించినప్పుడు భారత్‌లో భారీ ఎలక్ట్రిక్ ట్రక్కుల మార్కెట్ లేదని, ఛార్జింగ్ కేంద్రాలు తక్కువగా ఉండటంతో పాటు బరువు మోయడంపై సందేహాలు ఉండేవని మాంట్రా ఎలక్ట్రిక్ మేనేజింగ్ డైరెక్టర్ జలజ్ గుప్తా తెలిపారు. కానీ వినియోగదారుల నమ్మకం, ప్రభుత్వ ప్రోత్సాహంతో నేడు ఈ రంగం కీలక మలుపు తిరిగిందన్నారు. సుదూర ప్రయాణాలు, అధిక బరువు, తక్కువ ఖర్చు వంటి అంశాలలో తమ ట్రక్కులు అద్భుత పనితీరు కనబరిచాయని, రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాల వినియోగాన్ని మరింత విస్తరిస్తామని సంస్థ సీఈఓ నవనీత్ సేథి పేర్కొన్నారు.

About Author:

Vidya Burujukadi

కంటెంట్ రైటర్‌గా మన వార్త వెబ్ సైట్‌కి విద్య.బి పనిచేస్తున్నారు. ప్రధానంగా బిజినెస్ వార్తలతో పాటు పర్సనల్ ఫైనాన్స్, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన తాజా సమాచారం, జనరల్ అంశాలకు సంబంధించిన కథనాలను ఆమె అందిస్తారు. విద్యకు తెలుగు మీడియా…

More About Author »