Today Rasi Phalalu:
మేష రాశి
మేష రాశి వారు తాము చేపట్టిన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తూ ఉంటారు. ఆర్థిక లాభాలకు అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబపరమైన సమిష్టి నిర్ణయాలు చక్కని శుభ ఫలితాలను కలుగజేస్తుంటాయి. అలాగే వివిధ రూపాల్లో అధికారులతో సమావేశమయ్యే ప్రయత్నాలు చేస్తుంటారు.
అనుకూలించే దైవం: శ్రీ గాయత్రి అమ్మవారు
పూజ: అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి.
వృషభ రాశి
వృషభ రాశి వారు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాల్లో మంచి సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. స్నేహితులతో ఆనందకరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబపరమైన విందు వినోదాలు ఉంటాయి.
అనుకూలించే దైవం: శ్రీ బ్రహ్మచారిణి అమ్మవారు
పూజ: గాయత్రి అమ్మవారి ధ్యాన శ్లోకాన్ని పారాయణం చేయండి.
మిథున రాశి
మిథున రాశి వారు తాము ఏర్పాటు చేసుకోబోయే సమావేశాల గురించి చర్చ చేస్తూ ఉంటారు. సభ్యుల ప్రతిస్పందన కోసం ఎదురుచూస్తూ ఉంటారు. నూతనంగా తెలుసుకున్న నైపుణ్యాలను ఉపయోగించే ప్రయత్నాలు చేస్తుంటారు. కుటుంబపరమైన ఖర్చులు ఉంటాయి. విద్యార్థులు ఏకాగ్రతను పెంచుకోవాలి.
అనుకూలించే దైవం: శ్రీ మహావిద్య అమ్మవారు
పూజ: గాయత్రి అమ్మవారి చాలీసా స్తోత్రాన్ని పారాయణం చేయండి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు ఈరోజు కుటుంబపరమైన పనులు పూర్తి చేసుకోవలసిన అవసరం ఏర్పడుతుంది. పెద్దల సూచనలు, సలహాలు పాటిస్తూ ఉంటారు. ఆర్థికపరమైన ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కుటుంబంలో ఏర్పాటు చేయబోయే శుభకార్యాల గురించి చర్చ చేస్తుంటారు.
అనుకూలించే దైవం: శ్రీ మహేశ్వరి అమ్మవారు
పూజ: గాయత్రి అమ్మవారి భుజంగ స్తోత్రాన్ని పారాయణం చేయండి.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈరోజు నాయకత్వ బాధ్యతలు దక్కుతాయి. అధికారుల అనుమతి కోసం వేచి చూస్తూ ఉంటారు. పెట్టుబడుల విషయాల్లో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలి. స్నేహితుల నుండి అవసరమైన సమాచారాన్ని పొందుతూ ఉంటారు.
అనుకూలించే దైవం: శ్రీ పరమేశ్వరి అమ్మవారు
పూజ: గాయత్రి అమ్మవారి హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయండి.
కన్య రాశి
కన్య రాశి వారికి ఈరోజు పని విధానాల్లో మార్పులు చేర్పులు అవసరమవుతాయి. వ్యాపారపరమైన అంశాల్లో పలు రకాల అవకాశాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మీకు ఉపయోగపడతాయి. వ్యక్తిగత లక్ష్యాలను చేరుకోగలుగుతారు.
అనుకూలించే దైవం: శ్రీ పద్మావతి అమ్మవారు
పూజ: గాయత్రి అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి.
తులా రాశి
తులా రాశి వారు భాగస్వామ్య అవగాహనను పెంచుకోవడం మంచిది. ఒప్పంద పత్రాల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. అలాగే వాహన సంబంధిత పనులు పూర్తి చేసుకుంటారు. సమయానుకూలంగా ఉద్యోగపరమైన పనులను పూర్తి చేస్తారు.
అనుకూలించే దైవం: యోగిని అమ్మవారు
పూజ: గాయత్రి అమ్మవారి లహరి స్తోత్రాన్ని పారాయణం చేయండి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు క్లిష్టమైన సమస్యలను అధిగమించే ప్రయత్నం చేస్తుంటారు. రుణ వ్యవహారాలను జాగ్రత్తగా పూర్తి చేయాలి. పోటీ సంబంధిత ఆధిక్యతలు ఆనందాన్ని ఇస్తాయి. ముఖ్యమైన కీలక కార్యక్రమాల్లో మీ ప్రమేయంతో పనులు పూర్తి అవుతాయి.
అనుకూలించే దైవం: శ్రీ అపర్ణ దేవి అమ్మవారు
పూజ: గాయత్రి అమ్మవారి అష్టకాన్ని పారాయణం చేయండి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఈరోజు విదేశీ సంబంధిత వార్తలు లేదా సమాచారం తెలుస్తుంది. ఉన్నతాధికారుల ప్రశంసలు ఆనందాన్ని కలుగజేస్తుంటాయి. పిల్లల చదువులు, ఉద్యోగ వ్యవహారాల్లో మంచి శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది.
అనుకూలించే దైవం: శ్రీ మాతంగి అమ్మవారు
పూజ: గాయత్రి అమ్మవారి కవచ స్తోత్రాన్ని పారాయణం చేయాలి.
మకర రాశి
మకర రాశి వారికి భూ సంబంధిత వ్యవహారాలు చర్చకు వస్తాయి. కార్యక్రమాల్లో, కార్యాలయాల్లో ఉన్న సమస్యలు కూడా కొంత తగ్గిపోతాయి. కుటుంబపరమైన ఖర్చులను నియంత్రించుకోవాలి. స్నేహ సంబంధిత కార్యక్రమాలు ఉంటాయి.
అనుకూలించే దైవం: శ్రీ మీనాక్షి అమ్మవారు
పూజ: గాయత్రి స్వరాజ స్తోత్రాన్ని పారాయణం చేయాలి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈరోజు నూతన ప్రాజెక్టులకు సంబంధించిన పనులు ప్రారంభించే అవకాశాలు ఉంటాయి. సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చిన్న ప్రయాణాల్లో ప్రయోజనాలు ఉంటాయి. అలాగే ఉద్యోగ వ్యవహారాల్లో సహోద్యోగుల సహకారం చాలా ఉపయోగపడుతుంది.
అనుకూలించే దైవం: శ్రీ బ్రాహ్మీ అమ్మవారు
పూజ: మాతంగి స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది.
మీన రాశి
మీన రాశి వారు ఆదాయ మార్గాలను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. కళారంగంలో అనుకూలత ఏర్పడుతుంది. శుభవార్తలు కూడా వింటారు. నూతన కొనుగోలు వ్యవహారాల్లో ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి.
అనుకూలించే దైవం: శ్రీలంకారి అమ్మవారు
పూజ: అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి.


