అసిస్టెంట్‌తో హోట‌ల్‌లో అడ్డంగా దొరికిన‌ మైఖేల్ క్లార్క్ .. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలోనే ఖరీదైన విడాకులు

ఈ అవమానం తర్వాత కైలీ ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ఎనిమిదేళ్ల వివాహ బంధం ఇలా ఒక్కసారిగా కూలిపోయింది. 

Michael Clarke divorce-settlement story

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్, దేశపు ప్రముఖ సూపర్ మోడల్ కైలీ బోల్డీ 2012లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. క్రీడా రంగం, గ్లామర్ ప్రపంచం కలిసిన ఈ జంటను అప్పట్లో ఆస్ట్రేలియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ‘పర్‌ఫెక్ట్ కపుల్’గా భావించేవారు. క్లార్క్ క్రికెట్ కెరీర్ పీక్‌లో ఉన్న రోజుల్లో వీరి దాంపత్య జీవితం కూడా సాఫీగా సాగింది. కానీ, కాలం మారడంతో పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి.

2015లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత క్లార్క్ జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. ఆటకు కేటాయించిన సమయం ఖాళీగా ఉండ‌డంతో కొత్త వ్యాపారాలు, మీడియా కార్యక్రమాలు, వ్యక్తిగత ప్రయాణాలు పెరిగాయి. ఈ దశలోనే ఆయన తన అసిస్టెంట్‌తో ఎక్కువగా గడపడం ప్రారంభించాడన్న వార్తలు బయటకు వచ్చాయి. తొలుత ఇవన్నీ కేవలం గాసిప్‌లుగా భావించినా, కాలక్రమేణా ఆ వార్తలకు బలం చేకూరింది.

హోటల్‌లో పట్టుబడ్డ వ్యవహారం

  • 2019లో ఆస్ట్రేలియా మీడియా ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రసారం చేసింది.
  • క్లార్క్ తన అసిస్టెంట్‌తో సంబంధం కొనసాగిస్తున్నాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి
  • మొదట్లో భార్య కైలీ ఈ వార్తలను నమ్మలేదు
  • అయితే ఒక హోటల్‌లో క్లార్క్, అతని అసిస్టెంట్ కలిసి ఉన్న సమయంలో కైలీ వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం
  • ఈ ఘటన కైలీని తీవ్రంగా కుదిపేసింది

ఈ అవమానం తర్వాత కైలీ ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ఎనిమిదేళ్ల వివాహ బంధం ఇలా ఒక్కసారిగా కూలిపోయింది.

Also, Read: న్యూజిలాండ్‌పై భారీ విజయం నడుమ టీమిండియాకు ఎదురుదెబ్బ.. గాయంతో మ‌రో ప్లేయ‌ర్ ఔట్?

ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలోనే ఖరీదైన విడాకులు :

  • 2020లో అధికారికంగా వీరికి విడాకులు మంజూరయ్యాయి. అయితే ఈ విడాకుల సెటిల్‌మెంట్ సంచలనంగా మారింది.
  • కైలీకి భరణం కింద సుమారు 40 మిలియన్ అమెరికన్ డాలర్లు డిమాండ్ చేసింద‌ట‌
  • భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.300 కోట్లు
  • క్లార్క్ జీవితంలో సంపాదించిన ఆస్తిలో భారీ భాగం ఈ సెటిల్‌మెంట్‌కే వెళ్లింది

ప్రస్తుతం వీరి కుమార్తె తల్లి కైలీ సంరక్షణలోనే ఉంది. అయినప్పటికీ, కూతురు విషయంలో క్లార్క్–కైలీ మధ్య సంబంధం పూర్తిగా చెడిపోలేదని, అవసరమైనప్పుడు ఇద్దరూ కలుస్తూ స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.

మైఖేల్ క్లార్క్ క్రికెట్ ప్రస్థానం

  • వ్యక్తిగత జీవితంలో వివాదాలు ఉన్నప్పటికీ, క్రికెటర్‌గా మైఖేల్ క్లార్క్ స్థానం అనిర్వచనీయం.
  • ఆస్ట్రేలియా తరఫున 115 టెస్టులు – 8,643 పరుగులు
  • 28 టెస్ట్ సెంచరీలు
  • టెస్టుల్లో అత్యధిక స్కోరు 329 నాటౌట్
  • 245 వన్డేలు – 7,981 పరుగులు
  • 2015 వన్డే వరల్డ్ కప్ విజయంలో కెప్టెన్‌గా కీలక పాత్ర

మైదానంలో గౌరవం, ఘనత సాధించిన మైఖేల్ క్లార్క్ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒక తప్పు కారణంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన మరోసారి సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం ఎంత సున్నితమైందో, ఒక నిర్ణయం ఎలా జీవితాన్నే మార్చేస్తుందో చెప్పే ఉదాహరణగా నిలిచింది.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »