14 ఏళ్లు నరకం అనుభవించా.. కన్నీటి పర్యంతమైన హీరో జయం రవి

తమిళ నటుడు జయం రవి (Jayam Ravi) తన విడాకుల వివాదం గురించి భావోద్వేగంగా మాట్లాడారు. భార్య ఆర్తితో (Aarti Ravi) జరిగిన పెళ్లి, వ్యక్తిగత జీవితంలో ఎదురైన మానసిక వేదన, అలాగే సింగర్ కెనీషా ఫ్రాన్సిస్‌ (Kenisha Francis)తో రిలేష‌న్‌పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 14 ఏళ్లుగా తాను అనుభవించిన కష్టాలను అనుభ‌వించాన‌న్నారు.

Jayam Ravi_arthi
14 ఏళ్లు నరకం అనుభవించా.. కన్నీటి పర్యంతమైన హీరో జయం రవి

Jayam Ravi | తమిళ సినీ ఇండస్ట్రీలో హీరో జయం రవి వ్యక్తిగత జీవితం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. భార్య ఆర్తితో విడాకుల వివాదం, సింగర్‌ కెనీషా ఫ్రాన్సిస్‌తో రిలేష‌న్ జ‌రిగిన ప్ర‌చారం, సోషల్‌ మీడియాలో జరిగిన ట్రోలింగ్‌ నేపథ్యంలో తొలిసారి మీడియా ముందుకు వచ్చిన జయం రవి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన కుటుంబ జీవితం గురించి మాట్లాడుతూనే కన్నీళ్లు పెట్టుకున్నారు. భార్య ఆర్తిపై సంచలన ఆరోపణలు చేస్తూ, తాను ఎన్నో ఏళ్లుగా మానసిక వేదన అనుభవించానని వెల్లడించారు. 2024లో ఆర్తితో విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత జయం రవి పేరు తరచూ వార్తల్లో నిలిచింది. ఈ విడాకులకు కారణం సింగర్‌ కెనీషానే అంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కెనీషాపై ట్రోలింగ్‌, బెదిరింపులు పెరగడంతో ఆమె ఇటీవల తమ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించింది. చెన్నై నగరాన్ని, సంగీతాన్ని కూడా వదిలి వెళ్తున్నానంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

Read Also :స్విట్జర్లాండ్‌లోనే హనీమూన్‌ షూట్‌ చేయాలా..? నిర్మాతలను కడిగిపారేసిన కమల్‌ హసన్‌..!

బానిస‌లా బ‌తికాను..

ఈ పరిణామాల తర్వాతే జయం రవి మీడియా ముందుకు వచ్చి తన ఆవేదన బయటపెట్టారు. “పద్నాలుగేళ్ల వైవాహిక జీవితంలో నేను బానిసలా బతికాను. హీరోగా పేరు ఉన్నా నా పేరుతో ఒక వ్యక్తిగత బ్యాంక్‌ అకౌంట్‌ కూడా లేదు. ఒకే జాయింట్‌ అకౌంట్‌ ఉండేది. అందులో నుంచి డబ్బు తీసుకోవాలన్నా అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. నేను కష్టపడి సంపాదించిన డబ్బును కూడా ఇష్ట ప్రకారం ఖర్చు పెట్టుకోలేకపోయాను” అంటూ జయం రవి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు తన చేతిలో ఏమీ లేదని, ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నానని చెప్పారు. “నా ఆస్తులన్నీ లాగేసుకున్నారు. పిల్లల కోసమే ఇన్నాళ్లు మౌనంగా భరించాను. ఇప్పుడు వారిని కూడా నన్ను కలవనివ్వడం లేదు. స్కూల్‌కు కూడా సెక్యూరిటీతో పంపిస్తున్నారు” అని వాపోయారు.

Read Also : 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024: కొచ్చిలో మెరిసిన తెలుగు విజేతలు

కుటుంబీకులు ముందే హెచ్చ‌రించారు..

ఆర్తిని పెళ్లి చేసుకోవద్దని తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు ముందే హెచ్చరించారని, కానీ తాను వినలేదని చెప్పారు. “పెళ్లి చేసుకోకపోతే చనిపోతానంటూ బెదిరించింది. చేతులు కోసుకుని బ్లాక్‌మెయిల్‌ చేసింది. దాంతో మరో మార్గం లేక పెళ్లి చేసుకున్నా. మొదటి రోజు నుంచే నరకం చూపించింది” అంటూ జయం రవి ఆరోపించారు. తనకు అండగా నిలిచిన కెనీషాను కూడా టార్గెట్‌ చేశారని, కొన్ని పీఆర్‌ గ్రూప్‌ల ద్వారా కావాలనే వేధింపులకు గురిచేశారని మండిపడ్డారు. “ప్రతి రోజు నరకం అనుభవిస్తున్నా. ఒక దశలో చనిపోవాలనిపించింది. నా చేతిని నేనే కోసుకోవాలనుకున్నా” అంటూ ఎమోషనల్‌ అయ్యారు.

Read Also : విజయ్‌తో అఫైర్ రూమర్స్.. త్రిష పవర్‌ఫుల్ రిప్లై! సోషల్ మీడియా పోస్టుల వెనుక ఆంతర్యం ఇదేనా?

నా జీవితాన్ని ఆ న‌టి నాశ‌నం చేసింది..

ఇక తన జీవితాన్ని ఓ ‘మూడక్షరాల పేరుగ‌ల నటి’ నాశనం చేసిందంటూ మరో సంచలన వ్యాఖ్య చేశారు. ఆమె పేరు చెప్పనని, కానీ తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడే హక్కు ఆ నటికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నటి ఎవరన్నదానిపై ఇప్పుడు కోలీవుడ్‌లో పెద్ద చర్చ నడుస్తోంది. విడాకుల ప్రక్రియ పూర్తయ్యే వరకు సినిమాలకు దూరంగా ఉంటానని కూడా జయం రవి ప్రకటించారు. “వ్యక్తిగత జీవితాన్ని సరిచేసుకున్న తర్వాతే కెమెరా ముందుకు వస్తా. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలు చేస్తే వాటిపైనా ప్రభావం పడుతుంది” అని తెలిపారు. జయం రవి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళ సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

Read Also : INCA అవార్డ్స్ 2026: ఉత్తమ నటుడిగా నాగచైతన్య.. రష్మికకు ఉత్తమ నటి అవార్డు! ఏప్రిల్ 16న వేడుక

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »