న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచాలని ప్రభుత్వం వేల కోట్లు సబ్సిడీలు ఇస్తోంది. కానీ, గ్రౌండ్ లెవల్‌లో పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఢిల్లీలో నితిన్ సిన్హా అనే వ్యక్తి సోషల్ మీడియాలో పంచుకున్న ఒక ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ₹20 లక్షల విలువైన ‘మహీంద్రా XEV 9e’ కారును కొనుగోలు చేసిన ఒక అద్దెదారుడు, సొసైటీలో ఛార్జర్ ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి లభించక కారును నిరుపయోగంగా వదిలేశారు.
ఢిల్లీలోని ఒక అపార్ట్‌మెంట్ సొసైటీలో నివసిస్తున్న వ్యక్తి మూడు నెలల క్రితం ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారు. అయితే, ఆయన అద్దెకు ఉంటున్నారనే కారణంతో ప్రైవేట్ ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటుకు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (RWA) నిరాకరించింది. అపార్ట్‌మెంట్లలో ఛార్జింగ్ వల్ల అగ్నిప్రమాదాలు జరుగుతాయనే భయం, అద్దెదారులకు శాశ్వత అనుమతులు ఇవ్వకూడదనే వింత పోకడలు దీనికి కారణం.
Also Read : ఢిల్లీ లిక్కర్ కేసు మళ్లీ హాట్ టాపిక్… కేజ్రీవాల్, కవితలకు హైకోర్టు నోటీసులు
ఖరీదైన కారు.. భారీ ఇబ్బందులు:
సొంత ఇల్లు ఉన్నవారు ఆర్.డబ్ల్యూ.ఏ (RWA) అధికారులతో పోరాడగలరు. కానీ అద్దెకు ఉండేవారు ఓనర్, ఆర్.డబ్ల్యూ.ఏ మరియు నిబంధనల మధ్య నలిగిపోతున్నారు.
ఈవీ (EV)ల ప్రధాన ప్రయోజనమే ఇంట్లో రాత్రిపూట ఛార్జింగ్ పెట్టుకోవడం. ఇది లేకపోతే పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.
2025లో దేశవ్యాప్తంగా 20 లక్షల ఈవీలు అమ్ముడైనప్పటికీ, అపార్ట్‌మెంట్లలో ఉండేవారిలో కేవలం 55% మందికే హోమ్ ఛార్జింగ్ సదుపాయం ఉంది.
Also Read : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక మలుపు .. కవితతో పాటు మరో ఇద్దరికి క్లీన్‌చిట్
ఈ సమస్యపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు:
ఢిల్లీలోని కొన్ని సొసైటీలు విజిటర్స్ పార్కింగ్‌లో కనీసం 10 పాయింట్లను కామన్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లుగా మార్చడం ద్వారా సమస్యను పరిష్కరించాయి.
కేంద్ర విద్యుత్ శాఖ మార్గదర్శకాల ప్రకారం.. నివాస ప్రాంతాల్లో ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటును ప్రోత్సహించాలి. కానీ చాలా చోట్ల RWAలు వీటిని పట్టించుకోవడం లేదు.
ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటును తప్పనిసరి చేయాలని సుప్రీంకోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలైంది.
Also Read : ఎయిడ్స్ ఉందనుకొని భయం.. AI సూచించిన మందులతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు..!


