హైవే ప్రయాణికులకు శుభవార్త! Rajmargyatra Appలో NHAI వార్షిక టోల్ పాస్

NHAI Rajmargyatra Annual Toll Pass: NHAI రూపొందించిన Rajmargyatra యాప్ ద్వారా రోడ్డు సమస్యలను రిపోర్ట్ చేయడమే కాకుండా, కేవలం ₹3,000 వార్షిక ఫీజుతో దేశవ్యాప్తంగా నేషనల్ హైవే టోల్ గేట్లలో సులభంగా ప్రయాణించవచ్చు. యాక్టివ్ ఫాస్ట్‌ట్యాగ్ ఉంటే రెండు నిమిషాల్లోనే పాస్ యాక్టివేట్ చేసుకోవచ్చు.

NHAI Rajmargyatra App Annual Toll Pass Information
NHAI Rajmargyatra App Annual Toll Pass Information

NHAI Rajmargyatra Annual Toll Pass

  • NHAI యొక్క Rajmargyatra మొబైల్ యాప్ ద్వారా రోడ్డు పరిస్థితులు, ఫిర్యాదులను జియో-ట్యాగ్ ఫోటోలతో సులభంగా రిపోర్ట్ చేయవచ్చు.

  • కేవలం ₹3,000/- వార్షిక ఫీజుతో దేశవ్యాప్తంగా నేషనల్ హైవే టోల్ గేట్లలో ప్రయాణం మరింత సులభం.

  • ఇప్పటికే యాక్టివ్ ఫాస్ట్‌ట్యాగ్ ఉంటే 2 నిమిషాల్లోనే వార్షిక పాస్ యాక్టివేట్ చేసుకోవచ్చు.

NHAI ద్వారా Rajmargyatra మొబైల్ యాప్‌లో NHలలోని రోడ్డు పరిస్థితులను జియో-ట్యాగ్ చేయబడిన ఫోటోలను ఉపయోగించి నివేదించడానికి మరియు ఫిర్యాదులను నమోదు చేయడానికి ఒక ఫీచర్ ఉంది, ఇది ప్రయాణాన్ని మరింత సజావుగా మరియు సురక్షితంగా చేస్తుంది.

మీ కార్లకు సంవత్సర కాలానికి టోల్ ఫ్లాజా ఫీజు Rs 3,000/- చెల్లించడం చాలా ఈజీ….

1. మీ ఫోన్ లో play store or app store నుండి #rajmargyatra app డౌన్లోడ్ చేసుకోండి.
2. App ఓపెన్ చేయగానే annual pass అనే ఆప్షన్ కనిపిస్తుంది.
3. అది క్లిక్ చేయగానే ఫోన్ నెంబర్ అడుగుతుంది. మీ పాత ఫాస్టాగ్ లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్ ఇవ్వండి.
4. వెంటనే మీ car వివరాలు అక్కడ కనిపిస్తాయి. అవి ok చేస్తే మూడు వేల రూపాయలు కట్టుకోవచ్చని ఆప్షన్ వస్తుంది.
5. మీరు ఫోన్ పె, గూగుల్ పె లేదా Paytm ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు.

మీ పాత fastag active గా ఉంటే రెండు నిముషాలలో రీఛార్జ్ చేసుకోవచ్చు.

ఈ పాస్ ఉంటే దేశ వ్యాప్తంగా నేషనల్ హైవేస్ లో ఉన్న అన్ని టోల్ గేట్ లలో కేవలం 15 రూపాయలు కట్ అవుతుంది.

Also Read: ప్రభావిత వినియోగదారులకు రీఫండ్, టోల్ వ్యవస్థలో కీలక మార్పులు

తరచుగా అడిగే ప్రశ్నలు

Q1: Rajmargyatra యాప్ ద్వారా వార్షిక టోల్ పాస్ ఎలా తీసుకోవాలి?

A: Play Store లేదా App Store నుంచి Rajmargyatra యాప్ డౌన్‌లోడ్ చేసి, Annual Pass ఆప్షన్‌లో మీ ఫాస్ట్‌ట్యాగ్ లింక్ ఫోన్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి.

Q2: ఈ వార్షిక పాస్ అన్ని టోల్ గేట్లలో పనిచేస్తుందా?

A: అవును. దేశవ్యాప్తంగా నేషనల్ హైవేస్‌లో ఉన్న అన్ని టోల్ గేట్లలో ఈ పాస్ వర్తిస్తుంది.

Q3: పాత ఫాస్ట్‌ట్యాగ్ ఉండాలా లేదా కొత్తది తీసుకోవాలా?

A: మీ పాత ఫాస్ట్‌ట్యాగ్ యాక్టివ్‌గా ఉంటే కొత్తది అవసరం లేదు. అదే ఫాస్ట్‌ట్యాగ్‌కు పాస్ యాక్టివేట్ అవుతుంది.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »