బట్టలు ఉతికేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా? లేదంటే వాషింగ్ మెషీన్ ఖతమే

వాషింగ్ మెషీన్‌(Washing machine)లో బట్టలు ఉతికేటప్పుడు చేసే చిన్న తప్పులు బట్టలతో పాటు మెషీన్‌కూ నష్టం కలిగిస్తాయి. సర్ఫ్ వాడకం నుంచి జేబులు చెక్ చేయడం వరకు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు తెలుసుకుంటే బట్టలు ఎక్కువ కాలం మన్నుతాయి, వాషింగ్ మెషీన్ కూడా దీర్ఘకాలం సురక్షితంగా పనిచేస్తుంది.

Washing machine
Washing machine

Washing machine

హైదరాబాద్: బట్టలు ఉతకడం అంటే కేవలం మెషీన్‌లో వేసి స్విచ్ ఆన్ చేయడం మాత్రమే కాదు. మనకు తెలియకుండా చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు అటు బట్టలను, ఇటు వాషింగ్ మెషీన్‌(Washing machine)ను రెండింటినీ పాడు చేస్తాయి. ఎక్కువ సర్ఫ్ వాడితే బట్టలు తెల్లగా వస్తాయని అనుకోవడం నుండి, జేబుల్లో సామాన్లు చెక్ చేయకపోవడం వరకు మనం చేసే తప్పులెన్నో. వాషింగ్ మెషీన్, దుస్తులు ఎక్కువ కాలం మన్నాలంటే ఈ క్రింది చిట్కాలను తప్పక పాటించండి.

పాటించాల్సిన జాగ్రత్తలు:

సర్ఫ్ (డిటర్జెంట్) అతిగా వద్దు: ఎక్కువ డిటర్జెంట్ వాడితే బట్టలు ఎక్కువ శుభ్రపడవు, పైగా దుస్తుల నాణ్యత దెబ్బతింటుంది. అవసరమైన మేరకే సర్ఫ్ వాడటం మంచిది.

జేబులు చెక్ చేయడం మర్చిపోవద్దు: ఉతికే ముందు జేబుల్లో చిల్లర నాణేలు, తాళాలు లేకుండా చూసుకోండి. ఇవి మెషీన్ తిరుగుతున్నప్పుడు లోపల ఉన్న గ్లాస్ డోర్లకు తగిలి గీతలు పడేలా చేస్తాయి.

జిప్పుల విషయంలో జాగ్రత్త: డ్రస్సులకు ఉన్న జిప్పులను పూర్తిగా పెట్టిన తర్వాతే మెషీన్‌లో వేయాలి. లేదంటే ఆ జిప్పులు మెషీన్ అంచులకు తగిలి డ్రైయర్ పాడయ్యే ప్రమాదం ఉంది.

Washing machine
Washing machine

మరకలను గట్టిగా రుద్దకండి: బట్టల మీద మరకలు పడితే వాటిని గట్టిగా రుద్దకూడదు. దీనివల్ల బట్టలు చినిగిపోయే అవకాశం ఉంది. మరక పడిన వెంటనే సహజ పద్ధతుల్లో (నిమ్మరసం, సోడా వంటివి) తొలగించడానికి ప్రయత్నించండి.

బ్లీచ్ వాడకం : తెల్ల బట్టల కోసం బ్లీచ్‌ను అతిగా వాడటం వల్ల దారం బలహీనపడి బట్టలు త్వరగా పాడవుతాయి.

రంగు పోయే బట్టలను వేరు చేయడం: కొత్త బట్టలు లేదా రంగు పోయే అవకాశం ఉన్న వస్త్రాలను మిగిలిన వాటితో కలపకండి. అనుమానం ఉంటే ముందుగా బట్టను కొద్దిగా తడిపి పరీక్షించండి. రంగు పోతుంటే వాటిని విడిగా, త్వరగా ఉతికి ఆరేయాలి.

మెషీన్ ఫిట్టింగ్ సరిగ్గా ఉండాలి: వాషింగ్ మెషీన్ ఉన్న చోట నేల ఎగుడుదిగుడుగా లేకుండా చూసుకోండి. లేదంటే మెషీన్ తిరిగేటప్పుడు వచ్చే వైబ్రేషన్ల వల్ల లోపల భాగాలు, ఫ్లోర్ రెండూ దెబ్బతింటాయి.

రెగ్యులర్ క్లీనింగ్: బట్టలనే కాదు, వాషింగ్ మెషీన్‌(Washing machine)ను, డ్రైయర్‌ను కూడా తరచూ శుభ్రం చేస్తూ ఉండాలి.

ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే బట్టలు ఎప్పుడూ కొత్తవిలా మెరుస్తుంటాయి , వాషింగ్ మెషీన్ కూడా ఎక్కువ కాలం పనిచేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »