రేపు మెగా ఇంట పండుగ వాతావ‌ర‌ణం.. రాముడు పుట్టిన న‌క్షత్రంలో క‌వ‌ల‌ల‌కి జ‌న్మ‌నివ్వబోతున్న ఉపాస‌న‌

ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వనున్నట్లు సమాచారం. మెగా ఫ్యామిలీకి మరోసారి వారసులు రాబోతుండటంతో, అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది.

Upasana, Ram Charan all set to welcome twins
  • జనవరి 31న ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వనున్నట్లు సమాచారం

  • పునర్వసు నక్షత్రం శ్రీరాముడి జన్మ నక్షత్రం కావడంతో అత్యంత శుభదినం

  • మెగా ఫ్యామిలీకి డబుల్ జాయ్.. అభిమానుల్లో పండుగ వాతావరణం

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , ఉపాసన కొణిదెల దంపతులు ఇప్పటికే 2023 లో ఒక పాపకి జ‌న్మ‌నిచ్చారు. ఆ పాపకు క్లీంకార కొణిదెల అని పేరు పెట్టారు. ఇప్పటివరకూ అభిమానులకు పాప ఫేస్ చూపించ‌క‌పోయిన‌, స్టార్ కిడ్ కాబట్టి ఫ్యాన్స్ మధ్య మంచి చర్చకు కేంద్రంగా ఉంది. త‌మతో దిగిన ఫొటోలు ఉపాస‌న షేర్ చేసిన కూడా పాప ఫేస్ మాత్రం అస్స‌లు చూపించ‌డం లేదు. అయితే కొన్ని సార్లు మాత్రం పాప ఫేస్ చూపించి చూపించ‌న‌ట్టుగా రివీల్ చేయ‌డంతో ఆమె అచ్చం చిరు మాదిరిగా ఉంద‌ని కొంద‌రు కామెంట్స్ చేశారు.

ఇప్పుడు ఉపాసన మళ్ళీ గర్భవతిగా ఉన్న విషయం తెలిసిందే. గత సంవత్సరం దీపావళి సందర్భంలో ఆమె సీమంతం వీడియోను సోషల్ మీడియా వేదికలో షేర్ చేసి హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు రామ్ చరణ్ – ఉపాసన దంపతులు డబుల్ హ్యాపినెస్‌తో ఉత్సాహంలో ఉన్నారు.

రేపే డెలివ‌రీ..

  • ఉపాసన రేపు ( జనవరి 31న ) జ‌న్మ‌నివ్వ‌నబోతుంది.
  • మెగా ఫ్యామిలీకి వారసులు వస్తుండటంతో ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
  • రామ్ చరణ్ సీమంతం వీడియో షేర్ చేసి అభిమానులకు ముందుగానే ఈ సంతోషాన్ని తెలియజేశారు.

నక్షత్రం, తిథి మరియు ముహూర్తం :

  • హిందూ పంచాంగం ప్రకారం, జనవరి 31, శనివారం, ఉదయం 7:38 వరకు త్రయోదశి తిథి ఉంది.
  • 7:38 తరువాత చతుర్థశి తిథి ప్రారంభమవుతుంది.
  • ఈ రోజు శని త్రయోదశి పంచాంగ ప్రకారం పవర్‌ఫుల్ తిథిగా పరిగణించబడుతోంది.
  • నక్షత్రం: పునర్వసు, రాత్రి 1:41 వరకు కొనసాగుతుంది.
  • పునర్వసు నక్షత్రం శ్రీరామచంద్రుడి నక్షత్రంగా ప్రసిద్ధి. రాముడు కూడా ఈ నక్షత్రంలో పుట్టారు.

ఫ్యాన్స్ రియాక్షన్ :

మెగా ఫ్యామిలీ భక్తుల ఆరాధ్య దైవం ఆంజనేయస్వామి, మరియు శ్రీరాముడు సంబంధం ఉన్నందున, ఫ్యాన్స్ ఈ రోజు వారసులు పుట్టడం అదృష్టంగా భావిస్తున్నారు.

పునర్వసు నక్షత్రం పట్ల పండితుల అభిప్రాయం: ఏ పాదంలో జన్మించినా శుభం, ఎలాంటి దోషం ఉండదు.

ఫ్యాన్స్ అంచనాలు :

మెగా ఫ్యామిలీకి కొత్త వారసులు వ‌స్తుండ‌డంతో అభిమానులను ఉత్సాహం నెల‌కొంది.

ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికల్లో ఉత్సాహంగా స్పందిస్తూ, రామ్ చరణ్ – ఉపాసన దంపతుల కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఈ పునర్వసు నక్షత్రంలో పుట్టబోయే కవలపిల్లలు మెగా ఫ్యామిలీకి సంతోషం నింపనున్నారు. అభిమానులు ఈ ముఖ్యమైన ఘట్టం కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »