క్యాస్టింగ్ కౌచ్ వ్యాఖ్యలపై చిరు హాట్ కామెంట్స్.. నువ్వు స్ట్రిక్ట్‌గా ఉంటే ఎవ‌రు అడ్వాంటేజ్ తీసుకోరు..!

చిరంజీవి చేసిన క్యాస్టింగ్ కౌచ్ వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో వినిపిస్తున్న ఆరోపణలపై ఆయన తనదైన శైలిలో స్పందించారు.

Chiranjeevi’s casting couch remarks
  • సక్సెస్ మీట్‌లో చిరంజీవి చేసిన క్యాస్టింగ్ కౌచ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

  • “నువ్వు స్ట్రిక్ట్‌గా, ప్రొఫెషనల్‌గా ఉంటే ఎవ‌రు అడ్వాంటేజ్ తీసుకోరు” అంటూ ఇండస్ట్రీపై తన స్పష్టమైన అభిప్రాయాన్ని చిరంజీవి వెల్లడించారు.

  •  సినిమా విజయం, అభిమానుల ప్రేమే తన ఎనర్జీ అని చెప్పిన చిరంజీవి మాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి.

సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని నమోదు చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను చేరుకుని, లాభాల బాటలో దూసుకెళ్తోంది. ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో చిరంజీవి చేసిన ప్రసంగం అభిమానులను మాత్రమే కాకుండా, సినీ వర్గాలను కూడా ఆకట్టుకుంది. తన కెరీర్‌, కష్టం, అభిమానుల ప్రేమతో పాటు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైన అంశాలపై ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read:దిగుమ‌తి సుంకాలు 60 శాతం త‌గ్గింపు.. ఇక నుండి ఈ కార్ల‌పై రూ.40 ల‌క్ష‌ల వర‌కు ఆదా

కష్టమే తన ఎనర్జీ అని చెప్పిన చిరు

సక్సెస్ మీట్‌లో మాట్లాడుతూ, ఈ వయస్సులో కూడా ఎందుకు అంతగా కష్టపడుతున్నారని కొందరు అడిగే ప్రశ్నపై చిరంజీవి ఆసక్తికరంగా స్పందించారు.

కష్టపడటంలోనే నాకు నిజమైన ఆనందం ఉంది. అభిమానుల ప్రేమే నాకు అసలైన ఎనర్జీ

అని చెప్పిన చిరంజీవి మాటలకు హాల్ మొత్తం చప్పట్లతో మార్మోగింది.

క్యాస్టింగ్ కౌచ్‌పై చిరంజీవి వ్యాఖ్యలు :

ఈ సక్సెస్ మీట్‌లో చిరంజీవి చేసిన క్యాస్టింగ్ కౌచ్ వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో వినిపిస్తున్న ఆరోపణలపై ఆయన తనదైన శైలిలో స్పందించారు.

ఇండస్ట్రీలో ఆడైనా, మగైనా ముందుగా ఎంకరేజ్ చేయాల్సిందే

క్యాస్టింగ్ కౌచ్ వ్యవస్థాగతంగా లేదని తన అభిప్రాయం

వ్యక్తుల ప్రవర్తన, ఆలోచనలపైనే ఇలాంటి పరిణామాలు ఆధారపడి ఉంటాయి

“నువ్వు స్ట్రిక్ట్‌గా, ప్రొఫెషనల్‌గా ఉంటే ఎవడూ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించడు”

ఇండస్ట్రీని అద్దంతో పోల్చుతూ, “మనమేం ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది” అని వ్యాఖ్యానించారు

ఉదాహరణగా కుటుంబ సభ్యుల ప్రస్తావన :

తన మాటలకు ఉదాహరణగా చిరంజీవి తన కూతురు సుస్మిత కొణిదెలను ప్రస్తావించారు. ఆమె సినీ పరిశ్రమలోకి వచ్చాక పూర్తిగా ప్రొఫెషనల్‌గా, డిసిప్లిన్‌తో తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతోందని చెప్పారు.

అలాగే స్వప్న దత్ లాంటి వారు కూడా తమ కష్టం, ప్రతిభతో పరిశ్రమలో నిలదొక్కుకుంటున్నారని పేర్కొన్నారు. ఇండస్ట్రీలోకి రావాలనుకునే యువత కృతనిశ్చయంతో, హార్డ్‌వర్క్‌పై నమ్మకం పెట్టుకోవాలని సూచించారు.

సినిమా విజయం గురించి చిరు కామెంట్స్ :

సినిమా విజయంపై మాట్లాడిన చిరంజీవి తనదైన హ్యూమర్‌తో అభిమానులను నవ్వించారు.

“అన్నం, అమ్మ, సినిమా సక్సెస్ ఎప్పుడూ బోర్ కొట్టదు”

ఈ సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలు సక్సెస్ కావడం ఆనందంగా ఉందని తెలిపారు

చాలాకాలం తర్వాత వింటేజ్ చిరంజీవిని, వింటేజ్ ఎలిమెంట్స్‌ను ప్రేక్షకులు ఆస్వాదించారని చెప్పారు

కేవలం 85 రోజుల్లోనే సినిమాను అనుకున్న బడ్జెట్‌లో పూర్తి చేయగలిగామని వెల్లడించారు

సోషల్ మీడియాలో హాట్ టాపిక్

చిరంజీవి క్యాస్టింగ్ కౌచ్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.

కొందరు ఆయన మాటలను పూర్తిగా సమర్థిస్తుండగా

మరికొందరు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు

ఏది ఏమైనా, మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా సినిమా వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపాయని చెప్పడంలో సందేహం లేదు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »