తెలుగు సినిమా దేశ ముదురు చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన హన్సిక మోత్వాని దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా అల్లు అర్జున సరసన నటించిన నేపథ్యంలో ఆ చిత్రంతో ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. తర్వాత తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇదిలా ఉండగా ఆమె వ్యక్తిగత జీవితం గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది.
హన్సిక మోత్వానీ, వ్యాపారవేత్త సోహైల్ ఖతూరియాతో కొంతకాలం ప్రేమాయణం నడిపింది. ఆ తర్వాత 2022లో వివాహం చేసుకున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్ సమీపంలోని ముండోటా ఫోర్ట్ అండ్ ప్యాలెస్‌లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. సినీ, వ్యాపార వర్గాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు.
అయితే వివాహం జరిగిన కొంతకాలానికే వీరి మధ్య పలు విషయాలలో విభేదాలు తలెత్తినట్లు సమాచారం. 2022 జూలై 2 నుంచి ఇద్దరూ వేర్వేరుగా నివసిస్తున్నారని, ఇటీవల ముంబయిలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు వీరికి అధికారికంగా విడాకులు మంజూరు చేసినట్లు బాలీవుడ్ మీడియా చెబుతోంది.
హన్సికపై విమర్శల వర్షం..
ఇక ఈ విడాకుల విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో హన్సికపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం గతంలో జరిగిన ఒక వివాదమేనని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. హన్సిక మాజీ భర్త సోహైల్ ఖతూరియా ముందు రింకీ బజాజ్ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమె హన్సికకు బెస్ట్ ఫ్రెండ్ అని టాక్. ఇక రింకీ, సోహైల్ వివాహ వేడుకకు హన్సిక హాజరై సందడి చేసిన ఫోటోలు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also Read: Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. హైదరాబాద్‌లో మళ్ళీ పెరిగిన ధరలు.. తులం బంగారం ఎంత ఉందంటే?
ఆ తర్వాత సోహైల్, హన్సిక మధ్య సాన్నిహిత్యం పెరిగిందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో సోహైల్ తన మొదటి భార్యతో విడిపోయి హన్సికను వివాహం చేసుకున్నాడనే చర్చ కూడా సోషల్ మీడియాలో జోరుగా నడిచింది. అయితే ఇప్పుడు హన్సిక, సోహైల్ విడాకులు తీసుకోవడంతో కొందరు నెటిజన్లు ‘కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు విడాకుల సమయంలో భరణం కోరే ఘటనలు ఎక్కువగా చూస్తున్నాం. అయితే హన్సిక మాత్రం సోహైల్ ఖతూరియా నుంచి ఎలాంటి భరణం తీసుకోలేదని సమాచారం. ఆమె ఎలాంటి భరణం తీసుకోనని చెప్పినట్లు తెలుస్తోంది.
చిన్న చిన్న గొడవలే కారణమా?
వీరిద్దరి మధ్య చిన్న చిన్న విషయాలపై తరచూ గొడవలు జరగడం వల్లే చివరకు విడాకుల వరకు పరిస్థితి వెళ్లిందని సమాచారం. అయితే ఈ విషయంపై హన్సిక లేదా సోహైల్ ఖతూరియా నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
కాగా, ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన హన్సిక వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ పరిణామాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అయితే అభిమానులు మాత్రం ఆమె గతాన్ని మరిచిపోయి త్వరలోనే మళ్లీ సినిమాలతో బిజీ కావాలని ఆశిస్తున్నారు.