కవిత TRS పేరుపై BRS వ్యంగ్యం – నకిలీ బ్రాండ్ అని దెప్పిపొడుపు

BRS Mocks Kavitha New Party Name Compares to Fake Brands Like Coolgate and Brislie
BRS mocks Kavitha Telangana Rashtra Sena fake brand
  • BRS పార్టీ న్యూస్ హ్యాండిల్ కవిత కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన పై వ్యంగ్యాస్త్రం
  • నకిలీ బ్రాండ్లతో పోల్చి కవిత పార్టీ పేరును విమర్శించిన BRS. YSRCP కి YSRTP, TRS కి TRS సేన అంటూ “నాప్తాల్ పార్టీలు” అని వ్యంగ్యోక్తి
  • సోషల్ మీడియా వేదికగా మేడ్చల్ సభ నేపథ్యంలో BRS స్పందన

కవిత కొత్త పార్టీ ‘తెలంగాణ రాష్ట్ర సేన’ పేరు ప్రకటించగానే BRS పార్టీ సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కోల్‌గేట్ టూత్‌పేస్ట్ పేరును నకిలీ చేసి “కూల్‌గేట్” తయారు చేసినట్లు, బిస్లేరీ వాటర్ బాటిల్ పేరును కాపీ చేసి “బ్రిస్లీ” తయారు చేసినట్లు, తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పేరును పోలిన ‘తెలంగాణ రాష్ట్ర సేన’ పేరు పెట్టారని నేరుగా విమర్శించింది.

“ఒరిజినల్ బ్రాండ్లకు ఉన్న పాపులారిటీని క్యాష్ చేసుకోవాలని, తొందరగా డబ్బు సంపాదించాలని కొంతమంది ఫేక్ బ్రాండ్లు తయారుచేసి అమ్మడానికి ప్రయత్నిస్తుంటారు. ప్రజలు ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్ తెలుసుకోలేనంత అమాయకులు కాదు” అని BRS సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

నాప్తాల్ పార్టీలు అని దెప్పిపొడుపు

BRS మరింత వ్యంగ్యంగా YSRCP కి YSRTP, తెలంగాణ రాష్ట్ర సమితికి తెలంగాణ రాష్ట్ర సేన అని వరుసపెట్టి పోల్చింది. వీటిని “నాప్తాల్ పార్టీలు” అని పేర్కొంది. నాప్తాల్ అంటే టెలివిజన్ షాపింగ్ ఛానెల్ ద్వారా నకిలీ, తక్కువ నాణ్యత ఉత్పత్తులు అమ్మే వ్యాపారం అనే అర్థంలో వ్యంగ్యంగా వాడారు. ఈ పోలిక రాజకీయంగా చాలా పదునైన విమర్శగా మారింది.

రెండు ఫోటోలు అదే సందేశం

BRS పోస్ట్‌లో రెండు ఫోటోలు చేర్చడం గమనార్హం. మొదటి ఫోటోలో కోల్‌గేట్ కు కూల్‌గేట్, బిస్లేరీకి బ్రిస్లీ నకిలీ బ్రాండ్లు కనిపిస్తున్నాయి. రెండో ఫోటోలో స్టేజ్ పై పసుపు చీర ధరించిన కవిత మరియు అదే రంగు చీరలో ఉన్న మరో మహిళ కనిపిస్తున్నారు. ఒరిజినల్ మరియు నకిలీ అనే సందేశాన్ని రెండు ఫోటోల ద్వారా నేరుగా చెప్పకుండా చెప్పే ప్రయత్నం చేసింది BRS.
Also Read : కేసీఆర్‌కు సీతక్క లీగల్ నోటీసులు: అంగన్‌వాడీ ఫోన్ల స్కామ్ వివాదం!

రాజకీయ నేపథ్యం

కవిత BRS నుండి సస్పెన్షన్‌కు గురై పార్టీ వదిలిన నేపథ్యంలో ఆమె పార్టీ పేరు BRS పాత గుర్తింపైన TRS ను పోలి ఉండటం రాజకీయంగా అత్యంత సున్నితమైన అంశంగా మారింది. ఆమె పార్టీ పేరు ఉద్దేశపూర్వకంగా TRS పేరు జ్ఞాపకాలను రేకెత్తించేలా ఎంచుకున్నారా అనే చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. BRS స్పందన ఈ చర్చకు మరింత ఆజ్యం పోసింది.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »