50 వరకు అంకెలు రాయలేకపోయిందన్న కోపం.. నాలుగున్నరేళ్ల కూతురిని కిరాతకంగా కొట్టి చంపిన తండ్రి

ముఖంపై స్పష్టమైన గాయాలు, కమిలిన గుర్తులు చూసి తల్లి అనుమానం వ్యక్తం చేయడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు మలుపు తిరిగింది.

Father Arrested in Haryana Faridabad Girl Murder Case

హర్యానాలోని ఫరీదాబాద్‌లో మనసును కలిచివేసే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 50 వరకు అంకెలు రాయలేకపోయిందన్న కోపంతో ఓ తండ్రి తన నాలుగున్నరేళ్ల కన్నకూతురిని అమానుషంగా కొట్టి చంపాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. చిన్నారి మృతిపై తల్లి ఫిర్యాదుతో అసలు నిజం బయటపడింది. పోలీసుల కథనం ప్రకారం, ఈ ఘటన ఫరీదాబాద్ సమీపంలోని ఝర్‌సైంత్లీ గ్రామంలో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ సోన్‌భద్ర జిల్లా వాసి కృష్ణ జైస్వాల్ తన భార్య, పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. ఈ దంపతులకు ఏడేళ్ల కొడుకు, హత్యకు గురైన నాలుగున్నరేళ్ల కూతురు, రెండేళ్ల చిన్న కూతురు ఉన్నారు.

ఈ నెల 21న ఇంట్లో కృష్ణ తన కూతురికి చదువు చెబుతున్న సమయంలో ఈ ఘోరం జరిగింది. చిన్నారి స్కూల్‌కు వెళ్లకపోవడంతో తానే ఇంట్లో చదివిస్తున్నానని, 50 వరకు అంకెలు రాయమని చెప్పగా రాయలేకపోయిందని ఆగ్రహంతో విచక్షణారహితంగా దాడి చేశానని కృష్ణ విచారణలో అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.పాప తీవ్రంగా గాయపడిన అనంతరం కృష్ణ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం దాచిపెట్టేందుకు పనిలో ఉన్న భార్యకు ఫోన్ చేసి, పాప ఆడుకుంటూ మెట్లపై నుంచి పడిపోయిందని అబద్ధం చెప్పాడు.

Also Read: అసిస్టెంట్‌తో హోట‌ల్‌లో అడ్డంగా దొరికిన‌ మైఖేల్ క్లార్క్ .. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలోనే ఖరీదైన విడాకులు

త‌ల్లి క‌నిపెట్టింది…

  • ఆసుపత్రికి చేరుకున్నత‌ర్వాత పాప శ‌రీరంపై గాయాలు గుర్తు ప‌ట్టిన‌ తల్లి
  • ముఖంపై స్పష్టమైన గాయాలు, కమిలిన గుర్తులు చూసి అనుమానం వ్యక్తం చేసిన త‌ల్లి
  • వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు మలుపు తిరిగింది.
  • పోలీసులు కృష్ణను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు.

ఈ ఘటనపై పోలీసులు నమోదు చేసిన కీలక వివరాలు ఇలా ఉన్నాయి:

నిందితుడు: కృష్ణ జైస్వాల్ (ఉత్తరప్రదేశ్ సోన్‌భద్ర జిల్లా వాసి)

ఘటన స్థలం: ఫరీదాబాద్, ఝర్‌సైంత్లీ గ్రామం

బాధితురాలు: నాలుగున్నరేళ్ల చిన్నారి

కారణం: 50 వరకు అంకెలు రాయలేకపోయిందన్న కోపం

నిందితుడి వాదన: స్కూల్‌కు పంపకుండా ఇంట్లోనే చదివిస్తున్నానని, కోపంలో కొట్టానని అంగీకారం

తల్లి ఫిర్యాదు: శరీరంపై గాయాలు చూసి అనుమానం

చట్టపరమైన చర్య: కేసు నమోదు, అరెస్ట్, కోర్టులో హాజరు

నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, ఒకరోజు పోలీస్ రిమాండ్‌కు అప్పగించారు. చిన్నారి మృతికి సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించడంతో పాటు, పిల్లలపై తల్లిదండ్రుల బాధ్యతపై పెద్ద చర్చకు దారితీస్తోంది

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »