టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులను తన అందం, నటనతో అలరించిన ప్రముఖ నటి హన్సిక మోత్వాని జీవితానికి సంబంధించిన వార్తలు ఇటీవల నెట్టింట పెద్ద చర్చకు దారితీశాయి. ఆమె తన భర్త సోహైల్ కతూరియాతో విడాకులు తీసుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు కొంతకాలంగా ఈ జంట దూరంగా ఉంటున్నారనే వార్తలు వస్తుండగా, ముంబైలోని బాంద్రా కోర్టు వీరి విడాకులను ఖరారు చేసిందని కొన్ని మీడియా వర్గాల్లో ప్రచారం జరిగింది. అయితే ఈ అంశంపై ఇప్పటివరకు హన్సిక లేదా సోహైల్ అధికారికంగా స్పందించలేదు.
హన్సిక చేసిన ఆసక్తికర పోస్ట్
ఈ నేపథ్యంలో హన్సిక తాజాగా తన సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన కోటేషన్‌ను షేర్ చేశారు. “చర్ది కాలా ఆల్వేస్” అనే పంజాబీ పదాన్ని ఆమె పోస్టు చేశారు. ఈ పదానికి అర్థం ఏమిటంటే – ఎలాంటి కష్టాలు ఎదురైనా ధైర్యంగా, పాజిటివ్‌గా ముందుకు సాగాలి అనే భావం. దీంతో ఆమె జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైందనే సంకేతం కావచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read: ఒకే గదిలో ఐదు తరగతులు… ప్రభుత్వ పాఠశాలల దుస్థితి బయటపడింది
ఘనంగా జరిగిన వివాహం
మరోవైపు హన్సిక మోత్వాని, వ్యాపారవేత్త సోహైల్ కతూరియా 2022 డిసెంబర్ 4న రాజస్థాన్‌లోని జైపూర్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్‌గా జరగగా, అప్పట్లో ఈ వేడుక సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. పెళ్లి తర్వాత కొంతకాలం వరకు ఈ జంట సంతోషంగా జీవిస్తున్నట్లు కనిపించింది. అయితే తర్వాత కొద్ది నెలలకే వీరిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయని సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది.
విడాకుల పుకార్లకు కారణాలు
గత కొంతకాలంగా హన్సిక తన భర్తకు దూరంగా ఉంటూ తల్లితో కలిసి నివసిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి భర్తతో కలిసి ఉన్న పెళ్లి ఫోటోలను తొలగించడం కూడా ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చింది. దీంతో వీరిద్దరి మధ్య సంబంధాలు సరిగా లేవని అభిమానులు భావిస్తున్నారు.
పెళ్లి సమయంలోనూ వివాదాలు
హన్సిక వివాహం జరిగిన సమయంలో కూడా కొన్ని వివాదాలు చర్చనీయాంశమయ్యాయి. సోహైల్ కతూరియాకు ఇది రెండో వివాహం కాగా, అతని మొదటి భార్య హన్సికకు క్లోజ్ ఫ్రెండ్ అన్న వార్తలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ విమర్శలపై స్పందించిన హన్సిక, సోహైల్ గతం తనకు తెలుసని, వారు విడిపోవడానికి తాను కారణం కాదని స్పష్టం చేశారు.
అసలు కారణం ఏంటి..
ప్రస్తుతం హన్సిక, సోహైల్ కతూరియా విడిపోవడానికి గల ఖచ్చితమైన కారణాలు మాత్రం బయటకు రాలేదు. వ్యక్తిగత విభేదాల కారణంగానే ఈ జంట విడాకులు తీసుకున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు హన్సిక చేసిన తాజా పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీస్తోంది.