హైదరాబాద్‌లోని నియోపొలిస్‌లో గోద్రేజ్ ప్రాపర్టీస్ నిర్మిస్తున్న నివాస ప్రాజెక్ట్ గోద్రేజ్ ఇపోక్‌ను సరికొత్త రీతిలో ప్రచారం చేశారు. ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఇతివృత్తమైన గోల్డెన్ ఎరా భావనను ప్రతిబింబించేలా, బంగారు , బొగ్గు రంగులతో తీర్చిదిద్దిన భవన నమూనాను ప్రత్యేక బెలూన్ సాయంతో దాదాపు 24 కిలోమీటర్ల ఎత్తులోని స్ట్రాటోస్పియర్ స్థాయికి పంపారు. భారత రియల్ ఎస్టేట్ రంగంలో ఇలాంటి ప్రయోగం జరగడం ఇదే మొదటిసారి అని సంస్థ పేర్కొంది.
ప్రాజెక్ట్ ప్రత్యేకతలు..
కోకాపేట నియోపొలిస్‌లో 5 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 57 అంతస్తులతో రెండు టవర్లను నిర్మిస్తున్నారు. ఆర్ట్ డెకో కాలం నాటి ఆకర్షణ, ఆశావాదం స్ఫూర్తితో రూపొందించిన ఈ ప్రాజెక్ట్ ప్రారంభ ధర రూ.2.75 కోట్లుగా ఉంది. ఇందులో 1,960 నుండి 3,236 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు, నాలుగు పడక గదుల ఇళ్లు ఉంటాయి. స్కై బ్రిడ్జ్, టెర్రస్ సదుపాయాలు, ప్రత్యేక భవన శిఖరం, ఆర్ట్ డెకో శైలి క్లబ్‌హౌస్ ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి.
పర్యావరణ హిత ప్రయోగం..
ఈ ప్రయోగంలో పునరుత్పాదక హైడ్రోజన్‌ను వినియోగించామని, పంపిన ప్రతి పరికరాన్ని సురక్షితంగా తిరిగి సేకరించి ఎలాంటి వ్యర్థాలు లేకుండా పర్యావరణ హితంగా ఈ మిషన్ నిర్వహించామని గోద్రేజ్ ప్రాపర్టీస్ ఉన్నతాధికారి సుభాషిష్ పట్నాయక్ తెలిపారు. ఆర్ట్ డెకో కాలం నాటి ఉన్నత ఆశయాలు, ఆకాశహర్మ్యాల స్ఫూర్తిని ఆధునిక నిర్మాణ శైలితో ప్రజలకు చేరువ చేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని ఆయన వివరించారు.
సాంకేతిక భాగస్వామ్యం..
స్ట్రాటోస్పియర్ ప్రయోగాల్లో అనుభవం ఉన్న ధీ అండ్ కిన్, సెంట్ ఇంటు స్పేస్ సంస్థల సహకారంతో యూకే నుండి ఈ మిషన్ చేపట్టారు. కెమెరాలు అమర్చిన ప్రత్యేక ప్లాట్‌ఫారమ్ ద్వారా భవన నమూనా ప్రయాణాన్ని, 24 కిలోమీటర్ల ఎత్తు నుండి భూమి వంపు దృశ్యాలను చిత్రీకరించారు. ఈ ఆవిష్కరణ వీడియోను గోద్రేజ్ ప్రాపర్టీస్ డిజిటల్, సోషల్ మీడియా వేదికల్లో అందుబాటులో ఉంచింది.