ఏజియాస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ నుండి వెల్త్ ప్రీమియర్ ప్లాన్.. దీర్ఘకాలిక పెట్టుబడులు, ఆర్థిక రక్షణకు సరికొత్త అవకాశం..

ప్రముఖ ప్రైవేట్ జీవిత బీమా సంస్థ ఏజియాస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్, యూనిట్-లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకమైన వెల్త్ ప్రీమియర్ ప్లాన్‌ను ప్రారంభించింది.

ఏజియాస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ నుండి వెల్త్ ప్రీమియర్ ప్లాన్.. దీర్ఘకాలిక పెట్టుబడులు, ఆర్థిక రక్షణకు సరికొత్త అవకాశం..

ప్రముఖ ప్రైవేట్ జీవిత బీమా సంస్థ ఏజియాస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్, యూనిట్-లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకమైన వెల్త్ ప్రీమియర్ ప్లాన్‌ను ప్రారంభించింది. కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పిస్తూనే, మార్కెట్ ఆధారిత సంపద సృష్టిని మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి ఈ ప్లాన్‌ను రూపొందించారు. దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టి సంపదను నిర్మించుకోవాలనుకునే వారికి తక్కువ ప్రీమియంతో ప్రారంభించే అవకాశాన్ని ఇది కల్పిస్తుంది.

పాలసీ కాలపరిమితి..
ఈ ప్లాన్ కింద పాలసీదారులు 10 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు పాలసీ కాలాన్ని ఎంచుకోవచ్చు. అలాగే సింగిల్, లిమిటెడ్ , రెగ్యులర్ ప్రీమియం చెల్లింపు ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. లిమిటెడ్ లేదా రెగ్యులర్ ప్రీమియం ఎంచుకునే కస్టమర్లు కనీసం రూ.40,000 వార్షిక ప్రీమియంతో ప్రారంభించవచ్చు, సింగిల్ పే ఎంపికకు కనీస ప్రీమియం రూ.1 లక్షగా నిర్ణయించారు.

పెట్టుబడి వ్యూహాలు..
ఈ ప్లాన్‌లో ఈక్విటీ, ఇండెక్స్-లింక్డ్, అసెట్ అలకేషన్ , ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ విభాగాలలో ఐదు పెట్టుబడి వ్యూహాలు, పన్నెండు ఫండ్ ఆప్షన్లు ఉన్నాయి. కస్టమర్లు తమ ఫండ్ కేటాయింపును తామే నిర్వహించుకునే సెల్ఫ్-మేనేజ్డ్ స్ట్రాటజీని లేదా మార్కెట్ కదలికలు, వయస్సు, రిస్క్ ప్రొఫైల్ , మెచ్యూరిటీ తేదీ ఆధారంగా పనిచేసే నాలుగు ఆటోమేటెడ్ వ్యూహాలను ఎంచుకోవచ్చు. ఎలాంటి అదనపు రుసుము లేకుండా అపరిమితంగా ఫండ్ల మధ్య మారే సదుపాయం కూడా ఉంది, అయితే పెట్టుబడి రిస్క్ పాలసీదారుదే. పాలసీ 10వ సంవత్సరం ముగిసినప్పటి నుండి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వెల్త్ బూస్టర్లు, మెచ్యూరిటీ సమయంలో మెచ్యూరిటీ బూస్టర్ జమ అవుతాయి. అలాగే 6వ పాలసీ సంవత్సరం నుండి సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ఫెసిలిటీ ద్వారా నిరంతర ఆదాయాన్ని పొందే సౌలభ్యం ఉందని ఏజియాస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ , సీఈఓ జ్యూడ్ గోమ్స్ తెలిపారు.

About Author:

Vidya Burujukadi

కంటెంట్ రైటర్‌గా మన వార్త వెబ్ సైట్‌కి విద్య.బి పనిచేస్తున్నారు. ప్రధానంగా బిజినెస్ వార్తలతో పాటు పర్సనల్ ఫైనాన్స్, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన తాజా సమాచారం, జనరల్ అంశాలకు సంబంధించిన కథనాలను ఆమె అందిస్తారు. విద్యకు తెలుగు మీడియా…

More About Author »