Telangana Municipal Elections Liquor Ban
-
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఫిబ్రవరి 11 సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలపై పూర్తిస్థాయి నిషేధం.
-
ఫలితాల రోజు అయిన ఫిబ్రవరి 13న కూడా వైన్స్, బార్లు పూర్తిగా మూసివేత.
ఇవి కూడా చదవండి -
నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సు రద్దుతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని అధికారుల హెచ్చరిక.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కారణంగా మందుబాబులకి ఎలక్షన్ అధికారులు బ్యాడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల అధికారులు, ఎక్సైజ్ శాఖ కలిసి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా నిర్వహించేందుకు ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో మద్యం దుకాణాలను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించారు.ప్రచారం గడువు ముగియనున్న నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ రోజు అయిన ఫిబ్రవరి 11 సాయంత్రం 5 గంటల వరకు వైన్స్, బార్లలో మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించారు.
Also Read: ఏప్రిల్ 1 నుంచి టోల్ ప్లాజాల్లో క్యాష్ బంద్… ఫాస్టాగ్, యూపీఐ తప్పనిసరి!
అధికారుల హెచ్చరికలు..
అదేవిధంగా ఫలితాల రోజు అయిన ఫిబ్రవరి 13న కూడా మద్యం దుకాణాలు బంద్ ఉండాలని స్పష్టం చేశారు. ఈ నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే లైసెన్సులను కూడా రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఓటర్లను ప్రభావితం చేయకుండా ఉండటం, ఎన్నికల సమయంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలిపారు.
అధికారుల సమాచారం ప్రకారం ఈ బంద్ రాష్ట్రవ్యాప్తంగా కాకుండా ఎన్నికలు జరిగే పట్టణ స్థానిక సంస్థలకే పరిమితం అవుతుంది.
ఎన్నికలకు సంబంధించిన ముఖ్య వివరాలు :
మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఎన్నికల బరిలో ఉన్నాయి.
మహబూబ్‌నగర్, మంచిర్యాల, కొత్తగూడెం, నల్గొండ, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్ వంటి ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి.
మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి.
2,996 వార్డులకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
పోలింగ్ ఫిబ్రవరి 11 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది.
అధికారిక సమాచారం ప్రచారం ఫిబ్రవరి 9 సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది.
ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి 13న జరగనుంది.
ఈ చర్యలు తప్పక అవసరం :
ఈ ఎన్నికల్లో సుమారు 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల సమయాల్లో మద్యం అమ్మకాల నియంత్రణ సాధారణ ప్రక్రియేనని, ప్రజాస్వామ్య పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఈ చర్యలు అవసరమని అధికారులు పేర్కొన్నారు.


