Horoscope Today: 04-03-2026 రాశి ఫలాలు… ఈ రాశివారికి ధనలాభం, వారికి జాగ్రత్త!

Horoscope Today : బుధవారం రాశి ఫలాలు. మేషం నుంచి మీనం వరకు ఈ రోజు గ్రహస్థితి ఎలా ప్రభావం చూపుతుంది?

Horoscope Today
Horoscope Today

Horoscope Today : జ్యోతిష్యం, రాశి ఫలాలను విశ్వసించే వారు ప్రతి రోజు తమ దినచర్యను ప్రారంభించే ముందు రాశి ఫలాలు చూసే అలవాటు కలిగి ఉంటారు. గ్రహాల గమనాన్ని ఆధారంగా తీసుకుని ఈరోజు (04-03-2026, బుధవారం) మీ రాశి ప్రకారం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

 

మేషం

ఈరోజు బంధు, మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. చేపట్టే పనుల్లో చిన్నచిన్న ఆటంకాలు ఎదురవుతాయి. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకపోవడం మంచిది. గృహంలో మార్పులు ఆందోళన కలిగించవచ్చు. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి.

వృషభం

వృత్తి సంబంధిత ఇబ్బందులను అధిగమిస్తారు. మానసికంగా కొంత ఆందోళన ఉంటుంది. స్త్రీలతో సంబంధిత విషయాల్లో సమస్యలు తలెత్తవచ్చు. ఆకస్మిక ధననష్టం జరిగే సూచనలు ఉన్నాయి. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

మిథునం

కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆర్థిక ఒత్తిడి ఉండవచ్చు. కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది. ఆత్మీయుల సహకారం అవసరం అవుతుంది.

కర్కాటకం

స్థిరాస్తి సమస్యలు పరిష్కారమవుతాయి. గృహ సంబంధిత పనులపై దృష్టి పెడతారు. ఆకస్మిక ధనలాభం కలగవచ్చు. బంధుమిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేస్తారు.

సింహం

కొత్త వ్యక్తులను నమ్మి మోసపోకుండా జాగ్రత్తపడాలి. సమాజంలో అప్రతిష్ట రాకుండా వ్యవహరించాలి. ప్రయత్నాల్లో ఆటంకాలు ఉంటాయి. రుణ సంబంధిత విషయాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదరులతో విభేదాలు రావచ్చు.

కన్య

కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. ధనలాభం ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రారంభించిన పనులు ఫలిస్తాయి. ప్రయాణాలు లాభదాయకం.

తుల

ప్రయత్నానికి తగినంత ఫలితం లభించకపోవచ్చు. వృథా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారంలో లాభాలు సాధ్యమే. రుణప్రయత్నాలు అవసరం అవుతాయి. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

వృశ్చికం

కుటుంబంలో కలహాలు తలెత్తవచ్చు. అశుభవార్తలు వినే అవకాశం ఉంది. ధననష్టం జరగకుండా జాగ్రత్తపడాలి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. కొత్త పనులను వాయిదా వేయడం మంచిది.

ధనుస్సు

కుటుంబంలో ఆనందం ఉంటుంది. వాయిదా పడిన పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యవసాయం ద్వారా లాభాలు పొందుతారు. ప్రయత్నాలు ఫలిస్తాయి.

మకరం

శుభకార్యాలు సులభంగా పూర్తవుతాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాలు లాభాన్ని ఇస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

కుంభం

స్త్రీల ద్వారా లాభాలు పొందుతారు. అన్ని పనుల్లో విజయావకాశాలు ఉన్నాయి. శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో సౌఖ్యం నెలకొంటుంది.

మీనం

అద్భుత అవకాశాలు కలుగుతాయి. శుభకార్యాలు సులభంగా నెరవేరుతాయి. ముఖ్యమైన వార్తలు వినవచ్చు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. కొత్త వస్తువులు, ఆభరణాలు సేకరిస్తారు.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »