వాంఖెడేలో సన్‌రైజర్స్ తుఫాన్ బ్యాటింగ్.. కంటతడి పెట్టిన నీతా అంబానీ

244 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో ముంబై ఇండియన్స్‌కి చుక్క‌లు చూపించారు. ఈ దూకుడు చూసి జట్టు యజమాని నీతా అంబానీ భావోద్వేగానికి లోనయ్యారు.

ముంబై ఇండియన్స్‌పై విజయం-నీతా అంబానీ ఆవేదన!
Nita Ambani Emotional

ఐపీఎల్‌లో మరోసారి రికార్డుల వర్షం కురిసింది. ముంబై ఇండియన్స్ , సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్‌లో బ్యాటర్ల విధ్వంసం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా వాంఖెడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓపెనర్లు చూపిన‌ దూకుడు మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేసింది.

మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. భారీ స్కోర్ సాధించినప్పటికీ, ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది.

బౌండ‌రీల వ‌ర్షం..

ఓపెనర్లు ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డారు. పవర్‌ప్లేలోనే వికెట్ నష్టపోకుండా 92 పరుగులు జోడించి మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించారు. బౌండరీలు, సిక్సర్ల వర్షంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ కేవలం 20 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసి తన దూకుడు చూపించాడు.

ఈ జోడీ కేవలం 8 ఓవర్లలోనే 126 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఐపీఎల్ చరిత్రలో మరో రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో డేవిడ్ వార్నర్ – శిఖర్ ధావన్ పేరిట ఉన్న ఓపెనింగ్ రికార్డును సమం చేశారు.

బుమ్రాని ఆడుకున్నారు..

ముంబై ప్రధాన బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లోనూ హెడ్, అభిషేక్ భారీ షాట్లు ఆడటం గమనార్హం. కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా పరిస్థితిని అదుపులోకి తేవడంలో విఫలమయ్యారు. ఫీల్డర్లు సులభమైన క్యాచ్‌లను జారవిడిచేయడంతో మ్యాచ్ పూర్తిగా సన్‌రైజర్స్ వైపు మొగ్గు చూపింది.

ఈ విధ్వంసకర బ్యాటింగ్‌ను స్టాండ్స్‌లో కూర్చుని వీక్షిస్తున్న నీతా అంబానీ భావోద్వేగానికి లోనయ్యారు. తన జట్టు బౌలర్లు చేతులెత్తేయడం, ప్రత్యర్థి జట్టు దూకుడు చూడలేక కంటతడి పెట్టిన ఆమె దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మొత్తానికి, ఈ మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలో మరొక హై స్కోరింగ్ థ్రిల్లర్‌గా నిలవగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ల బ్యాటింగ్ ప్రదర్శనకు అభిమానులు మంత్ర ముగ్ధులయ్యారు. ఈ గెలుపుతో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఫ్లే ఆఫ్స్‌కి మ‌రింత ద‌గ్గ‌రైంది.
Also read:

About Author:

Ch Roja Rani

గత 5 సంవత్సరాలుగా తెలుగు మీడియా రంగంలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న జర్నలిస్ట్‌. డిజిటల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అయిన Idreampost మరియు Wire Teluguలో పని చేసి విశేష అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం Mana Varta లో క్రీడలు (Sports…

More About Author »