వైసీపీ ముమ్మాటికీ గొడ్డలి పార్టీనే.. సంజీవ‌ని ప్ర‌జావేదిక‌లో చంద్రబాబు వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సంజీవని ప్రజావేదిక సభలో వైసీపీ (YSRCP)పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “గొడ్డలి పార్టీ” అంటూ 11 కీలక ఘటనలను ప్రస్తావించిన ఆయన.. వివేకా హత్య కేసు (Viveka Murder Case), అమరావతి (Amaravati), పోలవరం (Polavaram) అంశాలపై విమర్శలు గుప్పించారు.

Chandrababu Naidu | ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ నేతృత్వంలోని వైసీపీ ముమ్మాటికీ గొడ్డలి పార్టీనే అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. సంజీవని ప్రజా వేదిక సభలో ఇటీవలి రాజకీయ పరిణామాలపై స్పందించారు. ఈ సంద‌ర్భంగా వైసీపీ అకృత్యాలను వివరించి, ఇదే గొడ్డలి పార్టీ నైజం అంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ సంద‌ర్భంగా 11 విష‌యాల‌ను వెల్ల‌డించారు. 11 ఘటనలను వివరించి.. అందుకే వైసీపీ పార్టీ అంటూ విమర్శలు గుప్పించిన ఆయ‌న‌.. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీలకు చోటులేద‌ని, సమాజానికి గొడ్డలి పార్టీ హానికర‌మ‌న్నారు. గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్ అంటూ ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

Read Also : ఏపీలో ‘తల్లికి వందనం’ పథకం అమలు – ప్రతి విద్యార్థికి రూ.15,000, కొత్త మార్గదర్శకాలు జారీ

చంద్ర‌బాబు చెప్పిన 11 పాయింట్లు..

  • వివేకా హత్య, నాటకాలు – అంతిమ లబ్దిదారు ఎవరో ప్రతి ఒక్కరికీ తెలుసు.
  • కోడికత్తి డ్రామా.. గులకరాయి డ్రామా… ప్రజలను మోసం చేసే ఎత్తుగడ.
  • దళిత డ్రైవర్ సుబ్రహ్మ‌ణ్యం హత్య, డోర్ డెలివరీ- నిందితుడికి వైసీపీ అండదండలు.
  • మాస్క్ అడిగిన దళిత డాక్టర్‌పై దాడి – వేధించి ప్రాణాలు తీసిన వైసీపీ ప్రభుత్వం.
  • కుటుంబ బంధాలపై గొడ్డలి వేటు – ఆస్తి ఇవ్వకుండా తల్లికి, చెల్లికి అన్యాయం.
  • హిందూ దేవుళ్లపై అకృత్యాలు, అపవిత్ర కార్యక్రమాలు, కుట్రలు.. తప్పుడు ప్రచారాలు.
  • పోలవరం, అమరావతి, పెట్టుబడులు, అభివృద్దిపై గొడ్డలి పార్టీ వేటు.
  • నందం సుబ్బయ్య, చంద్రయ్య, జల్లయ్యల పీకలు కోసేంత రక్త దాహంతో వైసీపీ.
  • గంజాయి బ్యాచ్ లకు ప్రోత్సాహం.. రప్పా రప్పా రంకెలు.. జంతు రక్తంతో కటౌట్లకు అభిషేకాలు.
  • కారు కింద సొంత కార్యకర్త సింగయ్యను తొక్కించారు.. కడపలో పెద్ద దస్తగిరిని చంపేశారు.
  • కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుకు రోజుకో నాటకం. పాస్టర్లతో దాడి డ్రామాలు.

Read Also : భ‌విష్య‌త్‌లో ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్రం హోం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు..!

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »