- అనంతగిరి కొండల్లో ప్రారంభమైన ‘ది బ్రీజ్’ ఎకో రిసార్ట్
- లగ్జరీ టెంటెడ్ స్టేలు, నేచర్ అనుభూతి ప్రత్యేక ఆకర్షణ
- తెలంగాణ ఎకో టూరిజానికి కొత్త ఊపిరి
వికారాబాద్ అనంతగిరి కొండల్లో తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ‘ది బ్రీజ్’ ఎకో రిసార్ట్‌ను ప్రారంభించింది. డెక్కన్ వుడ్స్ & ట్రైల్స్ కింద బాధ్యతాయుత పర్యాటకానికి ఇది కొత్త మైలురాయిగా నిలవనుంది.
మహిళలూ.. మీ బ్యాగులో ఈ వస్తువులు పెడుతున్నారా? అయితే దరిద్రం వెంటే ఉన్నట్టే!
ది బ్రీజ్ ఎకో రిసార్ట్ ప్రారంభించిన టీఎఫ్‌డీసీ
- అనంతగిరి హిల్స్, వికారాబాద్లో లగ్జరీ టెంటెడ్ స్టేలు
సేఫ్ & రెగ్యులేటెడ్ ఎకో టూరిజంకు ప్రోత్సాహం
తెలంగాణలో ప్రకృతి ఆధారిత పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించే దిశగా తెలంగాణ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కీలక ముందడుగు వేసింది. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండలులో ‘ది బ్రీజ్’ పేరుతో కొత్త ఎకో రిసార్ట్‌ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టును డెక్కన్ వుడ్స్ & ట్రైల్స్ కాన్సెప్ట్ కింద అభివృద్ధి చేశారు.
ప్రకృతి మధ్య లగ్జరీ అనుభూతి
‘ది బ్రీజ్’ ఎకో రిసార్ట్‌లో లగ్జరీ టెంటెడ్ స్టేలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అడవుల నడుమ సహజ వాతావరణాన్ని ఆస్వాదిస్తూనే, సౌకర్యవంతమైన బసను అందించేలా ఈ టెంట్లను రూపొందించారు. ప్రయాణికులకు ప్రత్యేకంగా క్యూరేటెడ్ భోజనాలు, బుష్ బ్రేక్‌ఫాస్ట్ ఏర్పాటు చేయనున్నారు.
నేచురలిస్టులతో ప్రత్యేక అనుభవాలు
ఇక్కడికి వచ్చే పర్యాటకుల కోసం శిక్షణ పొందిన నేచురలిస్టుల నేతృత్వంలో గైడెడ్ బర్డింగ్ టూర్స్, ట్రెక్కింగ్, సఫారి వంటి కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయి. అలాగే సూర్యోదయం, సూర్యాస్తమయాన్ని వీక్షించే ప్రత్యేక వ్యూవ్ పాయింట్లు కూడా ఏర్పాటు చేశారు.
బాధ్యతాయుత ఎకో టూరిజమే లక్ష్యం
పర్యావరణానికి హాని కలగకుండా, భద్రతతో కూడిన నియంత్రిత పర్యాటకాన్ని ప్రోత్సహించడమే ఈ ఎకో రిసార్ట్ లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు. స్థానిక జీవ వైవిధ్యాన్ని పరిరక్షిస్తూ, పర్యాటకులకు ప్రకృతితో మమేకమయ్యే అనుభూతిని అందించేందుకు ‘ది బ్రీజ్’ రూపొందించబడింది.
అనంతగిరి కొండల అందాలను కొత్త కోణంలో చూపిస్తూ, తెలంగాణ ఎకో టూరిజానికి ‘ది బ్రీజ్’ కొత్త గుర్తింపుగా మారనుందని పర్యాటక వర్గాలు భావిస్తున్నాయి.
#Telangana Forest Development Corporation launches “The Breeze” at Ananthagiri Hills, #Vikarabad under Deccan Woods & Trails 🌿
The eco resort offers luxury tented stays with curated meals, bush breakfast, guided birding, trekking, safari and sunrise and sunset viewpoints led by… pic.twitter.com/E6beZtpMW2
— Anusha Puppala (@anusha_puppala) February 7, 2026