జంతర్ మంతర్‌కి యువత కదలిక.. యుట్యూబర్ ద్రువ్ రాఠీ అరెస్ట్

CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో జంతర్ మంతర్‌లో నిరసనలకు పిలుపునివ్వడంతో ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. యువత తరలివస్తున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించినట్లు కథనం పేర్కొంది.

యుట్యూబర్ ద్రువ్ రాఠీ అరెస్ట్
యుట్యూబర్ ద్రువ్ రాఠీ అరెస్ట్

NEET పై కదం తొక్కి సక్సెస్ అయిన కాక్రోచ్‌లు ఇప్పుడు మరో ఉద్యమాన్ని చేపట్టారు. సీసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు.

ఇదే డిమాండ్‌తో దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఆందోళనకు పిలుపునిచ్చారు. జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన నిరసనల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సూచించారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీగా యువత ఢిల్లీకి తరలి వస్తున్నారు.

అయితే వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. మరోవైపు ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీని పోలీసులు అరెస్ట్ చేశారు. సీజేపీ నిరసనలో పాల్గొనడానికి వచ్చిన ధ్రువ్ రాఠీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

CJP ఆందోళనతో ఢిల్లీలో ప్రస్తుతం హై అలర్ట్ ప్రకటించారు. పోలీసులు దేశ రాజధానిని అష్టదిగ్బంధనం చేశారు. జంతర్ మంతర్ సహా పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు.

మెట్రో స్టేషన్లను మూసేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న పలు రైళ్లను రద్దు చేశారు. అలాగే CJP ఆందోళనలో పాల్గొనవద్దని ప్రజలకు హెచ్చరికలు కూడా జారీ చేశారు.

ఇక ఢిల్లీ నిరసనలపై CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తమ ఆందోళన ప్రారంభం కాకముందే ప్రధాని మోడీ ఓటమిని అంగీకరించారని వ్యాఖ్యానించారు.

నిరసనకారులను అడ్డుకోవడానికి రవాణా సేవలపై ఆంక్షలు విధించడం, ఇంటర్నెట్‌ను నిలిపివేయడం, రహదారులను దిగ్బంధించడాన్ని విమర్శించారు. ప్రజలు, యువతకు ప్రధాని ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.

జమ్మూ కాశ్మీర్‌తో పాటు నక్సల్ ప్రభావిత ప్రాంతాల నుంచి భద్రతా బలగాలను ఢిల్లీకి తరలించారని ఆరోపించారు. సొంత ప్రజలపైనే పోలీస్, సైనిక బలగాలను ప్రయోగిస్తారా అంటూ మోడీ, అమిత్ షాను నిలదీశారు అభిజీత్ దీప్కే.

నిరసనలో పాల్గొనవద్దంటూ పోలీసులు ప్రజల ఇళ్లకు వెళ్లి హెచ్చరిస్తున్నారని ఆరోపించారు.

జంతర్ మంతర్ చుట్టూ భారీగా భద్రతా బలగాలు

ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో CJP నిరసనకు పిలుపు ఇవ్వడంతో భారీగా భద్రతా బలగాలు మోహరిస్తున్నాయి. దానిలో భాగంగానే రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఇక్కడ నాకాబందీ నిర్వహిస్తోంది.

జంతర్ మంతర్, ఇటు ఆంధ్ర భవన్, ఇండియా గేట్ వైపు, అటు హైదరాబాద్ హౌస్ వైపు ఢిల్లీ పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ భారీగా కవాతులు నిర్వహిస్తున్నారు. ఇటువంటి వాహనాలను ఇటువైపు రాకుండా మొత్తం అప్రమత్తంగా ఉన్నారు. ఎమర్జెన్సీ కొనసాగుతోంది.

రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌కు సంబంధించిన మహిళా సిబ్బంది కూడా ఇక్కడ పాల్గొన్నారు. మరోవైపు టియర్ గ్యాస్ ప్రయోగించేందుకు, నిరసనకారులపై బాష్పవాయువులు ప్రయోగించేందుకు బాష్పవాయుగోళాలకు సంబంధించిన గన్స్ కూడా తీసుకుని వెళ్తున్నారు.

మరోవైపు వారు టియర్ గ్యాస్ ప్రయోగించే సందర్భంలో వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మాస్క్‌లు, సేఫ్టీ పర్పస్ మాస్క్‌లు కూడా సిబ్బంది ఏర్పాటు చేసుకున్నారు.

మొత్తంగా చూసుకుంటే, ఈరోజు జరగబోయే నిరసనకు దేశవ్యాప్తంగా ఉన్న మద్దతుదారులు అందరూ నలభై నుంచి యాభై వేల మంది వరకు చేరుకునే అవకాశం ఉందనేది కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల వద్ద సమాచారం. అదే స్థాయిలో ఇక్కడ భద్రతా బలగాలు కూడా దాదాపు 25 వేల మందికి పైగా వివిధ బలగాలు, ఇటు రాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఐటీబీపీ, సీఎస్ఆర్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు భారీగా మోహరిస్తున్నారు.

ఆంధ్ర భవన్ రోడ్డు నుంచి ఆంధ్ర భవన్ తర్వాత హైదరాబాద్, ఇండియా గేట్ సర్కిల్ వరకు కూడా వీరు కవాతు నిర్వహిస్తున్నారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే అటువంటి వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.

మొత్తంగా రోడ్ల ఇరువైపులా భారీగా రాపిడ్ యాక్షన్ ఫోర్స్ వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

మొత్తం హెల్మెట్లు ధరించారు. ఎందుకంటే దాడి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్లకు సేఫ్టీ పర్పస్ హెల్మెట్లు, సేఫ్ గార్డ్స్ ఏర్పాటు చేసుకున్నారు. మరోవైపు ఫైబర్ స్టిక్స్‌ను హెల్మెట్ తరహాలో ఫైబర్ సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసుకున్నారు.

కాళ్లకు కూడా రాళ్ల దాడి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్లు కూడా కళ్లకు గాగుల్స్ కట్టుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

నిరసన సందర్భంలో గతంలో జరిగిన పరిణామాల దృష్టిలో ఉంచుకుని, CJP గతంలో నిర్వహించిన నెల రోజుల నిరసన దీక్షల నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ భారీగా మోహరించి ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా సెక్యూరిటీని టైట్ చేశారు.

జంతర్ మంతర్ వరకు ఎవరినీ రాకుండా అడ్డుకోవడమే ప్రధానంగా భద్రతా బలగాల ఉద్దేశంగా కనిపిస్తుంది. దానిలో భాగంగానే సిటీ అవుట్‌స్కట్స్‌లోనే వారందరినీ నిలిపివేసి, ఎక్కడికక్కడ పటిష్టమైన చర్యలు తీసుకుంటూ తనిఖీలు చేస్తున్నారు.

ఐడీ కార్డ్స్ చూపిస్తేనే వారిని విడిచిపెడుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఇక్కడి నుంచి ఇండియా గేట్ వరకు ఈ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు వెళ్తోంది.

ఢిల్లీ మొత్తం భద్రతా బలగాల కనుసన్నల్లో

ఢిల్లీ మొత్తం ఇప్పుడు భద్రతా బలగాల కనుసన్నల్లో ఉంది. ఎక్కడికక్కడ కెమెరాలను అమర్చారు. అలాగే భద్రతా బలగాలకు కూడా కొంచెం నిగ్రహం పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఆందోళనకారులు రెచ్చగొట్టినా నిగ్రహాన్ని పాటించాలని ఆదేశాలు జారీ చేశారు.


అదే సమయంలో ఆందోళనలను, పోలీసుల రియాక్షన్‌ను రియల్ టైమ్‌లో రికార్డ్ చేయడానికి ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు, ఫోటోగ్రాఫర్లను కూడా ఏర్పాటు చేశారు.

మొత్తం ఢిల్లీ అంతా ఇప్పుడు పోలీస్ బలగాల ఆధీనంలో ఉంది. సీజేపీ కార్యకర్తలు జంతర్ మంతర్ దగ్గరకు చేరుకోకుండా ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. రవాణా సౌకర్యంపై కూడా ఆంక్షలు విధించారు.

ఢిల్లీ మొత్తం అష్టదిగ్బంధంలో ఉంది. ఎక్కడికక్కడ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ రెడీగా ఉన్నారు. సీజేపీ ఎటువంటి ఆందోళనకు పిలుపునిచ్చినా, వారిని కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉండి యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారు.

ఇప్పటికే యూట్యూబర్ ధ్రువ్ రాఠీని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. సిగ్నల్స్ బ్రేక్ చేయడానికి జామ్ చేయాలని చూస్తున్నారు.

About Author:

Gujja Raju

గత 3 సంవత్సరాలుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్ట్ Gujja Raju. ప్రముఖ తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ Times Telugu మరియు లోకల్ న్యూస్ మీడియా సంస్థల్లో పనిచేసి వార్తా రచనలో అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం ప్రముఖ…

More About Author »