పరీక్షల ఒత్తిడితో గోవాకి వెళ్లిన విద్యార్ధి. అక్క UPSC ఫీజు డబ్బులతో పరారీ!

పరీక్షల తేదీలు దగ్గరపడటంతో ఆ విద్యార్థి తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. కుటుంబం, ఉపాధ్యాయులు, సమాజం నుంచి వస్తున్న చదువు ఒత్తిడిని తట్టుకోలేక “ఇవన్నీ వదిలేసి కొంతకాలం ప్రశాంతంగా ఉండాలి” అనే నిర్ణయానికి వచ్చాడు.

Vadodara Student Runs Away Goa
  • పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేక 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థి ఇంటి నుంచి పారిపోయి గోవాకు చేరుకోవడం సంచలనంగా మారింది.

  • అక్క UPSC కోచింగ్ ఫీజుల కోసం దాచుకున్న రూ.3 లక్షల నగదుతో బాలుడు విలాసవంతమైన జీవితం గడపడం కుటుంబాన్ని షాక్‌కు గురి చేసింది.

  • ఈ ఘటన పిల్లలపై చదువుల పేరుతో అధిక ఒత్తిడి ఎంత ప్రమాదకరమో మరోసారి స్పష్టంగా చూపిస్తూ, తల్లిదండ్రులు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని హెచ్చరిస్తోంది.

చదువుల ఒత్తిడి పిల్లల మనసులపై ఎంత తీవ్రమైన ప్రభావం చూపుతోందో తెలిపే ఘటన గుజరాత్‌లోని వడోదరలో చోటుచేసుకుంది. పరీక్షల భయం తట్టుకోలేక 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థి ఇంట్లోంచి పరారై, నేరుగా గోవాకు చేరుకున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… అతడు తీసుకెళ్లిన డబ్బు తన అక్క UPSC కోచింగ్ కోసం కష్టపడి దాచుకున్న రూ.3 లక్షల నగదు అని తెలిసి అంద‌రు నోరెళ్ల‌పెడుతున్నారు.

పరీక్షల తేదీలు దగ్గరపడటంతో ఆ విద్యార్థి తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. కుటుంబం, ఉపాధ్యాయులు, సమాజం నుంచి వస్తున్న చదువు ఒత్తిడిని తట్టుకోలేక “ఇవన్నీ వదిలేసి కొంతకాలం ప్రశాంతంగా ఉండాలి” అనే నిర్ణయానికి వచ్చాడు. అదే సమయంలో ఇంట్లో అందరూ నిద్రపోతున్న వేళ నగదు తీసుకుని నిశ్శబ్దంగా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు.రైల్వే స్టేషన్‌కు చేరుకున్న బాలుడు ముంబై మీదుగా గోవాకు ప్రయాణమయ్యాడు. అక్కడ ఒక బీచ్ రిసార్ట్‌లో గదిని తీసుకుని విలాసవంతంగా గడుపుతున్నాడు. ఈలోగా కొడుకు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురై వడోదర పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read:క్యాస్టింగ్ కౌచ్ వ్యాఖ్యలపై చిరు హాట్ కామెంట్స్.. నువ్వు స్ట్రిక్ట్‌గా ఉంటే ఎవ‌రు అడ్వాంటేజ్ తీసుకోరు..!

మొబైల్ సిగ్న‌ల్స్ ఆధారంగా..

బీచ్ రిసార్ట్‌లో విలాస‌వంతమైన జీవితం

మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తించిన పోలీసులు

“చదువుల ఒత్తిడి తట్టుకోలేకే పారిపోయా” అంటూ బాలుడి వెల్లడి

ప్రస్తుతం ప్రొఫెషనల్ కౌన్సెలింగ్ అందిస్తున్న పోలీసులు

పిల్లలపై అధిక చదువు ఒత్తిడి ప్రమాదకరం అన్న హెచ్చరిక

ఈ సందర్భంగా పిల్లలపై చదువుల పేరుతో అతిగా ఒత్తిడి తీసుకురావద్దని తల్లిదండ్రులకు పోలీసులు స్పష్టమైన సూచనలు చేశారు. అదృష్టవశాత్తూ అక్క UPSC ఫీజు కోసం దాచిన డబ్బులో కొంత మొత్తం మిగిలి ఉండటంతో ఆ కుటుంబం ఊపిరి పీల్చుకుంది.

ఈ ఘటన మరోసారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆలోచించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. చదువు అవసరమే కానీ… పిల్లల మానసిక ఆరోగ్యం మరింత ముఖ్యమన్న సత్యాన్ని ఈ సంఘటన స్పష్టంగా చెబుతోంది.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »